నాచారంలో దారుణ హత్య... వివాహేతర సంబంధమే కారణం
Publish Date:Jan 4, 2026
Advertisement
మూడు ముళ్లు, ఏడడు గులు.. వేదమంత్రాలతో వివాహబంధం ముడి పడుతుంది. అంతటి పవిత్రమైన బంధాన్ని కొందరు ఇల్లాలు ప్రియుడి మోజులో పడి అవమానిస్తున్నారు. ప్రియుడి కోసం భర్తను చంపి జైలు పాలు అవుతున్నారు. ఇటువంటి ఘటనే హైదరాబాద్ నగర శివార్లలోని నాచారం ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తు న్నాడనే కారణంతో భార్యే భర్తను రాడ్డుతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘాతుకానికి భార్యతో పాటు ఆమె వివాహేతరుడు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒడిశాకు చెందిన నారాయణ్ బెహరా తన భార్య బంధిత బెహరాతో కలిసి జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి నాచారం మల్లాపూర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ.. నారాయణ్ బెహరా ప్లంబర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. భార్య బంధిత బెహరా గృహిణిగా ఉండేది. అయితే అదే ఇంట్లో అద్దెకుంటున్న విద్యాసా గర్‌తో బంధితకు గత నాలుగు నెలలుగా వివా హేతర సంబంధం కొనసాగుతున్నది. ఈ విషయం కాస్త భర్త నారాయణ్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయినా కూడా భార్య బంధిత ప్రవర్తన లో మార్పు రాలేదు సరి కదా ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమం లో తమ సంబంధానికి నారాయణ్ అడ్డుగా మారడాన్ని భావించిన బంధిత, తన ప్రియుడు విద్యాసాగర్‌తో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నింది. పథకం ప్రకారము భార్య బంధిత తన ప్రియుడితో కలిసి భర్తను నారాయణ్‌పై రాడ్డుతో దాడి చేసి హత్య చేసింది. హత్య జరిగిన అనంతరం మృతుడి బంధువులు నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు భార్య బంధిత పై అనుమానం రావడంతో మృతుడి భార్య బంధితను విచారించగా, ఆమె నేరాన్ని ఒప్పుకున్నది. '' ఆమె ఇచ్చిన సమాచారంతో పాటు సాంకేతిక ఆధారాల సహాయంతో ప్రియుడు విద్యాసాగర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన 24 గంటల లోపే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు నాచారం పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధాల వల్ల కుటుం బాలు విచ్ఛిన్నమవుతు న్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. ఈ కేసు నాచారం ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
http://www.teluguone.com/news/content/hyderabad-36-211984.html





