గాంధీ భవన్‍లో తీవ్ర ఉద్రిక్తత...మల్లు రవి, కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం!

Publish Date:May 24, 2026

Advertisement

 

తెలంగాణ అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా తీవ్ర కలకలం రేగింది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల అంతర్గత సమీక్షా సమావేశంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బూత్ లెవెల్ ఏజెంట్ల  పనితీరు, క్షేత్రస్థాయి నివేదికలపై చర్చించేందుకు హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్ మరియు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన ఈ కీలక సమావేశం ఏర్పాటయింది. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటా మాటా పెరిగి గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

వివాదానికి ప్రధాన కారణం గోషామహల్ నియోజకవర్గ అంతర్గత రాజకీయాలేనని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గోషామహల్ నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి సునీతా రావుకు సమాచారం లేకుండా, ఆమె సమక్షం లేకుండా ఈ నియోజకవర్గ సమీక్షను ఎలా నిర్వహిస్తారంటూ స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ హోదాలో ఉన్న మల్లు రవిని నేరుగా నిలదీస్తూ నిరసనకు దిగారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న నేతలను పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేటర్లు ఒక్కసారిగా నిలదీయడంతో మల్లు రవి సైతం తీవ్ర అసహనానికి గురయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏవైనా సమస్యలు ఉంటే పద్ధతి ప్రకారం తన దృష్టికి తీసుకురావాలని, అంతే తప్ప ఇలా బాధ్యతారాహిత్యంగా అరుస్తూ గొడవ చేయడం తగదని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు మరింత ముదిరాయి. తాను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి చైర్మన్ అని, తన ముందే క్రమశిక్షణ తప్పి ఇలాంటి రచ్చ చేస్తారా అంటూ మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదంతో గాంధీ భవన్ ప్రాంగణంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. బూత్ స్థాయి ఏజెంట్ల 100 శాతం పనితీరును సమీక్షించాల్సిన సమావేశం కాస్తా, నేతల అంతర్గత విభేదాల వేదికగా మారిపోయింది. హైదరాబాద్ లోని ముఖ్యమైన నియోజకవర్గాల నేతల మధ్య ఉన్న సమన్వయ లోపం ఈ ఘటనతో మరోసారి బహిర్గతమైంది. క్రమశిక్షణకు మారుపేరైన గాంధీ భవన్ లో సొంత పార్టీ నేతలే ఈ విధంగా వాగ్వాదానికి దిగడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By
en-us Political News

  
ఎవరెస్టు శిఖరాన్ని అధి రోహించి తిరిగి దిగివస్తున్న సమయంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు
బెంగళూరు నగరం ఐటీ రంగానికి, స్టార్టప్‌లకు ఎంత ప్రసిద్ధి చెందిందో, అక్కడి ట్రాఫిక్ కష్టాలకు కూడా అంతే పేరుగాంచింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ డి. జోయల్ డేవిస్ వెల్లడించారు
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.
తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
మానవత్వానికి, సాయం చేసే గుణానికి వయసుతో అస్సలు సంబంధం లేదని నిరూపించింది
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి బైక్ రేసర్ల ఆగడాలు పెరుగుతున్నాయి వీకెండ్ వచ్చిందంటే చాలు అర్ధరాత్రి వేళ యువకులు కార్లు, బైకులతో రోడ్లపైకి దిగి స్పీడ్ షోలు చేస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నారు.
అల్కాపూర్ టౌన్‌షిప్‌లో మహిళపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.
సాంకేతికత ఎంతగా దూసుకుపోతున్నా, క్షేత్రస్థాయిలో పేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలంటే ఎంత నరకం చూడాలో నిరూపించే మరో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది.
అక్కడ తప్పించుకున్న వీరు చల్లపల్లి వద్ద దొరికి పోయారు. వీరు వెడుతున్న బైక్ చల్లపల్లి వద్ద అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి.
దేశంలో ఇప్పటికీ దాదాపు 47 వేల మంది పిల్లలు ఆచూకీ లేకుండా ఉండటం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్న సుప్రీంకోర్టు, కనిపించకుండా పోయిన ప్రతి నిమిషం కీలకం. పోలీసుల నిర్లక్ష్యం, ఆలస్యం పిల్లలను మరింత ప్రమాదంలోకి నెట్టొచ్చు అని హెచ్చరించింది.
ఉప్పల్‌కు చెందిన సంతోష్ రెడ్డి ఆమెకు క్లాస్‌మేట్‌గా ఉండేవాడు. కాలక్రమేణా ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో మొదట స్నేహితుడిగా దగ్గరయ్యాడని, అనంతరం ప్రేమ పేరుతో నమ్మించాడని బాధితురాలు ఆరోపిస్తోంది. భారీగా ఆస్తులు ఉన్నాయని, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నానని చెప్పి తనను నమ్మించాడని తెలిపింది. నువ్వు లేని జీవితం నాకు వద్దు అంటూ ప్రేమ మాటలతో ఒప్పించి ఇండియాకు రప్పించి పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. ఇరు కుటుంబాల సమక్షంలో 2014లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగినట్లు తెలిపింది.
ఈ హత్య వెనుక భూ వివాదాల కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ భూముల వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మలక్‌పేట్ ప్రాంతంలోని భూ వివాదాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.వక్ఫ్ ఆస్తులు, భూములకు సంబంధించిన అంశాల్లో ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌లతో అడ్వకేట్ కాజా మొయినుద్దీన్‌కు గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.