కేటీఆర్ దూకుడు... సాటెవ్వరు?

Publish Date:Jul 28, 2014

Advertisement


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారుడిగా నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, వెనుకడుగు వేయని దృఢ సంకల్పంతో, తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచిన కేటీఆర్ తండ్రితో కలసి విజయాన్ని హత్తుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్వహణలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా, బాధ్యతగల మంత్రిగా దూసుకువెళ్తున్నారు.. అందర్నీ ఆశ్చర్యపరిచేలా దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎలాంటి చురుకైన పనితీరును ప్రదర్శిస్తున్నారో మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ కూడా అంతే చురుకైన పనితీరును కనబరుస్తున్నారు.

 

మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేటీఆర్ ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారు. రోజుకు రెండు మూడు సెమినార్లలో కూడా పాల్గొని ఐటీ రంగం అభివృద్ధికి సలహాలు ఇస్తూ, సలహాలు తీసుకుంటూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అభివృద్ధి వైపు ప్రయాణం ప్రారంభించాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అత్యంత సమర్థతతో పరిపాలనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 

అయితే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ మంత్రులను పోల్చి చూస్తే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ దూకుడుకు సాటిగా నిలిచే మంత్రి ఎవరూ కనిపించకపోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు తమవంతు పని తాము చేస్తున్నప్పటికీ, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడి మీదే భారం వేస్తున్నారు. అయితే కేటీఆర్ మాత్రం విచక్షణతో కూడిన నిర్ణయాలు తానే తీసుకుంటూ అందరిచేతా శభాష్ అనిపించుకునే పనితీరును ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఐటీ మంత్రిగా కేటీఆర్ ఇప్పటికే ఎన్నెన్నో సమావేశాలు నిర్వహించి మంచి యాక్టివిటీని కనబరిచారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాత్రం ఇంతవరకు ఐటీ రంగానికి సంబంధించిన ఒక్క సమావేశం కూడా జరిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌ మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను నెరవేర్చే దిశగానే కేటీఆర్ ముందుకు వెళ్తున్నారు.

By
en-us Political News

  
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
అంబటి రాజమహేంద్రవరం జైలులో ఉంటే జగన్ కనీసం అటుకేసి కూడా చూడటం లేదు. కేవలం గుంటూరుకే పరిమితమై.. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో సరిపెట్టేయనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.