నువ్వు వస్తావని
posted on Jul 2, 2013
నువ్వు వస్తావని
నువ్వు వస్తున్నావని చిరుగాలి కబురు తెచ్చింది
అది విన్న నా మనసు ఆనందంతో నాట్యమాడింది
ఇప్పుడే నా చుట్టూ వెన్నెల విరబూసింది
నువ్వు లేక నా కంటి కాటుక కరిగింది
ప్రతిరోజు నా కన్నీరే నాకు తోడుంది
నేను వద్దన్నా నా మనసు నా మాట
వినకుండా నీతో వచ్చేసింది
నీ అండతో నా మనసు నామాట వినను అంటుంది
ఇంతవరకు పెదవులపై చిరునవ్వు దూరమైంది
నువ్వు వచ్చాకే అది తిరిగి వచ్చింది
వెన్నెలకూడా నాపై ఇన్నాళ్ళు అలిగింది
ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్నుఅడిగింది.
ఆ ప్రశ్నకి నా సిగలోని గులాబి నవ్వింది
ఇది చూసిన నా హృదయం కొంగుచాటున దాగింది
నీలా నేను దాగలేనంటూ నా ముఖం చిన్నబోయింది
నువ్వే నా ఆనందాన్ని తిరిగి తీసుకొచ్చింది