అంబర్ పేటలో విషాదం.. కుటుంబం ఆత్మహత్య
posted on Nov 22, 2025 11:30PM
.webp)
ఓ కుటుంబం మొత్తం ఆత్మహ్యకు పాల్పడిన విషాదఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో చోటు చేసుకుంది. బాగ్ అంబర్ పేటలోని మల్లికార్జున్ నగర్లో శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులు వారి కుమార్తె శ్రావ్య నివాసం ఉంటున్నారు. ఈ ముగ్గురూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా ఇటీవలే వారి పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకుని మరణించింది. అంత వరకూ రామ్ నగర్ లో నివాసం ఉండే వీరు పెద్ద కుమార్తె మరణం తరువాత అక్కడ నుంచి అంబర్ పేటకు మారారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకు న్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
క్లూస్ టీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి..? ఏమైనా వివాదాలు ఉన్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. స్థానికుల సమాచారం మేరకు పెద్ద కుమార్తె మరణం తరువాత నుంచీ శ్రీనివాస్ కుటుంబం డిప్రషన్ లో ఉంది. తమను దేవుడు పిలుస్తున్నాడు, మేం కూడా మా పెద్ద కుమార్తె దగ్గరకు వెళ్లిపోతామని తరచూ చెబుతుండేవారు.
దీంతో శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్యకు మూఢ నమ్మకాలే కారణమని పోలీసులు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూఢ నమ్మకాలతోనే చనిపోయారా..? మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో పోలీ సులు ఆరా తీస్తున్నారు.