పోతూ పోతూ పొగబెట్టిన అన్సారీ!
Publish Date:Aug 10, 2017
Advertisement
మన దేశంలో రాష్ట్రపతి పదవే అలంకారప్రాయం. ఇక ఉప రాష్ట్రపతి సంగతి చెప్పాలా? ఉప రాష్ట్రపతి అడపాదడపా రాజ్యసభ నిర్వహించినప్పుడు తప్ప మరెప్పుడూ కనిపించరు! ఎక్కడ చూసినా ప్రధాని , మంత్రులు మాత్రమే కనిపించే వ్యవస్థ మనది. ఇక మిగిలిన కీలకమైన చోట్ల రాష్ట్రపతికి పెద్ద పీట వేస్తారు. మొత్తం మీద రెండో అత్యున్నత స్థానమైన వైస్ ప్రెసిడెంట్ పోస్టు… చాలా వరకూ న్యూస్ లో వుండదనే చెప్పాలి! ఉప రాష్ట్రపతి మాట ఇప్పుడెందుకు వచ్చిందంటే… మన తెలుగు వాడు వెంకయ్యకి సీటు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు హమీద్ అన్సారీ. పదేళ్లుగా సైలెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గిరి కొనసాగించిన ఆయన వెళుతూ వెళుతూ మాత్రం వివాదం రాజేశారు. అదే ఇప్పుడు బీజేపి వారికి మంట రేపుతోంది! అన్సారీ యూపీఏ పాలకులు ఉప రాష్ట్రపతిగా ఎన్నిక చేసిన వ్యక్తి. బాగా చదువుకున్న వాడు, సీనియర్ బ్యూరోక్రాట్ అయినప్పటికీ … కాంగ్రెస్ కు, సోనియాకు నమ్మకస్థుడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా! అదే ఆయనకు వరుసగా రెండు సార్లు పదవి కట్టబెట్టింది. అయితే, మోదీ సర్కార్ ఉప రాష్ట్రపతి పదవిలో ఆరెస్సెస్ నేపథ్యమున్న సీనియర్ బీజేపి నాయకులు వెంకయ్యను కూర్చోబెట్టాలని నిర్ణయించింది. కాబట్టి అన్సారీకి రిటైర్మెంట్ తప్పలేదు! హమీద్ అన్సారీ చివరి సారి రాజ్యసభ నిర్వహించిన వేళ అన్ని పార్టీల నేతలు ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. బీజీపి నాయకులు కూడా ఆయన గొప్ప వాడనే అన్నారు. మోదీ స్వయంగా తాము ఎంతో నేర్చుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే, అంతలోనే అన్సారీ చేసిన ఓ కామెంట్ కలకలం రేపుతూ వార్తల్లోకి వచ్చింది. ఆయన ఓ ఇంటర్వ్యూలో దేశంలోని ముస్లిమ్ లు అభద్రతా భావానికి లోనవుతున్నారని అన్నారు! ఇది ఇంచుమించూ ఎవర్ని ఉద్దేశించి చేసిందో మనకు తెలిసిందే! ఉప రాష్ట్రపతి పదవిలో కొనసాగిన అన్సారీ అధికార పక్షానికి తగిలేలా ముస్లిమ్ లు భయపడతున్నారని, బెదిరిపోతున్నారని కామెంట్స్ చేయటం సహజంగానే కాషాయ నాయకులకి నచ్చలేదు! బీజేపి అధికార ప్రతినిధి అయితే అన్సారీ రాజకీయ ఉపాధి కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు! అయితే నిజం ఏంటో అన్సారీకే తెలియాలి. మోదీ వచ్చి మూడేళ్లు అయిపోయాక కూడా నిజంగా ముస్లిమ్ లు అభద్రతలో వున్నారా? లేక ఈ కామెంట్ ద్వారా ఆయన ఏదైనా రాజకీయ ఉద్యోగం సంపాదించే పనిలో వున్నారా? అల్లాకే తెలియాలి! ప్రస్తుతానికైతే … వెళుతు వెళుతూ ఆయన వార్తల్లోకి వ్యక్తిగా నిలిచారు! అంత మాత్రం క్లియర్…
http://www.teluguone.com/news/content/hamid-ansari-45-76968.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్‌లో ఏ చిన్న
ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.





