తీరమైనా, సముద్రమైనా  మీ రక్షణకి మేమున్నాం....

Publish Date:Feb 1, 2025

Advertisement


ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలని పరిశీలిస్తే అవన్నీ  ఎగుమతులు, దిగుమతులు మీదనే ఆధారపడ్డాయని తెలుస్తుంది. మరి ఈ ఎగుమతులు, దిగుమతులు దేని మీద ఎక్కువ ఆధారపడ్డాయంటే దానికి  సమాధానం తీరప్రాంత ఓడరేవులు, సముద్ర మార్గాలనే  చెప్పాలి. మరి ఇంత ముఖ్యమైన తీరప్రాంతాన్ని, సముద్రాన్ని కాపాడటానికి రక్షకుల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. పొడవైన తీరప్రాంతం కలిగిన దేశాల్లో ఒకటైన  మన దేశ తీరాన్ని, మన సముద్ర సరిహద్దుని ఎల్లవేళలా కాపాడటానికి  మనకీ ఒక రక్షణ దళం ఉంది. అదే ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసిజి)....  ఈ ఐసిజి  స్థాపనను గౌరవిస్తూ,  వీరు సముద్ర భద్రత కోసం చేపట్టిన కీలక బాధ్యతలను గుర్తు చేసుకుంటూనే…  దేశం కోసం, దేశ పౌరుల ప్రాణాలను రక్షించటం కోసం ఎన్నో  సాహసోపేతమైన పనులు చేస్తున్న కోస్ట్ గార్డుల  కృషిని గౌరవించేందుకు ప్రతీ సంవత్సరం  ఇండియన్ కోస్టుగార్డ్ డే జరుపుకుంటాము. 2025లో  ఐసిజి తన 49వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ  సంధర్భంగా మన కోస్ట్ గార్డ్ ప్రయాణం గురించి తెలుసుకుంటే…. 

ఇండియన్ కోస్టుగార్డ్(ఐసిజి)  ఎప్పుడు మొదలైంది....

 
ఫిబ్రవరి 1, 1977న తీర సంరక్షణ దళ చట్టం  చేయటంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టాపించబడింది. అయితే 1978లో  భారత పార్లమెంట్  దీన్ని ఆమోదించటంతో  అధికారిక గుర్తింపు లభించింది.  అప్పటి ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ సారథ్యంలో ఇండియన్ కోస్టుగార్డ్ ఏడు నౌకలతో అధికారికంగా స్థాపించబడింది. ఐసిజి  ఒక రక్షణ దళమే తప్ప మిలిటరీ విభాగం కాదు.  ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
దీని ప్రధాన కార్యలయం ఢిల్లీలో ఉంది.  ఐతే మొదట కేవలం ఏడు నౌకలతోనే  మొదలైన దీని ప్రయాణం ఇప్పుడు 158 నౌకలు, 78 విమానాలతో, సాంకేతిక పరికరాలతో శక్తివంతంగా మారి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద కోస్ట్ గార్డుగా నిలిచింది. ఇది 2030 నాటికి 200 నౌకలు, 80 విమానాల లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది.

ఇండియన్ కోస్టుగార్డ్  ఏం చేస్తుంది.....


ఈ దళం  నినాదం: “వయం రక్షామహ”,  అంటే దీనర్ధం “మేము రక్షిస్తాము” అని. ఈ మాట నిజం చేస్తూనే దాదాపు అర్ధ శతాబ్ధం నుంచి ఐసిజి మన తీరాన్ని, మనల్ని రక్షిస్తూ వస్తుంది.  సముద్ర ప్రాంతాల్లో కృత్రిమ ద్వీపాలు, ఆఫ్‌షోర్ టెర్మినల్స్, ఇతర నిర్మాణాల రక్షణ & భద్రతను చూసుకుంటుంది.  ఎల్లప్పుడూ భారత తీర రేఖను గస్తీ కాస్తూ, అక్రమ కార్యకలాపాలైన    స్మగ్లింగ్, సముద్ర దొంగతనాలు, ఇతర నేరాలను అరికడుతుంది. . తుఫాన్లు, సహజ విపత్తుల సమయంలో  సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులకు సహాయం అందించి రక్షిస్తుంది. సముద్ర  కాలుష్యం జరగకుండా  నియంత్రణ, నివారణ చర్యలు తీసుకుంటూ,   సముద్ర పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. అరుదైన సముద్ర జీవులను రక్షిస్తుంది. ఇది ఇండియన్ నేవీ,  మత్స్య శాఖ, కస్టమ్స్,  కేంద్ర-రాష్ట్ర పోలీసు విభాగాలతో సమన్వయం చేస్తూ  అక్రమ రవాణా జరగకుండా ఆపుతుంది. భారత సముద్ర పరిధుల చట్టం  అమలు జరిగేలా చూస్తుంది. మన సముద్ర పరిధిలోకి ఇతర దేశాలవారు  అక్రమంగా రాకుండా నివారిస్తుంది. సముద్రంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. సైంటిఫిక్  డేటాను సేకరించి, యుద్ధ  సమయాల్లో నౌకాదళానికి మద్దతు అందిస్తుంది. భారత సముద్ర జలాల్లో చమురు లీకేజీ జరిగితే, దాన్ని తొలగించడానికి మొదటగా ఇండియన్ కోస్టుగార్డ్ స్పందిస్తుంది.

ఇండియన్ కోస్టుగార్డ్ చేస్తున్న కృషిని గుర్తించాలి......

సముద్రంలో ఒక షిప్పులో ప్రయాణించటం అందరూ అనుకున్నంత సరదాగా ఏమీ ఉండదు. అదీ కాక దేశ రక్షణ కోసం పనిచేస్తున్న కోస్టల్ గార్డ్ షిప్పులో ఉన్నవారికి  అది ఎన్నో సవాళ్ళతో కూడుకున్న ప్రయాణం. ప్రతీరోజు కొత్తగా, సాహసోపేతంగా ఉంటుంది. ఈ విశాల నీలి సముద్రంలో  పగలు, రాత్రి అని చూడకుండా అహర్నిశలు మన దేశ సముద్ర సరిహద్దులని గస్తీ కాస్తున్న కోస్ట్ గార్డుల జీవితం అంత సులభంగా ఉండదు.  సముద్రంలో చిన్న చిన్న దారి దోపిడీలు చేసే దొంగల చేతికి కూడా ఆధునిక మారణాయుధాలు  అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో  ఒక కోస్టల్ గార్డ్  తన కర్తవ్యం నెరవేర్చటం ఎంత కఠినమో, ఎంత సాహసమో ఆలోచించాలి. 


భారతదేశ తీరప్రాంతంలో 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.  సుమారు 7516 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది కొత్త ఆధునిక సాంకేతిక లెక్కల ప్రకారం సుమారు 11000 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. పైగా మన భారతదేశం అనేక దేశాలకి దగ్గరగా ఉండటంతో పాటూ, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సంప్రదాయ సముద్ర వాణిజ్య మార్గం దగ్గరగా కూడా ఉంటుంది. మరి ఇటువంటి బౌగోళిక పరిస్థితులున్న  మన దేశ తీరాన్ని, సముద్ర సరిహద్దులని కాపాడటంలో మన కోస్టుగార్డులు  ఎంతలా కృషి చేస్తున్నారో అర్ధం చేసుకోవాలి.  ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే సంధర్భంగా  ఎంతో సేవ చేసిన, చేస్తున్న మన రక్షకులకి సలాం!

                             *రూపశ్రీ.

By
en-us Political News

  
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు...
వేగంగా మారుతున్న  జీవనశైలి,  డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది...
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా...
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం...
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది...
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.