ఇద్దరు మైనర్లు సహజీవనం చేస్తున్న ఉదంతం హైదరాబాద్ లో కలకలం సృష్టించింది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లు సహజీవనం చేయడం కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కు చెందిన మైనర్లైన అబ్బాయి, అమ్మాయి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు ఆ ఇద్దరినీ మందలించి.. కౌన్సెలింగ్ చేసి.. ముందు చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకుంటే, ఆ తరువాత తామే వారిరువురికీ వివాహం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యుల హితవచనాలు రుచించని ఆ మైనర్లిద్దరూ ఇంట్లో వారికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చి బంజారా హిల్స్ ప్రాంతంలో ఇళ్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగం లోకి దిగి మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ మైనర్లు కావడంతో.. నిబంధనల మేరకు వారిని శిశువిహార్‌కు తరలించారు. బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటు న్నామని, మైనర్ల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. కాగా ఇద్దరు మైనర్ల సహజీవనం ఉదంతం నగరంలో కలకలం రేపింది. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం సమన్వయంతో పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minors-livingtogether-in-hyderabad-36-212024.html
పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమాను వీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు.
ఇటీవల కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు దిగారు శంఖ్ ఎయిర్ వ్యవస్థాపకుడు శ్రవణ్ కుమార్.
మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
సాహితీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ భారీ రియల్ ఎస్టేట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడే తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
నదీజలాలపై చర్చ సమయంలో సభను తప్పుదోవ పట్టించారని సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు
ప్రాణాంతకంగా మారిన నిషేధిత చైనీస్ మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్ ఇంటిపై కాల్పుల కలకలం రేపుతున్నాయి.
వారానికి ఐదు రోజుల పని విధానం, వేతన సవరణ తదితర అంశాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ సమ్మెకు పిలుపు నిచ్చింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్‌లో మంటలు ఇంక అదుపులోకి రాలేదు.
నాలెడ్జ్ బేస్డ్ సొసైటీని నిర్మించడంలో విశ్వవిద్యాలయాలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక ఆల్లర్ల కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ కేకేఆర్ ను ఆదేశించింది. ఈ నిర్ణయానికి ప్రతిగా బంగ్లాదేశ్ తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది.
తెలంగాణ రాష్ట్రం అతి త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతోందని తెలంగాణ పోలీసులు స్పష్టంగా ప్రకటించారు.