న్యాయవాది హత్య కేసులో సంచలన విషయాలు

Publish Date:May 24, 2026

Advertisement

 

న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్ వద్ద గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ కేసులో ఐదుగురు పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని గుర్తించిన పోలీసులు, వాహనం యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆరు నెలల క్రితమే కారును మరొకరికి అమ్మినట్లు యజమాని వెల్లడించగా, కొనుగోలు చేసిన వారు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ మార్చుకోలేదని తెలిపాడు. 

గుర్తుతెలియని వ్యక్తులే కారును కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు, కేసు దర్యాప్తును ప్రత్యేక బృందాలు పలు కోణాల్లో వేగవంతం చేశాయి. వక్ఫ్ ఆస్తుల వివాదాల కోణంలోనూ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ముంతాజ్ కాలేజ్, అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజ్, మదరసా హైజా భూముల వ్యవహారాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. 1962లో ఈ మూడు వక్ఫ్ ఆస్తులను మెహబూబ్ ఆలం కుటుంబానికి పరిరక్షణ బాధ్యతలతో అప్పగించినట్లు పాత రికార్డులు చెబుతున్నాయి.

2013లో ఖాజా మొయిజుద్దీన్, దస్తగిరి ఆలం ఖాన్ కలిసి వక్ఫ్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. మలక్‌పేట్ ముంతాజ్ కాలేజ్‌కు సంబంధించిన భూములను ఆటో ఫైన్ సర్వీస్ కంపెనీకి విక్రయించారనే ఆరోపణలపైనా దర్యాప్తు కొనసాగుతోంది. భూముల లావాదేవీలకు సంబంధించిన పాత డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఖాజా మొయిజుద్దీన్‌పై గతంలో నమోదైన కేసుల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖాజా మోహినుద్దీన్ పై  మలక్‌పేట్, అబిడ్స్ పోలీస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్ CCSలో నమోదైన కేసులపై సమాచారంను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు.

ఖాజా మొయిజుద్దీన్ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెహబూబ్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్‌లపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు ముందు జరిగిన వివాదాలు, బెదిరింపులు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. హత్య వెనుక వక్ఫ్ ఆస్తుల వివాదాలే కారణమా..? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.
 

By
en-us Political News

  
నారాయణఖేడ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఎవరెస్టు శిఖరాన్ని అధి రోహించి తిరిగి దిగివస్తున్న సమయంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు
బెంగళూరు నగరం ఐటీ రంగానికి, స్టార్టప్‌లకు ఎంత ప్రసిద్ధి చెందిందో, అక్కడి ట్రాఫిక్ కష్టాలకు కూడా అంతే పేరుగాంచింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ డి. జోయల్ డేవిస్ వెల్లడించారు
హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.
తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
మానవత్వానికి, సాయం చేసే గుణానికి వయసుతో అస్సలు సంబంధం లేదని నిరూపించింది
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి బైక్ రేసర్ల ఆగడాలు పెరుగుతున్నాయి వీకెండ్ వచ్చిందంటే చాలు అర్ధరాత్రి వేళ యువకులు కార్లు, బైకులతో రోడ్లపైకి దిగి స్పీడ్ షోలు చేస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నారు.
అల్కాపూర్ టౌన్‌షిప్‌లో మహిళపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.
సాంకేతికత ఎంతగా దూసుకుపోతున్నా, క్షేత్రస్థాయిలో పేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలంటే ఎంత నరకం చూడాలో నిరూపించే మరో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది.
అక్కడ తప్పించుకున్న వీరు చల్లపల్లి వద్ద దొరికి పోయారు. వీరు వెడుతున్న బైక్ చల్లపల్లి వద్ద అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి.
దేశంలో ఇప్పటికీ దాదాపు 47 వేల మంది పిల్లలు ఆచూకీ లేకుండా ఉండటం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్న సుప్రీంకోర్టు, కనిపించకుండా పోయిన ప్రతి నిమిషం కీలకం. పోలీసుల నిర్లక్ష్యం, ఆలస్యం పిల్లలను మరింత ప్రమాదంలోకి నెట్టొచ్చు అని హెచ్చరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.