బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం
Publish Date:Jan 5, 2026
Advertisement
బంగ్లాదేశ్, ఇండియా మధ్య సంబంధాలు సంక్షోభంలో పడ్డాయి. బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక ఆందోళనల ప్రభావం ఇరు దేశాల మధ్యా దౌత్య సంబంధాలనే కాకుండా అన్ని రంగాలపైనా కూడా ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఈ ప్రభావం ఇరు దేశాల మధ్యా క్రికెట్ సంబంధాలపై కూడా పడింది. బంగ్లాదేశ్ స్టార్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక ఆల్లర్ల కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ కేకేఆర్ ను ఆదేశించింది. ఈ నిర్ణయానికి ప్రతిగా బంగ్లాదేశ్ తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువులపై హింసాకాండ, హిందూ వ్యతిరేకత బాగా పెచ్చరిల్లిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. బంగ్లాలో పెచ్చరిల్లుతున్న భారత వ్యతిరేకత కారణంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముస్తాఫిజూర్ ను ఐపీఎల్ నుంచి తొలగించాలని నిర్ణయించింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కు ముస్తాఫిజుర్ ను కేకేఆర్ జట్టు కొనుగోలు చేసింది. ఆ జట్టులో ముస్తాఫిజుర్ కీలక ఆటగాడిగా రాణిస్తాడని ఆ జట్టు భావించింది. అయితే భారత్, బంగ్లాదేశ్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అతడిని ఐపీఎల్ నుంచి తొలగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దనిపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం అకారణంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తమను బాధించిందని పేర్కొన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. అందుకు ప్రతిగా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.
http://www.teluguone.com/news/content/bangladesh-ban-ipl-matches-telecast-36-212039.html





