నీ ఆత్మ బలం నీ  మరణాన్ని కూడా వెనక్కి నెడుతుంది...

Publish Date:Feb 4, 2025

Advertisement

 

హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాక  క్యాన్సర్  ఉందని  నిర్ధారిస్తే లేనివాడయినా, ఉన్నవాడయినా వాళ్ళ కాళ్ళ క్రింద భూమి కదిలినట్టే ఫీలవుతారు.  ఏటా లక్షలమంది ప్రాణాలని పిండేస్తూ, అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా కొనసాగుతోన్న ఆ మాయదారి రోగం క్యాన్సర్... ప్రపంచమంతటా ఇది చాపకింద నీరులా అల్లుకుంటుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెలువరించిన డేటా ప్రకారం, 2022లో క్యాన్సర్ దాదాపు కోటిమంది  ప్రాణాలను బలిగొంది. కాలక్రమేణా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.  ఇంతటి ప్రాణాంతక వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, తగిన  చర్యలకు ప్రేరేపించడానికి, క్యాన్సర్ భూతాన్ని నిర్మూలించడానికి  ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుతారు. ఈ సందర్భంగా క్యాన్సర్ గురించి మరింత తెలుసుకుంటే..

 ఎప్పుడు మొదలైంది..

2000, ఫిబ్రవరి 4న పారిస్‌లో జరిగిన ప్రపంచ క్యాన్సర్ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రకటించారు. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ నిర్వహించిన ఈ కార్యక్రమం, క్యాన్సర్ ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తెచ్చేందుకు, దీని నివారణకు చర్యలు తీసుకోవడానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

2025 థీమ్..

ఈ సంవత్సరానికిగానూ,  "యునైటెడ్ బై యూనిక్"  అనే థీమ్ ఎంచుకున్నారు. ఇది 2025-2027 మూడేళ్ల ప్రచారానికి శ్రీకారం చుడుతుంది. ఈసారి జరిగే  ప్రచారంలో  క్యాన్సర్ చికిత్సలో వ్యక్తిగత అనుభవానికి ప్రాముఖ్యతనిస్తారు.  ప్రతి క్యాన్సర్ రోగి ప్రయాణం భిన్నమైనదని గుర్తించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

అవగాహన చాలా ముఖ్యం..

క్యాన్సర్  వచ్చిందంటే ఇంకేమీ చేయలేము అనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ ముందుగా గుర్తించగలిగితే చాలా మటుకు క్యాన్సర్లని  తగ్గించే వైద్యం అందుబాటులో ఉంటుంది. అందుకే దీనిపట్ల అవగాహన ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉండి తొలిదశలోనే గుర్తించగలుగుతారు.  తక్కువ, మద్య ఆదాయ దేశాలు దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా క్యాన్సర్ ముప్పును ఎదుర్కోవడంలో ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అలాగే, నిరక్షరాస్యత, క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం కావడం, ఖర్చుతో కూడుకున్న చికిత్స కారణంగా క్యాన్సర్‌ కు వైద్యం అందరికీ అందడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం నిర్ధారణను ఆలస్యం చేస్తుంది. 2020లో భారతదేశంలోని నాలుగు ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, క్యాన్సర్ రోగులలో చాలామంది ముందుగా చికిత్స పొందటానికి వచ్చే సమయానికి అప్పటికే వారి వ్యాధి తీవ్ర స్థితికి చేరుకున్నట్లు గుర్తించారు. అందుకే శరీరంలో మార్పులని గమనించటంలో,  క్యాన్సర్ లక్షణాలు గుర్తించటంలో కాస్త అవగాహన అందరిలోనూ ఉండాలి. క్యాన్సర్ కేవలం పెద్దవాళ్లలోనే వస్తుంది తప్ప పిల్లలకి రాదు అని, షుగర్  వల్ల  క్యాన్సర్ పెరుగుతుందని, క్యాన్సర్ వైరస్ ద్వారా వస్తుందని.. ఇలా ఎన్నో అపోహలు, భయాలు సామాన్య జనంలో ఉంటుంటాయి. క్యాన్సర్ పట్ల తగిన అవగాహన లేకపోవటమే దీనికి కారణం.

భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తక్కువ,  మధ్య ఆదాయ దేశాల్లో, క్యాన్సర్ స్క్రీనింగ్, నిరోధక చర్యలు, చికిత్సల గురించి అవగాహన తక్కువగా ఉంది. ఇది క్యాన్సర్ వ్యాప్తిని పెంచే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ నివారణ, ముందుగా గుర్తించడం, చికిత్స చేయడంలో ఉన్న ప్రాముఖ్యతను అందరికీ గుర్తు చేస్తుంది.

 మంచి అలవాట్లు..

సిగరెట్, బీడీలు కాల్చే అలవాటున్నవాళ్ళు, మందు తాగేవాళ్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు తీసుకునేవారు  అవన్నీ తక్షణమే మానుకోవాలి. టీవీల్లో ,సినిమాల్లో బయట ఇలా ఎన్నిచోట్ల ప్రచారం చేసినా వీటిని మానడం లేదు.  వీటిని మానేస్తే నోరు, గొంతు, కాలేయం వంటి భాగాలకి వచ్చే క్యాన్సర్ రాకుండా ఆపొచ్చు.  క్రమం తప్పకుండ వ్యాయామం చేయటం వల్ల బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ ముప్పునుంచి తప్పించికోవచ్చు.  హెచ్‌పి‌వి, హెపటైటిస్ బి వంటి వ్యాక్సిన్లు తీసుకోవటంవల్ల గర్భాశయ, కాలేయ క్యాన్సర్లను నిరోదించవచ్చు. మంచి పోషకాహారం తీసుకోవటం, శరీరంతో పాటూ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఒత్తిడిని తగ్గించుకోవటం, క్రమం తప్పకుండ వైద్య పరీక్షలు చేసుకోవటం వంటి అలవాట్ల వల్ల మనం ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

క్యాన్సర్ రోగులకి అండగా నిలవాలి..

 క్యాన్సర్  దినోత్సవం సాక్షిగా నైతిక భాద్యతతో ప్రజలంతా క్యాన్సర్ రోగులకి మానసికంగా, ఆర్ధికంగా  అండగా నిలబడాలి.  క్యాన్సర్ రాకుండా ఉండేలా ఎలా జాగ్రత్తపడాలి, ఏం చర్యలు తీసుకోవాలి వంటివాటి గురించి అవగాహన కల్పించాలి. అందరూ మంచి జీవన శైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించాలి.  ఆధునిక సమాజంలో క్యాన్సర్ కారకాలుగా మారుతున్న విషయాల మీద కలిసి పోరాడాలి.

                                        *రూపశ్రీ.

 

గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
ధంతేరస్ నుంచి దీపావళి వరకు ఏ రోజు ఏ వస్తువులు కొనుగోలు చేయాలి? బంగారం, వెండి, పాత్రలతో పాటు ఏది శుభప్రదం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మానవ ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆధునిక పోషకాహార ఫ్రేమ్‌వర్క్ తెస్తున్న విప్లవాత్మక మార్పులు, ప్రయోజనాల గురించిన పూర్తి సమగ్ర విశేషాలు.
మలబద్దక సమస్యతో బాధపడుతున్నారా? ఉదయాన్నే మోషన్ ఫ్రీగా అవ్వడానికి ప్రముఖ నిపుణులు డాక్టర్ బాలు యెల్లెపు సూచించిన 10 అద్భుతమైన సూపర్ ఫుడ్స్ మరియు డైట్ చిట్కాల గురించి ఈ స్టోరీలో తెలుసుకోండి.
తెలంగాణ స్టైల్ నల్లకూర ఫ్రై తయారీ విధానం తెలుసుకోండి. నీచు వాసన రాకుండా, పర్ఫెక్ట్ మసాలాలతో పల్లెటూరి రుచిలో నల్లకూర ఎలా చేయాలో ఈ స్టోరీలో చూసేయండి.
ఆంధ్రా స్టైల్ చింత చిగురు రొయ్యల కూర తయారీ విధానం మరియు ఆరోగ్య ప్రయోజనాలు. రుచికరమైన పచ్చి రొయ్యల కర్రీని సులభంగా ఎలా చేయాలో తెలుసుకోండి.
దీపావళి పండుగ ప్రత్యేకంగా స్వీట్ షాప్ స్టైల్ లో నేతి బొబ్బట్లు ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. పర్ఫెక్ట్ కొలతలు, చిట్కాలతో రుచికరమైన బొబ్బట్ల రెసిపీ.
మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి , అనేక రకాల చిన్న చిన్న కారణాల వల్ల చాలా మంది క్షణాల వ్యవధిలోనే తీవ్రమైన కోపం తెచ్చుకుంటూ ఉంటారు.
చాయ్‌తో తినడానికి సరికొత్త రుచితో కరకరలాడే బియ్యంపిండి మురుకులను ఇంట్లోనే అత్యంత సులభంగా, నూనె పీల్చకుండా గుల్లగా ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ప్రతిరోజూ వేరుశెనగలు తినడం వల్ల మెదడు జ్ఞాపకశక్తి మరియు ఇన్సులిన్ పనితీరు ఎలా మెరుగుపడుతుందో తాజా పరిశోధన ఆధారంగా తెలుసుకోండి.
బరువు తగ్గాలనుకునే వారు ఈవెనింగ్ స్నాక్స్‌గా మఖానా లేదా పాప్‌కార్న్ ఏది తినాలి? ఏది ఆరోగ్యకరం, బరువు తగ్గడానికి ఏది బెటర్ అనే పూర్తి వివరాలు తెలుసుకోండి.
నిద్రలో వచ్చే గురక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇది ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. ఎలాంటి ఖరీదైన మందులు లేకుండా, సహజ పద్ధతుల్లో గురకను ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకోండి.
శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గును తగ్గించి, గొంతుకు ఉపశమనం అందించే ఆలయ శైలి ట్రెడిషనల్ మిరియాల పులిహోరను సరైన కొలతలతో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
మధుమేహంతో బాధపడుతున్నారా? రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా అదుపులో ఉంచే అద్భుతమైన బియ్యం ప్రత్యామ్నాయాలు మరియు పోషకాహార రహస్యాల గురించి తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.