ఎవరెస్టుపై విషాదం...ఇద్దరు భారతీయులు మృతి

Publish Date:May 24, 2026

Advertisement

 

ఎవరెస్టు శిఖరాన్ని అధి రోహించి తిరిగి దిగివస్తున్న సమయంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన సందీప్ ఆరేగా గుర్తించారు. ప్రస్తుతం సందీప్ అమెరికాలో స్థిరపడి సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నాడు. సందీప్ మే 20న విజయ వంతంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. అయితే మరుసటి రోజు తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. 

గతంలో కిలిమంజారో సహా పలు పర్వత శిఖరాలను అధి రోహించిన అనుభవం సందీప్‌కు ఉంది. మరో మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణ్‌కుమార్ తివారిగా గుర్తించారు. హైదరాబాద్‌లో స్థిరపడి ఐటీ రంగంలో పనిచేస్తున్న తివారి, పర్వతారోహణలో విశేష అనుభవం సంపాదించాడు. రష్యా, అమెరికా, అర్జెంటీనాల్లోని పలు పర్వ తాలను విజయవంతంగా అధిరోహించాడు.ఈ ఇద్దరు 

ఎవరెస్టు నుంచి దిగివస్తున్న సమయంలో తీవ్ర అలసట, ఎత్తు ప్రభావం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరినీ గైడ్లు రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతం మృతదేహాలను దిగువకు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరు మృతి చెందినట్లుగా సమాచారం అందుకున్న వెంటనే రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకు న్నాయి.

By
en-us Political News

  
నారాయణఖేడ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
బెంగళూరు నగరం ఐటీ రంగానికి, స్టార్టప్‌లకు ఎంత ప్రసిద్ధి చెందిందో, అక్కడి ట్రాఫిక్ కష్టాలకు కూడా అంతే పేరుగాంచింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ డి. జోయల్ డేవిస్ వెల్లడించారు
హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.
తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
మానవత్వానికి, సాయం చేసే గుణానికి వయసుతో అస్సలు సంబంధం లేదని నిరూపించింది
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి బైక్ రేసర్ల ఆగడాలు పెరుగుతున్నాయి వీకెండ్ వచ్చిందంటే చాలు అర్ధరాత్రి వేళ యువకులు కార్లు, బైకులతో రోడ్లపైకి దిగి స్పీడ్ షోలు చేస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నారు.
అల్కాపూర్ టౌన్‌షిప్‌లో మహిళపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.
సాంకేతికత ఎంతగా దూసుకుపోతున్నా, క్షేత్రస్థాయిలో పేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలంటే ఎంత నరకం చూడాలో నిరూపించే మరో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది.
అక్కడ తప్పించుకున్న వీరు చల్లపల్లి వద్ద దొరికి పోయారు. వీరు వెడుతున్న బైక్ చల్లపల్లి వద్ద అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి.
దేశంలో ఇప్పటికీ దాదాపు 47 వేల మంది పిల్లలు ఆచూకీ లేకుండా ఉండటం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్న సుప్రీంకోర్టు, కనిపించకుండా పోయిన ప్రతి నిమిషం కీలకం. పోలీసుల నిర్లక్ష్యం, ఆలస్యం పిల్లలను మరింత ప్రమాదంలోకి నెట్టొచ్చు అని హెచ్చరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.