త్వరలో మావోయిస్టు రహితంగా తెలంగాణ : డీజీపీ
Publish Date:Jan 5, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్రం అతి త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతోందని తెలంగాణ పోలీసులు స్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన మావోయిస్టులు కేవలం 17 మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు పోలీసుల అంచనా. ఈ 17 మందిలో ఎవరు ఏ స్థాయి కమిటీల్లో ఉన్నారనే పూర్తి వివరాలతో కూడిన జాబితా పోలీసుల చేతిలో ఉందని వెల్లడించారు. ఈ 17 మంది లొంగిపోతే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి పూర్తిగా తెరపడుతుందని, అప్పుడే రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతుందని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మిగిలిన మావోయిస్టు నేతలు ఆయుధాలు విడిచి, లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం మిగిలి ఉన్న 17 మంది మావోయిస్టుల్లో 4 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు,5 మంది స్టేట్ కమిటీ సభ్యులు,6 మంది డివిజన్ కమిటీ సభ్యులు, లొంగిపోవాలని పోలీసుల పిలుపు ఆపరేషన్ కగార్ పూర్తయ్యేలోపే తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసులు ముందుకెళ్తున్నారు. మిగిలిన 17 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం పునరావాస అవకాశాలు కల్పిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. మొత్తానికి, రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి ముగింపు దశ సమీపిస్తోందని, తెలంగాణ త్వరలోనే పూర్తిస్థాయిలో శాంతియుత రాష్ట్రంగా మారబోతోందని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సెంట్రల్ కమిటీ సభ్యులు
ఒకరు అండర్ గ్రౌండ్ కార్యకర్తగా ఉన్నారు. ఈ జాబితాలో 5 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. వీరిలో కొందరు ప్రస్తుతం సెంట్రల్ కమిటీలో ఉండగా, మరికొందరు స్టేట్, డివిజన్ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఈ 17 మంది తెలంగాణ మావోయిస్టు అగ్ర నేతలపై పోలీసులు మొత్తం రూ.2 కోట్ల 25 లక్షల రివార్డు ప్రకటించారు. వీరి కదలికలపై నిఘా మరింత పెంచినట్లు, అవసరమైతే ఆపరేషన్ కగార్ పరిధిలో చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ముప్పాల లక్ష్మణ్ రావ్ @ గణపతి
తిప్పిరి తిరుపతి @ దేవ్ జి
మల్లారాజి రెడ్డి @ సంగ్రామ్
పసునూరి నరహరి @ సంతోష్
స్టేట్ కమిటీ సభ్యులు
ముప్పిడి సాంబయ్య @ సుదర్శన్
వార్త శేఖర్ @ మంగుత్
జోడే రత్నా భాయ్
నక్కా సుశీల
లోకేటి చంద్ర శేఖర్
దామోదర్
డివిజన్ కమిటీ సభ్యులు
రాజేశ్వరి
రంగబోయిన భాగ్య
బాడిషా ఉంగా
సంగీత
భవాణి
మైసయ్య
భగత్ సింగ్
http://www.teluguone.com/news/content/telangana-police-36-212038.html





