జి.హెచ్.యం.సి. ఎన్నికలు అందుకే ఆలస్యం అవుతున్నాయా?
Publish Date:Jul 11, 2015
Advertisement
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన. జి.హెచ్.యం.సి. పరిధిలో కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, మజ్లీస్ పార్టీలకి ఉన్నంత పట్టు తెరాసకు లేకపోవడంతో ఈ పునర్విభజన ద్వారా తన పట్టు పెంచు కోవాలని ప్రయత్నిస్తోందని వారి వాదన. ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన వార్డుల పునర్విభజన ప్రణాళికను చూసినట్లయితే ఆ సంగతి స్పష్టం అవుతుందని వారు వాదిస్తున్నారు. తెరాస ఎమ్మేల్యేలు సి. కనక రెడ్డి, టి.పద్మారావు గౌడ్ మరియు ఎం.సుదీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరీ, మేడ్చల్, సికింద్రాబాద్ నియోజక వర్గాల క్రిందకు వచ్చే ప్రాంతాలలో వార్డుల సంఖ్యను పెంచడం ద్వారా అక్కడ అదనపు స్థానాలు సంపాదించవచ్చని తెరాస ఎత్తు వేసిందని వారు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్ పేట, జి.హెచ్.యం.సి పరిధిలో బీజేపీ మరియు ఇతర పార్టీలకి బాగా పట్టున్న ప్రాంతాలలో వార్డులను కుదించడం ద్వారా వారికి అడ్డు కట్ట వేయాలని చూస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసారు. వార్డుల పునర్విభజన కేవలం జనాభా ప్రాతిపదికన జరపాలి కానీ పార్టీల బలాబలాల ప్రాతిపదికన కాదని వారు వాదిస్తున్నారు. ఈ కూడికలు తీసివేతల కారణంగానే వార్డుల పునర్విభజన ప్రక్రియలో ఆలాసం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ghmc-elections-45-48247.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్‌లో ఏ చిన్న
ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.





