మాననిగాయం

పట్టపగలే ఇంటిగుమ్మంలోనే వాలిపోతున్న బతుకులు పూటగడిస్తే చాలన్నట్లు అలజడి లేని జీవనగమనం కాలమేసే కాటునుండి కోలుకున్న గ్యారంటీ లేని జీవితం లక్ష్మణరేఖలెన్ని గీసినా కాలరాక్షసిలా తనరూపం మార్చుకుంటూ ముప్పేట వేట మునుపెన్నడు చూడని ముప్పు ధరణిపై తన ఆధిపత్యం చెలాయిస్తూ దేహాలనన్నీ పీల్చిపిప్పిచేస్తోంది ఆరనిజ్వాలను రగిలించింది ప్రపంచాన్నంతా గజగజలాడిస్తూ  తన పంజాదెబ్బ రుచిచూపిస్తోంది తనువులన్నీ రాలుతున్న దృశ్యం తరుముతున్నా అలుపెరుగని పోరాటం కటువుతనం పుడమినిండుకున్నది కోల్పోతున్న ఆప్తుల యాదిలో జారిపడుతున్న కన్నీరు ఆశలన్నీ కాలిపోతున్న కాలం కాలమాగిపోతున్నట్టు  నవ్వులన్నీ మాయమౌతున్నయ్ మబ్బులునిండిన జీవితంలో స్వప్నశిల్పాలన్నీ పగిలి పటాపంచలౌతున్నయ్ విశాలమైన విశ్వమంతా  ఇంటిలో ఇమిడిపోయింది ఎడతెరపిలేని దండయాత్రలో ఊపిరిదొరకక ఉక్కిరిబిక్కిరి గుండెనిండ భయం పరుచుకున్నది రోజుకో గాయం! గమనం ఓ సమరం!! వర్తమానం మళ్ళీ గతంలా భవిష్యత్తు చిత్రం చిగురిస్తుందా??     సి. శేఖర్(సియస్సార్)    

ప్రకృతి చిన్నబోయింది

అతడు పేరుతగ్గట్లు సుందరుడే సమాజమెపుడు సవ్యంగా నడవాలనే ఆశయం  అందరూ సమానమనే వాదం ఆయన నినాదం ఎదనింపుకుని సాధించేందుకు ఉధ్యమానికైనా వెనకాడని నైజం ఆయన సొంతం మనిషి ఉన్నతికోసం ఆహర్నిషలు ఆరాటం అదే ఆయన పోరాటం దేశ దాస్యశృంఖాలాలను చేదించడంకోసం  అహింసమార్గంలో ఎదిరించిన గాంధేయవాది ఆయన దేశంకోసమే కాదు మనుషులకోసమేకాదు దేశంలో ఉండే ప్రతీది సస్యశ్యామలంగా ఉండాలనే  దృడసంకల్పం  చెట్లుచేమలు పచ్చగ అలరారుతూ  నోరులేని మూగజీవాలను సైతం ప్రేమించిన సాధుజీవి బహుజనులపక్షం నిలిచి సమాసమాజానికై పాటుపడిన సుందర్ లాల్ బహుగుణ ప్రేమించిన ప్రకృతిని పాడుచేసే వికృతకారుల దాడిని ఆపినవాడాయన అవనిలోని అందానికి సహజత్వాన్నద్దిన మేధావి అడవులైన నదులైన మనిషికి అవసరాలకు ఉపయోగపడేలా ప్రతినభూనిన మహోన్నత వ్యక్తిత్వం చిప్కో ఉద్యమంతో వనరుల సంరక్షణ చేపట్టి మానవాళి మనుగడకు  తోడ్పాటునందించిన ప్రకృతి పక్షపాతి కాలంవేసిన కాటుకు బలైన బహుగుణ సంపన్నుడు శాశ్వతం ఆయన భవిష్యత్ భారతం (సుందర్ లాల్ బహుగుణ మరణించిన సంధర్భంగా స్మరిస్తూ)   సి. శేఖర్(సియస్సార్)  

ప్రతినాయకులే

రాజ్యమిపుడు మాటలతో మాయచేసి అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళ చేతుల్లో మరణశాసనం లిఖిస్తుంది జనంకోసం తపనపడే నాయకుడొకడులేడు ఉత్తుత్తి మాటలతో కోటలుగట్టే  మోసగాళ్ళ చేతుల్లో తగలడుతున్న రావణకాష్టం జనాలు కళ్ళింకా మూతబడేవున్నయ్  మూతబడుతూనే వున్నయ్ శాశ్వతంగా దోచుకుని దాచుకునే కుటిలనాయకత్వమే  ఉన్నోడికెప్పుడూ చుట్టమే చట్టమైనా  ఏదైనా  కాపాడిల్సినోళ్ళే బయటికిరాకుండా చేతులుముడుచుకున్నరు చేతకానితనాన్ని ప్రదర్శిస్తున్నరు పూటగడవని బతుకులకింత ఆసరా లేకపాయే సినిమా కథానాయకులైతే అభిమానం మాటున కోట్లు గడించి  చడిచప్పుడులేకుండా మన్నతిన్నపాములైరి వారురారు సహాయంచేయరు ఆకాశహార్మ్యాల్లో కులుకుతున్నరు ఎవరురా నాయకులు? ఏదిరా అభిమానం? గమనించుకోవాలందిరిపుడైనా ఎవరికోసం ఎవరురారు  నీ కోసం నువ్వే బతకాలి అందరూ సోనుసూదులు కారు మానవత్వాన్ని మనసునిండా నింపుకున్న మనిషి ఈ యుగానికొక్కడు మాటలతో లేనిదాన్ని ఉన్నట్లుజూపే పిట్టలదొరలు నేటి నాయకులు జాగ్రత్త... జాగ్రత్త... జాగ్రత్త!!   సి. శేఖర్(సియస్సార్)

కరోనా కరోనా ఏం చేస్తావ్ అని అడిగితే

ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో కూడా కాలుష్యం తగ్గించాను. సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి విశ్రాంత కల్పించాను. కుటుంబాలతో సమయం వెచ్చించేలా చేశాను. డబ్బు ఒక్కటే ప్రాధాన్యము అనుకునే పరిగెత్తుకుని వాళ్ళకి బుద్ధి తెచ్చేలా చేశాను. రోజు మందు లేకపోతే బతకలేను అనే వాళ్ళ చేత మందు లేకుండా ఉండేలా చేశాను. డబ్బున్న ఏమీ చేయలేని ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి కల్పించాను. ప్రైవేట్ డాక్టర్లు ఎంత స్వార్ధపరులో జనాలకు చూపించాను. వైద్య వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంతో ప్రభుత్వాలు ఉన్నాయో అందరికీ తెలిసేలా చేశాను. ఎంత డబ్బు ఉన్నా మీకు నచ్చింది కావాల్సింది దొరకకపోతే ఆ బాధ ని ఎలా అధిగమించాలో నేర్పాను బతికుంటే చాలురా భగవంతుడా అనుకునేలా చేశాను. ఎన్ని కోపాలు తాపాలు ఉన్న బయటకు వెళ్ళలేక ఇంట్లో వాళ్లతోనే సర్దుకుపోయేలా చేశాను. క్యాష్ తప్ప ఇంకేమీ అలవాటు లేని వాళ్ళ చేత ఆన్లైన్ పేమెంట్ అలవాటు చేశాను. యాక్సిడెంట్లు లేకుండా చేశాను.. ఈ భూమి మనుషులకు మాత్రమే కాదు జంతు జీవరాశులకు కూడా అని వాటికీ ప్రశాంతమైన వాతావరణం కల్పించాను. ఎల్లప్పుడూ బిజీగా ఉండే వాళ్ళు నాకు ఇప్పుడు ప్రశాంతంగా దొరుకుతుందా అని ఏడ్చే వాళ్లకి ఇంట్లో ఖాళీగా ఉంటే ఎంత నరకం అని తెలిసేలా చేశాను. మేము అగ్రరాజ్యాల మని విర్రవీగే వాళ్ళని పడుకునేలా చేశాను.. వైద్యం మీద కాకుండా రక్షణ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టినందుకు బాధపడేలా చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్ లను ఇప్పటిదాకా ఇలా ఎందుకు ఉంచారు అన్న బాధపడేలా చేశాను. డబ్బుతో అన్ని సుఖాలు ఇష్టాలు రావు సర్దుకుపోవడం లోనే వస్తుంది అని ప్రతి ఒక్కరికి నేర్పాను. మనకెందుకు చావు వస్తుందా అని ధీమాగా ఉన్న వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించే అలా చేశాను.. క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని వాళ్లకు అది నేర్పాను ఇలాంటి టైం లో కూడా సేవ చేసే వాళ్ళు ఉంటారు అని సమాజానికి చూపించాను. లోకం లో మనిషి పుట్టుక అద్భుతం!* నవ్వుతూ బ్రతకాలి నలుగుర్ని నవ్విస్తూ బ్రతకాలి!* *అంతా మట్టే మట్టిలో పుట్టాము! *మట్టిలోకి పోతాము!

ఇంటింటి రామాయణం

ఏదీ…మారలేదు. ఆరోజు…. లేనిది… ఉందని ఉన్నది ఎత్తి పెట్టుకొని కొంచం కారంగా, కొంచం ఉప్పగా, కొంచం తీయగా, కొంచం కన్నీళ్లుగా తిరగొట్టుకొని అడుగు నుండి అడుగులోకి గొంతు నుండి గొంతులోకి త్యాగమో, తెగింపో మెత్తగా జారడం అప్పుడూ…ఉంది ఇప్పుడూ… ఉంది. ఎందుకో…? మారడం లేదు మున్ముందు మారుతుందని కూడా అనుకోవడం లేదు మారాలని మారి… కడుపులో ఎలుకల రొదను చంపాలని ఆశించడం శిక్ష… మరి…నేను… నేరం చేసిందెప్పుడు? ముప్పై ఏళ్లుగా అదే కంచం… నిన్న వృధా అనుకున్నది… రేపటికి పనికిరాదనుకున్నది చెడిపోతుందేమోనని భయం భయంగా నేటి జీవితం. మా ఇంటి ఆడోళ్లు   ఎప్పుడు మరణించారో సరిగా గుర్తు రావడం లేదు ఈగలు ముసిరిన చోటో  చెల్లాచెదురైన సమయాన్ని మంచం మీద కుప్పగా పోసిన చోటో గతమూ, వర్తమానమూ భవిష్యత్తుకు గుండుసూదౌతుంది  ఓ…బేగం ఆ చెత్తకుప్పలో నువ్వు విసిరింది నా చెమటే.    - లై 

డబ్బు చెబుతుంది

డబ్బు చెబుతుంది  అందరినీ మరిచి నన్ను సంపాదించమని  సమయం చెబుతుంది అన్నింటినీ మరిచి నన్ను అనుసరించమని  భవిష్యత్తు చెబుతుంది అన్నింటినీ మరిచి నా కోసం శ్రమించు అని  కానీ దేవుడు చెబుతాడు అందరికీ మంచి చేస్తూ ఉండు నీకేం కావాలో నేను చూసుకుంటానని     నీ గమ్మం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి ఎత్తిచూపే వేళ్ళుంటాయి వ్యంగంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి  బెదిరావో నీ గమ్యం చేరలేవు సాగిపో నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు కష్టం ఎప్పుడు వృధా పోదు      ఈ ప్రపంచంలో మనిషికి విలువ ఇచ్చేవి  ఒకటి ప్రాణం రెండు డబ్బు విచిత్రం ఏమిటంటే డబ్బు వచ్చాక ప్రాణం ఉండదు ప్రాణం ఉన్నప్పుడు డబ్బు ఉండదు  అందుకే ఉన్నదాంట్లో ప్రాణం ఉన్నంతవరకు సంతోషంగా ఉండటమే జీవితం ....చందమామ బాబు

మసులుకో...

ఈ గుంజాట ఇంకెన్ని రోజులో పడుతూ... లేస్తూ... వేసుకున్న రంగులు తుడుచుకుంటూ తుడుచుకున్న రంగులు వేసుకుంటూ ముక్కలైన సూర్యుడిలా  బ్రతకడం, అంతలో చావడం అగ్గిపుల్ల తలకు ఒక చిన్న నవ్వునో, నవ్వులాంటి తడినో వెలిగించాలి... రాపిడి జరిగే చోట మొక్కను నాటి, మట్టిని ఒత్తుగా చేసి ఒక ఆనకట్ట కట్టాలి ఒక పక్క నుండి సర్దుకుంటూ మరో పక్క నుండి అప్పుడెప్పుడో ముఖం నుండి రాలిపోయిన ఎమోషన్స్ ని బలవంతంగా కూర్చోబెట్టుకుంటూ ఈదడం నేర్చుకోవాలి పదే పదే తలుచుకుంటూ తలుచుకున్న విషయ తీగను తెంపుకుంటూ ఒక చోట మరణిస్తూ మరోచోట జీవిస్తూ కాలపు పొయ్యి గడ్డపై సగం విరిగిన చంద్రుడిలా;  జొన్నరొట్టె. శరీరం అప్రయత్నంగా మసలినట్టు లేదా మసలినట్టు నట్టించినట్లు ఆలోచనలు కూడా మసలాలి... లేదంటే అగ్గిపుల్ల రోధిస్తుంది జొన్నరొట్టె- పాములా కదులుతుంది ఆనకట్టకు తూము పడుతుంది రంగు వెడలిపోతుంది అంతటితో ఈత ముగుస్తుంది లై 

నిర్ణయం నీదే

  గాంధీ ఆస్పత్రి ఎదురుగా..!   అంబులెన్స్ లో   ఆక్సీజన్ సిలెండర్ తో   గాలి పీలుస్తూ బెడ్డు కొరకు   ఎదురు చూసేకంటే...!   నీవు జైలనుకుంటున్న   నీ ఇంటి కిటికీలో నుండి   స్వచ్ఛమైన గాలి పీలుస్తూ   పరిసరాలు చూడ్డం   ఆనందం కాదా....!!   ఎక్కడో ఆసుపత్రి లో   రోగులు, శవాల మధ్య   బిక్కు బిక్కు మంటూ గడపడం కంటే..!   నీ ఇంట్లో నీ వాళ్ల మధ్య ఉండడం   సుఖం కాదా...!!   దూరం నుండి పారేసే   రుచి , పచి లేని తిండి కంటే..   నీ ఇంట్లో నీవారు   వండి వడ్డించే భోజనం   రుచికరం కాదా...!!   హాస్పిటల్ చూరును చూస్తూ   రేపు ఉంటానో లేదో అని   క్షణ క్షణం ఘడియలు   లెక్క పెడుతూ గడిపే కంటే..!   భవిష్యత్తు గురించి కలలు కంటూ   నీ హాల్లోనే టీ వీ చూస్తూ ఉండడం   హాయి కాదా...!!   చావు భయంతో అగుపించే   యమభటుల సావాసం కంటే   నీ కంటి పాపలైన   నీ పిల్లలతో సహవాసం   అద్భుతం కాదా...!!   ఆసుపత్రిలో బెడ్డు కొరకు   కాని వాళ్ళందరి   కాళ్లు పట్టుకునే కంటే..!   నీ పడక గదిలోని   బెడ్డు పై పడుకుని కలలు కనడం    అదృష్టం కాదా...!!   బ్లాకులో మంచాలకు మందులకు   లక్షలు పారబోసుకుని   అప్పుల పాలయ్యేకంటే..!   ఒక నెల రోజులు   ఇంట్లోనే ఉండి   లక్షలు ఆదా చేసుకోవడం   తెలివైన పని కాదా...!!   పదిహేను రోజులు   నరకం చూపే హాస్పిటల్ కన్నా   పదిలమైన నీ ఇల్లే ఎప్పటికీ మిన్న..!!   బయటకెళ్లి నీవు వెలగ బెట్టే   రాచకార్యాలిపుడు సున్నా..!   నీఇంట్లో ఉండి నీవు చేసే   నీ ఇంటి పనులే   ఇపుడు గొప్ప ఎవరేమన్నా..!!   మన క్షేమమే దేశ క్షేమం   మన హితమే జన హితం   ఇక   నిర్ణయం మనదే...!   ముమ్మాటికీ    మనదే....!!  

ఊరు నిదరోయింది

ఊరు నిదరోయింది... పట్టపగలేనట్టనడివీధిన ఊరునిదరోయింది... ఊపిరాడక ఏజామున ఏమూలన ఎవరింట్లో బోరుమనేనిశ్శబ్దం తాండవమాడతందోనని ముందుగానే ముంగిట్లో ఊరు నిదరోయింది... కడుపులో కాలుకదుపుతున్న తొమ్మిదినెలలపసిగుడ్డు అసువులుబాసిన అమ్మతనాన్ని చూడకుండా గడ్డకట్టినవార్త వినిపించవలివస్తుందోనని ముందుగానేఊరునిదరోయింది.. భయంగుపెట్లోబరువెక్కి బతుకుభారంతోబిక్కుబిక్కున ఉస్సురంటూ..తుదిశ్వాస ఆగిపోతందోనని.. ముందుగానేఊరునిదరోయింది.. కాటినిండాకణకణకాలే.. శవాలకమురువాసనలతో ఊరేవల్లకాడులామారుతుందేమోనని ముందుగానేఊరునిదరోయింది.. పిల్లల్ని అనాధలుగావదలి వెళ్ళిపోయినతల్లిదండ్రుల జ్ఞాపకాలతోరోధిస్తున్న రోదనల్నివినలేక.... ముందుగానేఊరునిదరోయింది పలకరించే పిలుపులేక ఓదార్చేఉనికిలేక దరిచేర్చేదారిలేక స్పృసించేస్పర్శలేక ఊరుఊరుగాలేదు వెలివేసినవాడలావుంది ఇపుడు మానవజాతికి వాసనతెలియటంలేదు రుచితెలియటంలేదు. శ్వాస అందక నాదేశం ప్రాణవాయువు కోసం మొక్కలునాటుతుంది.....             -గుడిసేవ.విష్ణుప్రసాద్

కూలిపోతున్నారు

అండగా ఉన్నాం... భయం వీడి పోరాడండి. కూలిపోతున్నారు  కాలిపోతున్నారు కరాళ కరోనా వైరస్  నిత్య కృత్య విశృంఖల దాడిలో... కాటికి పోతున్నారు కనుమరుగవుతున్నారు                       "కూలిపోతున్నారు" సమాజ హితం కొరకు రచనలు చేసిన కవులు జనం కొరకు జగతి కొరకు పని చేసిన కళాకారులు  యదార్థ సంఘటనలను కళ్ళకు కట్టిన జర్నలిస్టులు                        "కూలిపోతున్నారు" రోగపీడితులకు భరోసా  కళ్ళెదుట నిలచిన వైద్యులు  కంటికి రెప్పలా కాచే వైద్య సహాయకులు శాంతి భద్రతలను కాపాడే  పోలీసు సహోదరులు                        "కూలిపోతున్నారు" మనసులు తెలిసి మసలే ప్రియతమ మిత్రులు  సన్నిహితంగా పనిచేసిన సహచర ఉద్యోగులు జీవన యానంలో కలిసే జీవిత పథగాములు                        "కూలిపోతున్నారు " సహచరులను కోల్పోయిన  యువతీయువకులు  చేతులలో వాలుతున్న రక్తం పంచిన బిడ్డలు నిస్సహాయులుగా మారి చేస్తున్న ఆక్రందనలు                        "కూలిపోతున్నారు" ఎప్పుడు ఏ దారుణం వినవలసి వస్తుందోనని ఊపిరి బిగబట్టి మనసును చిక్కబట్టి కుమిలి కమిలి పోతున్న  మన తోటి మానవులు                    "కూలిపోతున్నారు" కళ్ళెదుట జరుగుతున్న  మానవ మారణ హసనం ఓదార్పుకు నోచుకోని దిక్కులేని దీనజనం అండగా మేమున్నాం  భయం వీడి పోరాడండి.                     "కూలిపోతున్నారు"  

చీలిక

కొమ్మ నుండి ఆకులు రాలిపోయినట్టు మేఘాల నుండి నీరు జారిపోయినట్టు కన్నుల నుండి చూపులు చెదిరిపోయినట్టు నా నుండి మనుషులు విరిగిపోతున్నారు అప్పుడప్పుడు పెదాలపై ఎంగిలిని అద్దుకుంటూ నాలుగు మాటలు చెరుగుతారు ఆ మాటలన్నీ చితిపై పేర్చిన పిడకలే తల్లి కోడి తన రెక్కలను భూమిపై పరిచి వివక్షా గీతాలను నిసిగ్గుగా ఆలపిస్తుంది సమానత్వం లేని తల్లి ముల్లుల హారమే ఆవిరైపోయే కాలం కింద పువ్వులను తోడుకుంటూ కొండకు, కొండ కింద అక్షరాల తోటకు మంట పెట్టావు… నువ్వు ఆగింది మొదటి శుక్రవారానికి కావచ్చు నేను రాసింది… అగ్గి సత్యాలను, అనంత లోయలను కొమ్మ విరిగిన చప్పుడు అదీ… నా మనసే ఏమో!    - లై  

మనుగడ ఎక్కడ?

  మారుతున్న కాలగమనంలో మానవ మనుగడ ఎలా? ప్రాణం నేడొక గాలిలో దీపం! చేతులడ్డుపెట్టి కాపాడే నాథుడే కరువాయే!! కరుణ కనిపించని లోకమిది ఎంత భ్రమసినా అది అగమ్యగోచరమే కరుణలేకనే తరువులన్నీ నరికిన మనిషికి నేడది దొరకని సరుకయ్యి ఊపిరిదొరకక ఊపిరితిత్తులు ఉసూరుమంటూ మనిషిని సాగనంపుతున్నయ్! కళ్ళముందే రాలిపోయే దేహాలు!! చిన్నా పెద్దా తేడాలేదు  ఐశ్వర్యమెంతున్నా గాలాడని గందరగోళం మనిషి రక్షణగోడలులేని ఆక్రమణకు దారి ఇల్లు కూలిపోతున్నయ్ మనుషులు మాయమైతున్నరు క్షణం క్షణం భయం భయం గుండెల్లో కనపడని వేధనా కరోనా అకాల దాడిలో సామాన్యులెందరో సమిధలౌతున్నరు ఊళ్లు నగరాలు అన్నీ శ్మశానాలు ఆరని మంటలకు ఆనవాళ్లు కనిపించని దుఃఖాన్ని దిగమింగుతున్న హృదయం విశ్వమంతా నేడెక్కడైనా చావుమేళాల వేడుకలు ఎక్కడి దారులక్కడ మూసుకుపోయి  అవకాశాలు అదృష్యమైపోతుంటే  గాలిదొరకని దారుల్లోకి పయనమైనట్టుంది.   సి. శేఖర్(సియస్సార్)

మన ఆనందం ప్రకృతి

ప్రతి మనిషి ఆహ్లదంగా  జీవనం సాగించాలని ప్రతినిమిషం ఆరాటం ప్రకృతి అమ్మ ఒడిలా లాలిస్తుంది పుడమినంత పచ్చదనంతో పులకరింపజేస్తుంది ఎన్నో జీవరాసులకు సంరక్షణ ప్రకృతి రక్షణ మనందరి బాద్యత ఆకాశంలో హరివిల్లులా అవని ఎదపై విరియాలి నందనవనాలెన్నో! ప్రకృతి మనందరవసరాలను కాలానుగుణంగా తీరుస్తుంది కానీ..మనిషి స్వార్థం ప్రకృతికి శాపమయ్యింది తరువులను నరికి జగతినంతా నరకంగా మారుస్తున్నాం ప్లాస్టిక్ భూతానికి భూతల్లి శక్తిని కోల్పోతుంది వ్యర్థాలన్ని నదుల్లో కలిసి తాగే నీరు కాలుష్యం సహజత్వం లేని కృత్రిమత్వం ప్రకృతిని కాపాడలేని మనిషి తన వినాశనాన్ని తానే తెచ్చుకుంటున్నడు కావునా  కళ్ళు తెరవాలందరం  ప్రకృతిని కాపాడగ అడుగేయాగ   కె. ఉదయ్ కుమార్  

చెమట చుక్కలు

పనిచేసే మనుషులు పిడికిలెత్తి ఒక్కటైన రోజు పనికింత సమయమంటూ తమకు హక్కులుంటాయని పనికి విలువ వచ్చిన రోజు దోపిడిదారుల కోరలను పీకేసిన రోజు పెట్టుబడిదారుల మోసం తేటతెల్లం చేసిన రోజు చెమటచుక్కలన్ని ఆకాశంలో పరచుకున్నట్టు శ్రమజీవులంతా ఐక్యతమత్మ్యం చూపిన రోజు కర్షకవీరులలో పారే రుధిరం ఎర్రజెండాగా మారి  కార్మికుల ఐక్యతకు నాంది పలికిన రోజు కార్మికుల సంక్షేమం విశ్వమంతా వికసించినరోజు మరేమిటో ఇప్పుడు నా దేశంలో శ్రమజీవులంతా ఏకమై నేతలు ఉన్నతులకోసం చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తే   కపటబుద్దిని బట్టబయలు చేసిన ప్రభుత్వం అణిచివేతతో హక్కులు కాలరాజేస్తున్నా కాలమిది ప్రశ్నించినోడిక్కడ దేశద్రోహి ఆనాడెపుడో మే డే అంటూ సమ్మెహక్కు సాదించారు ఈనాడేమో కష్టజీవులను అణిచివేస్తూ కటకటాల్లోకి తోసేస్తున్నరు సామాన్యులకేంకావాలో ప్రభుత్వానికి పట్టదాయే పెట్టుబడిదారుడే వారికి నిత్యదైవమాయే నాయకులంతా వారి చెప్పుచేతుల్లో బందిలైరి తిరోగమనం వైపు అడుగులు కార్మికుల ఉద్యమమేదో ఉగ్రరూపం దాలుస్తున్నట్టు ఆకలికేకల పిడికిల్లన్ని ఒక్కటైతై..   సి. శేఖర్(సియస్సార్)