దిల్లీలో జంగిల్ రాజ్ నడుస్తోంది- నితీశ్
Publish Date:Feb 24, 2016
Advertisement
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్‌లో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దాన్ని భూతద్దంలో చూపించి, జంగిల్ రాజ్ అంటూ ఉంటారు. కానీ నిజానికి జంగిల్ రాజ్ అంతా దిల్లీలోనే నడుస్తోంది’ అంటూ విరుచుకుపడిపోయారు. ‘దిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే పనిచేస్తూ ఉంటారు. కోర్టులో ఉన్న కన్నయా కుమార్ మీద దాడి జరిగినప్పుడు వాళ్లంతా కిమ్మనకుండా ఉండిపోయారంటే తప్పు ఎవరిది’ అంటూ చెలరేగిపోయారు నితీశ్. నితీశ్‌గారు అక్కడితో ఆగలేదు ‘దేశంలో ఆర్ధిక సంస్కరణలు విజయవంతం కాలేదు. మేక్ ఇన్ ఇండియా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. భారీ పెట్టుబడులు ఏవీ రావడం లేదు. కొత్తగా ఉద్యోగాలనీ కల్పించలేదు. వీటన్నింటి నుంచీ దృష్టి మళ్లించేందుకు RSS, BJPలు ఇలాంటి వివాదాలని పెంచి పెద్దవి చేస్తున్నాయి’ అంటున్నారు. మరి కన్నయా కుమార్ చేసిన పనిని మీరు సమర్థిస్తారా అని అడిగితే... ‘దేశానికి వ్యతిరేకంగా ఎవరన్నా నినాదాలు చేస్తే వారిని తప్పకుండా శిక్షించాల్సిందే! కానీ కన్నయా కుమార్ అలాంటి నినాదాలు చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదు’ అని బదులు చెప్పారు. నితీశ్ మాటలకు భాజపా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి!
http://www.teluguone.com/news/content/narendra-modi-45-56071.html
ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.





