జైస్వాల్ సెంచరీ... భారత్ ఘన విజయం...సిరీస్ కైవసం

 

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్  9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు సఫారీలు 47.5 ఓవర్లలో 270 రన్స్‌కు ఆలౌటయ్యారు. ఈ టార్గెట్‌ను టీమ్ఇండియా 39.5 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (116*; 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌) సెంచరీ బాదగా.. రోహిత్ శర్మ (75; 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (65*; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చేశారు. రోహిత్, జైస్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

జైస్వాల్, కోహ్లీ అభేద్యమైన రెండో వికెట్‌కు 84 బంతుల్లో 116 పరుగులు జోడించి భారత్‌కు గెలుపు అందించారు. దక్షిణ బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (106; 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం చేయగా.. తెంబా బావుమా (48; 67 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్‌ కృష్ణ 4, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu