అత్తాపూర్‌లో కిడ్నాప్ డ్రామా…చివరికి ట్విస్ట్!

Publish Date:May 20, 2026

Advertisement

 

అత్తాపూర్ పరిధిలో నిన్న రాత్రి కలకలం రేపిన యువతి కిడ్నాప్ కేసు చివరికి ఊహించని మలుపు తిరిగింది. రాత్రి 10:55 గంటలకు డయల్ 100కి వచ్చిన ఫోన్ కాల్‌తో పోలీస్ వ్యవస్థ మొత్తం అప్రమత్తమైంది. పిల్లర్ నెంబర్ 145 సమీపంలోని జాయ్ హాస్పిటల్ వద్ద తార్ వాహనంలో యువతిని కిడ్నాప్ చేశారని సమా చారం అందడంతో రాజేంద్ర నగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలు, ప్రాంతమంతా గాలింపు—అన్నీ  వేగంగా కొనసాగాయి. 

కేసు నమోదు చేసి ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసి రాత్రంతా సోదాలు నిర్వహించారు. ఉదయాన్నే మళ్లీ పరుగులు పెట్టారు. ప్రతి క్లూ వెంబడి పరిగెత్తిన పోలీసులకు చివరికి ఆశ్చర్యకరమైన నిజం ఎదురైంది. కిడ్నాప్ అయిందని భావించిన ఆ యువతి… తన సొంత ఇంట్లోనే ఉన్నట్లు బృందాలు గుర్తించారని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.. ప్రస్తుతం ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఎక్కడా కిడ్నాప్ జరగలేదని, బలవంతంగా ఎవరూ తీసుకెళ్లలేదని పోలీసులు స్పష్టం చేశారు. 

యువతికి ఎవరితోనూ ప్రేమ వ్యవహారం లేదని, ఈ ఘటనలో ఉన్న వారందరూ పరస్పరం తెలిసిన స్నేహితు లేనని తెలిపారు. విదేశాల్లో పనిచేసి ఇటీవలే నగరానికి వచ్చిన ఈ యువతి విషయంలో ఇంకా పలు కోణా ల్లో విచారణ కొనసాగు తోందని డీసీపీ తెలిపారు. ప్రస్తుతం యువతి స్టేట్మెంట్ తీసుకుంటున్నారని, ఒకవేళ పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు... ‌ ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉండగా… అత్తాపూర్ కిడ్నాప్ మిస్టరీ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.


 

By
en-us Political News

  
నల్లా ఛానెల్ కాలుష్యం, ఛానల్ నుంచి గోదావరిలోకి నేరుగా కలుస్తున్న కాలుష్యకారక వ్యర్ధాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి, గోదావరి పేపర్ మిల్ వ్యర్ధ జలాలు ఎక్కడ శుద్ధి చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్యను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల స్కోరును నమోదు చేసింది. బ్యాటర్లందరూ సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ ఈ స్కోరును సాధించగలిగింది.
తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ థర లీటర్ కు 2.61 రూపాయలు, డీజిల్ ధర లీటర్ కు 2.71 రూపాయలు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు, డీజిల్ ధర రూ.95.20కు చేరింది.
ప్రస్తుతం జగన్ కారణంగా ఏపీ అంతటా రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్.. ఆ కుటుంబ చరిత్ర, వారి రక్తసిక్త రాజకీయ విధానాలు
కాలినడకన తిరుమల కొండ ఎక్కిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
తెలంగాణలో ప్రీపెయిడ్ మీటర్ల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది
నారాయణఖేడ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎవరెస్టు శిఖరాన్ని అధి రోహించి తిరిగి దిగివస్తున్న సమయంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు
బెంగళూరు నగరం ఐటీ రంగానికి, స్టార్టప్‌లకు ఎంత ప్రసిద్ధి చెందిందో, అక్కడి ట్రాఫిక్ కష్టాలకు కూడా అంతే పేరుగాంచింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ డి. జోయల్ డేవిస్ వెల్లడించారు
హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.