TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్..!

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం..! తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీలు తాత మధుసూదన్ అలియాస్ తాత మధు, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఒక్కొక్క రికి రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిని ధులుగా సభా కార్యక్రమా లకు హాజరుకావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో నిరసన చేపట్టిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లేపల్లి వెంకటేశం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 352, 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ కోరుతూ పోలీసులు సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలను ఎమ్మెల్సీ తాత మధు ఇప్పటికే ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో స్పీకర్‌ను దూషించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరిం చుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులతో బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారన్న ఆరోపణలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పోలీసులను అడ్డుకోవడం, దాడికి పాల్పడటం వంటి ఆరోపణలపై పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. సంబంధిత పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇలా స్పీకర్‌పై వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీల అరెస్టు, నాంపల్లి కోర్టు బెయిల్, అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణ, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారంపై వివాదం వంటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. (BRS MLCs, Tata Madhusudan, N Naveen Kumar Reddy, Telangana Assembly, Telangana Legislative Council, Assembly Speaker, K Chandrasekhar Rao, KCR, Damodar Rajanarsimha, BRS, Telangana Politics, Assembly Resolution, Assembly Privileges, Legislative Council Chairman, Political Controversy)

Published on: Tue Sep 8, 2026 6:57PM

political-news-img

సోషల్ మీడియాను లైట్ తీసుకోవద్దు.. టీడీపీ నేతలకు లోకేష్ వార్నింగ్..!

టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సోషల్ మీడియాను ఎంతవరకు యాక్టివ్‌గా వినియోగిస్తున్నారనే అంశంపై ఆయన ఆరా తీశారు. సోషల్ మీడియాను నేతలు సమర్థంగా వినియోగించాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని.. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వ పనితీరుపై ఓపెన్‌గా మాట్లాడాలని నేతలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని గుర్తుచేశారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రతిపక్షాల పని ఎప్పుడూ బురదజల్లడమేనని వ్యాఖ్యానించిన లోకేష్.. వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ తక్షణమే స్పందించేలా పనిచేయాలని అన్నారు. జగన్‌కు సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని.. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. (Minister Nara Lokesh, Telugu Desam Party, Amaravati, Leadership Conclave, Political Communication, Public Orientation, Social Media, TDP Leaders, Social Media Strategy, CM Chandrababu, YS Jagan, YSRCP, Telugu One, Telugu News)

Published on: Tue Sep 8, 2026 3:25PM

political-news-img

విజయసాయి మరో బాల్ థాక్రే అనుకుంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆయనను మరింత ఏకాకిగా మార్చేలా ఉన్నాయి. సోమవారం (సెప్టెంబర్ 7) ఆయన ఆర్భాటంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొత్త పార్టీ ప్రకటన చేశారు. అయితే పార్టీ పేరు, జెండా, అజెండాలను రివీల్ చేయలేదు. అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది. విజయకొత్త పార్టీ ప్రకటన చేసి కూడా పార్టీ పేరు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. ఇక ఆయన అనుసరిస్తున్న విధానాలు, పార్టీ లక్ష్యాలపై ఆయనలోనే అయోమయం, గందరగోళం ఉందని ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. పార్టీ స్థాపిస్తారట కానీ, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదంటున్నారు విజయసాయిరెడ్డి. అసలు రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన వంటి పార్టీలు క్రియాశీలంగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేసి.. తాను కాదు మరో నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతాను.. తాను వెనుకుండి సలహాలూ, సూచనలూ ఇస్తాననడం ఆయనలోని గందరగోళానికి అద్దంపడుతున్నట్లుగా ఉంది. సీఎం అభ్యర్థి స్థాయి నాయకుడు పార్టీలోకి వచ్చి తన నాయకత్వంలో పని చేసేంత సీన్ విజయసాయిరెడ్డికి ఉందా అన్న అనుమానాలు రాజకీయపరిశీలకులలో వ్యక్తం అవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో బలంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీలను కాదని మరీ.. బలమైన నేత ఎవరైనా.. విజయసాయి నాయకత్వంలో పని చేయడానికి ముందుకు వస్తారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రజాదరణ, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న బలమైన నేతను ముందు పెట్టి తాను వెనకుండి చక్రం తిప్పాలన్నది విజయసాయి ఆలోచనగా కనిపిస్తోంది. తనను తాను శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే తో పోల్చుకోవడం కూడా విస్తుగొలుపుతోంది. బాల్ థాకరే మహారాష్ట్రలో హిందుత్వ ఐకాన్, అలాగే.. మరాఠా సెంటిమెంట్ ఆయనకు అప్పట్లో పెద్ద బలంగా నిలిచింది. కానీ ఇక్కడ అంటే ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసు సహా పలు కేసులలోఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులు ముందు ముందు విజయసాయి పొలిటికల్ జర్నీకి అడ్డంకులుగా మారే అవకాశాలనూ కొట్టిపారేయలేము. ఈ విషయాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని ఆలోచిస్తే.. ఇంకా నామకరణం కూడా జరగని విజయసాయి కొత్త పార్టీ ప్రయాణం నల్లేరు మీద బండి నడకగా మారే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు. [Vijayasai Reddy Bal Thackeray Strategy, New Political Party, AP Politics, YCP, Telugudesham, Janasena, Ap Politics, Telugu One]

Published on: Tue Sep 8, 2026 10:25AM

political-news-img

తెలుగుదేశం, వైసీపీ రెండింటివీ కుటుంబ, ఫ్యాక్షన్ రాజకీయాలే.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు.!

తెలుగుదేశం, వైసీపీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొత్త పార్టీ ప్రకటన కోసం విజయవాడలో సోమవారం (సెప్టెంబర్ 7) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశం, వైసీపీలకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఇసుమంతైనా శ్రద్ధ, చిత్తశుద్ధి లేదన్నారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమని ఈ సందర్భంగా విస్పష్టంగా చెప్పిన విజయసాయి.. తన పార్టీ జెండా, అజెండా ప్రకటించడానికి ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు ఒకే తానులోని గుడ్డలేనన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటికి పట్టవని విమర్శించారు. ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం తెలుగుదేశం, వైసీపీల చుట్టూనే తిరుగుతోందని విమర్శించిన విజయసాయి, ఆరెండు పార్టీలూ కూడా కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలేననీ,వాటివి స్వార్థపూరిత అజెండాలనీ అన్నారు. ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోగలం, ఎలా దోచుకోగలం అన్న విషయంలో ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయన్న విజయసాయి, రాష్ట్రంలోపోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ ఆ పార్టీల ధోరణికి మద్దతు ఇస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గోరంత, మాకు కొండంత అన్నది ఆ పార్టీల విధానమని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదిక రావలసిన సమయం ఆసన్నమైందని, తన పార్టీ ఆ పాత్ర తీసుకుంటుందని చెప్పారు. [Vijayasai Reddy Say YSRCP And YCP Same, TDP YCp faction parties, third alternative, AP politics, Telugu One]

Published on: Mon Sep 7, 2026 3:48PM

political-news-img

ఇండియా కూటమిలోకి జగన్?

వైసీపీ ఇండియా కూటమిలో చేరబోతోందా? 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే.. కాంగ్రెస్ అండ వినా గత్యంతరం లేదని భావిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా జగన్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారని వైసీపీ వర్గాలూ చెబుతుతున్నాయి. అందులో భాగంగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. జాతీయ స్థాయిలో కీలకంగా మారిన ఇండియా కూటమితో జతకట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను బేరీజు వేసుకుంటూ, రాబోయే కాలంలో అనుసరించాల్సిన విధానాలపై అయన విస్తృతంగా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జగన్ ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను పదును పెడుతున్న జగన్.. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇండియా కూటమితో భాగం కావడం వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీయేయేతర పార్టీలతో సయోధ్య ఏర్పడుతుందనీ, తద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన గళం వినిపించే అవకాశం లభిస్తుందని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కేంద్రంతో సయోధ్యతో వ్యవహరించిన జగన్.. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత.. బీజేపీతో ఎంతగా కలిసి సాగాలన్నా ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీతో ఉన్న చెలిమి కారణంగా వీలు కావడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చూపు ఇండియా కూటమి వైపు మళ్లిందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ ఇండియా కూటమిలో చేరినట్లైతే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ సహయ సహకారాలు అందుతాయనీ, అదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఏకైక విపక్షంగా క్షేత్రస్థాయిలో చేపట్టే ఆందోళనలకు మద్దతు లభించాలంటే.. ఇండియా కూటమి అండ అవసరమన్న భావనలో జగన్ ఉన్నారని అంటున్నారు. [Jagan Join INDIA Alliance, 2029 AP Elections, YCP political strategy, AP politicalnews, AP Politics, Telugu One]

Published on: Mon Sep 7, 2026 3:29PM

political-news-img

తెలుగుదేశం, వైసీపీ దొందూదొందే.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. విజయసాయిరెడ్డి.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కీలక నేతగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీ ప్రకటన అధికారికంగా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సరళికి పూర్తి భిన్నంగా, పూర్తిగా ప్రజా పక్షం వహించే సరికొత్త ప్రత్యామ్నాయ వేదికను తీసుకురావడమే లక్ష్యంగా తన కొత్త పార్టీ ఉంటుందన్నారాయన. సోమవారం (సెప్టెంబర్ 7) విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయి ప్రస్తుత రాజకీయ పార్టీలవి కేవలం ఎన్నికల రాజకీయాలే తప్ప, వాటిలో సామాన్యుల నిజమైన సమస్యలను పట్టించుకునే తత్వం కరువైందని విమర్శించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ధోరణులు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమన్నారు. సమాజంలోని నిరుపేదలు, సామాన్యులు, కర్షకులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలకు అసెంబ్లీ, పార్లమెంటు వేదికగా గొంతుక వినిపించేందుకు ఒక బలమైన శక్తి అవసరమని, అందుకే తాను తన నూతన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చిందని విజయసాయి వివరించారు. ఈ కొత్త రాజకీయ వేదిక విశేషాలు, పార్టీకి సంబంధించిన పూర్తి విధివిధానాల ప్రకటన త్వరలోనే దశలవారీగా వెల్లడిస్తామన్న విజయసాయి.. కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పరిపాలనా విధానాన్ని అందించేందుకు తన రాజకీయ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించి, ప్రజా సమస్యలపై సమగ్రమైన కార్యాచరణను రూపొందించనున్నట్లు విజయసాయి చెప్పారు. తన కొత్త పార్టీ సీఎం అభ్యర్థిని తాను కాదని ఈ సందర్భంగా చెప్పిన విజయసాయి.. సంకేతాలు ఇచ్చారు. గతంలో తాను తీసుకున్న రాజకీయ విరామ నిర్ణయాన్ని పక్కన పెట్టి, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తున్నట్లు చెప్పారు. [Vijayasai Reddy Announce new party, AP politics, YCP, TDP, Andhra Pradesh politics, Vijayasai Reddy announcement, Teluguone]

Published on: Mon Sep 7, 2026 2:36PM