రాహుల్ గాంధీ కబుర్లు
Publish Date:Jul 29, 2014
Advertisement
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఇంతకుముందు యూపీఏ అధికారంలో ఉన్నపుడు ఆయనను ఏదో ఒక కాలేజీవాళ్ళో, సంస్థలో ఆహ్వానిస్తే ఆయన రాజకీయాలలో నైతిక విలువలు, దేశాభివృద్ధి, మహిళా సాధికారికత, అవినీతి అరికట్టడం, యువత, నగదు బదిలీ పధకం దాని ప్రయోజనాలు వంటి అంశాలపై అనర్గళంగా ఉపన్యాసాలు దంచుతూ క్షణం తీరికలేకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన ఉపన్యాసాలను వినేవారే కరువయ్యారు. అందుకని ఇప్పుడు మీడియా వాళ్ళను పిలిచి మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇటీవల అమేథీ పర్యటించినపుడు మీడియాతో మాట్లాడుతూ “మా ప్రభుత్వ హయాంలో ధరలు పెరిగిపోయాయని, కనుక బీజేపీకి ఓటేసి గెలిపిస్తే పెరుగుతున్న ధరలను అదుపు చేసి చూపిస్తామని నరేంద్ర మోడీ నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. అందుకు ప్రధాని మోడీయే బాధ్యత వహించాలి. తక్షణమే ధరల అదుపుకు అవసరమయిన చర్యలు చెప్పట్టాలి,” అని డిమాండ్ చేసారు. రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రజా సమస్యలపై, ముఖ్యంగా పెరుగుతున్న ధరలపై మాట్లాడటం వినడానికి చాలా బాగుంది. కానీ యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఈ విషయంపై నోరెందుకు మెదపలేకపోయారో కాస్త వివరిస్తే బాగుండేది. గత పదేళ్ళలో ఆయన ఏనాడు కూడా ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవు. ఎందువలన అంటే కేంద్రంలో రాష్ట్రంలో కూడా తమ పార్టీయే అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బెంచీలలోకి మారింది గనుక ఇప్పుడు దైర్యంగా ధరల పెరుగుదల గురించి మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ధరల పెరుగుదల ఎన్డీయే అధికారం చెప్పట్టక మునుపు నుండే మొదలయిందనే విషయాన్ని ఆయన ఇప్పుడు ప్రస్తావించడంలేదు. రాహుల్ గాంధీ అడిగినా, అడగకపోయినా పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేప్పట్టింది. అయితే వాటి ఫలితాలు కనబడటానికి మరోకొంత సమయం పట్టవచ్చునని మార్కెట్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వ పనితీరును అంచనావేసేందుకు, ప్రభుత్వానికి మరికొంత సమయం ఈయవలసి ఉంటుందని అన్నారు. అటువంటప్పుడు యూపీయే ప్రభుత్వం పదేళ్ళ పాలనలో చేయలేని పనిని మోడీ ప్రభుత్వం కేవలం నెల పదిహేను రోజుల వ్యవధిలోనే చేయాలని రాహుల్ గాంధీ ఆశించడం చాలా హాస్యాస్పదం. కనుక రాహుల్ గాంధీ తనకు బాగా పట్టున్న మరేదయినా అంశం గురించి మాట్లాడితే బాగుంటుందేమో!
http://www.teluguone.com/news/content/rahul-gandhi-45-36614.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్‌లో ఏ చిన్న
ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.





