TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

ఆర్టీసీ చైర్మన్ గా కొండా సురేఖ?

తెలంగాణ రాజయాలలో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోందా? కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికిన తరువాత.. ఆమె పార్టీకి రాజీనామా చేయకపోవడానికి హస్తిన స్థాయిలో ఆమెకు దక్కిన హామీలే కారణమా? ఆమె విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సాఫ్ట్ కార్నర్ తో ఉందా? అంటే తాజాగా జరుగుతన్న ప్రచారాన్ని బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకమాండ్ పిలుపు మేరకుఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు ఏర్పడిన విభేదాల కారణంగా.. క్రమశిక్షణ చర్య అంటూ ఆమెకు రేవంత్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ రాజకీయాలలో ఇటువంటి కఠిన చర్య చాలా అరుదు. దీంతో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది. అయితే, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని భావించిన హైకమాండ్.. కేబినెట్ మంత్రిగా ఉద్వాసనకు గురైన ఆమెకు మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలగకుండా ఆమె సేవలను పార్టీకి అందేలా చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొండా సురేఖకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ పదవికి కేబినెట్ హోదా ఉండటంతో ఆమె గౌరవానికి తగిన పదవి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ.. కొండా సురేఖ పార్టీ నాయకత్వంపై దుందుడుకుగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె సహజ వైఖరికి ఇది పూర్తి విరుద్ధం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన అంతిమ లక్ష్యమని కస్పష్టం చేసిన సురేఖ.. తనకు అవమానం జరిగినా.. తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేవలం తన పదవి కోల్పోవడం పట్ల కాకుండా, సరైన కారణం లేకుండా తనను తప్పించారనే చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న కొండా సురేఖ.. ఆ అసంతృప్తి వినా.. పార్టీని వీడాలన్న యోచన తనలో ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. ఆమెఅనుసరించిన ఈ వైఖరే కొండా పట్ల హైమాండ్ లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కరాణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [Konda Surekha, Telangana Congress Politics, Cabinet Rank Post, RTC Chairman, Revanth Reddy, Telugu One]

Published on: Tue Sep 15, 2026 3:33PM

political-news-img

దమ్ముంటే తలసానిని ప్రతిపక్ష నేతను చేయండి.. పీసీసీ చీఫ్ మహేష్ సవాల్..!

బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..! తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చనీయాంశంగా మారిన పరిణామంలో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. మాక్ అసెంబ్లీలు పెట్టి బీసీ నేతకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కేవలం డ్రామాలని, నిజంగా దమ్ముంటే బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఎలాగో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు రారూ కదా, మరి బీసీలు ఎస్సీలపై ఈ కపట ప్రేమ ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ తన స్థానంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే, ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ దళితులు, బీసీలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు ఏమాత్రం లేదని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పుగా మలిచారని, మూడెకరాల భూమి పంపిణీ గానీ, ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకం అమలును గానీ పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం సరికాదని, ఆయన ఆశయాలను, సూచనలను నిజ జీవితంలో పాటించాలని హితవు పలికారు. నాటి TRS 2003 డాక్యుమెంట్‌ను కూడా సరిగా పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తామనడం సరికాదని, ముందుగా తమ బుర్రలోని పాత, కుహనా ఆలోచనలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చురకలంటించారు. కాలం మారిపోయిందని, నేడు దళితులు నగరాలకు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, కాలం చెల్లిన దొరలను ప్రజలు ఫామ్ హౌస్‌లకు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి దళితులకు, వెనుకబడిన వర్గాలకు తీవ్రమైన అవమానాలు జరిగినా కేసీఆర్ నుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను చూసి 'అధ్యక్షా' అనాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి స్పష్టమైన విజన్ లేకుండా రాష్ట్రాన్ని పాలించి, రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పులపాలు చేశారని మండిపడ్డారు. అయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పీసీసీ చీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు. [ MLC Mahesh Kumar Goud, Talasani Srinivas Yadav, KCR, PCC Chief, BRS, Congress, BRS, CM Revanth reddy, KCR, KTR, Telugu One, Telugu News ]

Published on: Mon Sep 14, 2026 2:08PM

political-news-img

కాంగ్రెస్‌ను వీడేది లేదు.. గెలిచే వారికే టికెట్లు : కొండా మురళి

మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. [ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]

Published on: Sun Sep 13, 2026 3:16PM

political-news-img

కొండా సురేఖను బుజ్జగిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్.. ఢిల్లీ నుంచి పిలుపు..!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే కొండా సురేఖను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. మంత్రి పదవిని కోల్పోయిన నాటి నుంచి అసెంబ్లీ జరుగుతున్న ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆమెతో, తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు. పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలను పక్కనబెట్టి, వ్యక్తిగత సమస్యలను విడనాడి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాల్సిన ఆవశ్యకతను ఆమెకు వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరుకాకపోవడం కాంగ్రెస్ పార్టీ సర్కిళ్లలో తీవ్ర దుమార రేపింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించినట్లు సమాచారం. ఫోన్ సంభాషణ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి నేరుగా రావాల్సిందిగా కొండా సురేఖకు పార్టీ పెద్దల నుంచి పిలుపు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి పదవిని కోల్పోయి తీవ్ర అసంతృప్తితో రగులుతున్న సురేఖను కూడగట్టే క్రమంలో భాగంగానే హైకమాండ్ ఈ చర్యలు చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఆమెకు త్వరలోనే కేబినెట్ స్థాయి లేదా సముచితమైన మరో ఉన్నత పదవిని అప్పగించే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం గమనార్హం. గతంలో వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఆమె కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, పరకాల అసెంబ్లీ స్థానంపై చెలరేగిన వివాదం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనను బాధ్యురాల్ని చేసి బలిపశువును చేయడం ఎంతవరకు సమంజసమని సురేఖ గతంలో బహిరంగంగానే ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన తనపైనే కఠిన చర్యలు తీసుకున్నారని, పార్టీలో కొందరికే ఒక రకమైన న్యాయం, తమలాంటి వారికి మరో న్యాయం జరుగుతోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారకుండా చూసేందుకు హైకమాండ్ వేగంగా పావులు కదుపుతోంది. ఫోన్ కాల్ చర్చల తర్వాత, ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కొండా సురేఖతో పార్టీ పెద్దలు జరిపే సమావేశం తర్వాత ఈ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందనే అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. [ Konda Surekha, Congress High Command, Meenakshi Natarajan, Telangana Politics, CM Revanth Reddy, Congress Cabinet, Congress party, Parakala assembly, Konda Sushmita Patel, Telugu One, Telugu News ]

Published on: Sat Sep 12, 2026 2:22PM

political-news-img

సీఎం రేవంత్ సంచలన కామెంట్స్.. ఫ్లాష్ సర్వేలో తేలిందేంటి..?

ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..? తెలంగాణ రాజకీయ రంగంలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులు అందరూ పాల్గొని, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. గత మూడు రోజులుగా శాసనసభ ప్రాంగణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న హైడ్రామా, నాటకీయ పరిణామాలు మరియు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైఖరిపై ప్రభుత్వం ప్రజల నాడిని పట్టేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫ్లాష్ సర్వే ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నేతల ముందుంచడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, పాలనా విధానాలకు ప్రజల నుంచి పూర్తి స్థాయి సానుకూలత లభిస్తోందని, కాంగ్రెస్ పరిపాలనపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదని సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలు, ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, స్పీకర్ పదవిని కించపరిచేలా జరిగిన వ్యాఖ్యలు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద చోటుచేసుకున్న శుద్ధీకరణ వివాదాస్పద ఘటనలను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల, రాజ్యాంగబద్ధ పదవుల పట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో, అలాగే ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎర్రవల్లి ఘటనపై మంత్రులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని, చట్టపరమైన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇంచార్జ్‌లు అందరూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించి బలంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియా డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ఈ ఫ్లాష్ సర్వే రిపోర్ట్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుండగా, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. [ CM Revanth Reddy, flash survey, BRS party, CLP meeting, Telangana news, Congress government,Telangana goverment, KCR, KTR, BRS Party, Telugu One, Telugu News ]

Published on: Thu Sep 10, 2026 8:38PM

political-news-img

రాజకీయం అంటే తొడలు చరిచి సవాళ్లు విసరడం కాదు.. చంద్రబాబు.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధిక కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం నాలుగవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే వ్యక్తిగత స్థాయిలో, సరిగ్గా మూడేళ్ల కిందట అప్పటి జగన్ ప్రభుత్వం ఆయనను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసింది. ఏడు పదుల వయస్సులో ఈ అరెస్టు సమయంలో చంద్రబాబు క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేలా చేసిందని చెప్పాలి. ఏకంగా 53 రోజుల పాటు ఆయనను రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో నిర్బంధించింది. ఐసోలేటెడ్ సెల్ లో, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వేధించింది అప్పటి జగన్ సర్కార్. నాటి రోజులను తాజాగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సామాజిక మాధ్యమ వేదికపై తనను అక్రమంగా అరెస్టు చేసిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ షేర్ చేసిన పోస్టులో తనను అరెస్టు చేసిన తీరు దారుణమనీ పేర్కొన్న చంద్రబాబు.. అయితే ఈ ఘటన తనను ఏ మిత్రం కుంగదీయలేదన్నారు. తనను అరెస్టు చేయించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనకు ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదన్న ఆయన అయితే తన విధానం అది కాదన్నారు. తనను చాలా మంది మెతక అనీ, కఠిన నిర్ణయాలు తీసుకోలేని మృదు స్వభావిననీ చెబుతుంటారు. కానీ వాస్తవానికి తాను చేసే ప్రతి పనీ తెలుగు ప్రజల శ్రేయస్సు, సమాజ హితం కోసమే ఉండాలి అని భావిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలు అంటే సవాళ్లు విసురుకోవడం, తొడలు కొట్టుకోవడం కాదన్నారు. అలాగే ఎన్నికల ఫలితాల ఆధారంగా ఒకరినొకరు అరెస్టు చేయించుకోవడం కూడా కాదన్నారు. తాను ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజిక హితం గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు. [Chandrababu Naidu, AP Politics, YS Jagan Mohan Reddy, Revenge Politics, Telugu Desam Party, Andhra Pradesh News, Telugu One]

Published on: Thu Sep 10, 2026 11:17AM