ఆరోగ్యకరమైన స్నాక్స్: మఖానా మరియు పాప్‌కార్న్ లలో వెయిట్ లాస్‌కు ఏది బెస్ట్?
Publish Date:Nov 3, 2026
Advertisement
డైటింగ్ లేదా బరువు తగ్గే ప్రయత్నాలలో ఉన్నప్పుడు చాలామందిని వేధించే ప్రధాన సమస్య సాయంత్రం వేళల్లో వచ్చే ఆకలి. చిప్స్, బిస్కెట్లు, ఇతర ఫ్రైడ్ స్నాక్స్ తింటే శరీరంలోకి అదనపు కేలరీలు చేరి బరువు పెరిగిపోతామనే భయం ఒకవైపు ఉంటే, ఏమీ తినకుండా కడుపు మార్చుకోలేమనే బాధ మరొకవైపు ఉంటుంది. ఈ క్రమంలోనే ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా అందరి దృష్టి మఖానా అనగా తామర గింజలు మరియు పాప్‌కార్న్ పైకి మళ్లుతుంది. ఈ రెండూ కరకరలాడుతూ, తేలికగా ఉండేవే అయినప్పటికీ, బరువు తగ్గే ప్రయాణంలో వీటిలో ఏది ఉత్తమమైన ఎంపిక అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. ఈ రెండింటి పోషక విలువులు, శరీరానికి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను నిశితంగా పరిశీలిస్తే సరైన నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది. ప్రస్తుతం హెల్త్ కాన్షియస్ ఉన్న ప్రతిఒక్కరి ఇళ్లలో మఖానా ప్రముఖ స్థానం సంపాదించుకుంది. వీటిని ఎలాంటి నూనె లేదా తక్కువ నూనెతో డ్రై రోస్ట్ చేసుకుని తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మఖానాలో సహజంగానే ఫ్యాట్ లేదా కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో శరీరానికి కావలసిన ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా మఖానాలో గ్లైసెమిక్ ఇండెక్స్ సుమారు 37 వంతు మాత్రమే చాలా తక్కువగా ఉంటుంది. అంటే వీటిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. అయితే, ఆరోగ్యకరమైన స్నాక్ కదా అని గిన్నెల కొద్దీ తినేస్తే మాత్రం బరువు తగ్గడం అటుంచి శరీరానికి అదనపు కేలరీలు చేరే ప్రమాదం ఉంది. పైగా వీటిని వేయించేటప్పుడు వాడే నెయ్యి లేదా నూనె పరిమాణాన్ని బట్టి కూడా కేలరీల మోతాదు పూర్తిగా మారిపోతుంది. మరోవైపు మనకు ఎప్పట్నుంచో సుపరిచితమైన, ఎంతో ఇష్టమైన స్నాక్ పాప్‌కార్న్. అయితే ఇక్కడ థియేటర్లలో విరివిగా దొరికే బటర్, కారమెల్, చీజ్ వంటి అధిక కేలరీల పాప్‌కార్న్ గురించి కాదు, ఎలాంటి నూనె, వెన్న లేని ప్యూర్ ఎయిర్ పాప్డ్ పాప్‌కార్న్ గురించి మాట్లాడుకోవాలి. పాప్‌కార్న్ ఒక అద్భుతమైన హోల్ గ్రెయిన్ లేదా తృణధాన్యం. వీటిలో ఉండే అధిక పీచు పదార్థం లేదా ఫైబర్ వల్ల తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. సాధారణ బంగాళాదుంప చిప్స్ కంటే చాలా తక్కువ కేలరీలతో ఎక్కువ పరిమాణంలో పాప్‌కార్న్ ఆరగించవచ్చు. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటమే కాకుండా, రక్తంలోకి పిండి పదార్థాలు త్వరగా కలవకుండా ఫైబర్ సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఈ రెండు ఆరోగ్యకరమైన స్నాక్స్ పోల్చి చూస్తే.. కేవలం బరువు తగ్గడం అనే ప్రధాన లక్ష్యం ఉన్నవారికి ఎలాంటి మసాలాలు కలపని ప్లెయిన్ ఎయిర్ పాప్డ్ పాప్‌కార్న్ కొద్దిగా మెరుగైన ఎంపికగా నిలుస్తుంది. ఎందుకంటే తక్కువ కేలరీలలో ఎక్కువ క్వాంటిటీ తినవచ్చు, పైగా కడుపు నిండిన ఫీలింగ్ త్వరగా వస్తుంది. అలాగని మఖానాను తీసిపడేయాల్సిన అవసరం లేదు. తక్కువ నెయ్యితో వేయించిన ఒక చిన్న కప్పు మఖానా కూడా వెయిట్ లాస్ డైట్‌కు అద్భుతంగా సరిపోతుంది. అయితే ఏ స్నాక్ ఎంచుకున్నా సరే, దాని తయారీలో వాడే బటర్, నూనె, మసాలాల పరిమాణం మరియు మీరు తినే సరైన మోతాదు మీ బరువు తగ్గే ఫలితాలను నిర్ణయిస్తాయి. Makhana Vs Popcorn, Weight Loss Snacks, Fox Nuts Benefits, Low Calorie Diet Snacks, Healthy Evening Snacking, Diet Foods Comparison, Health Tips In Telugu.
http://www.teluguone.com/news/content/makhana-vs-popcorn-35-236133.html





