విమాన టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం

 

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. దేశీయ విమాన ధరలు ప్రకటించింది. ఈ నూతన నిబంధనల ప్రకారం, 500 కిలోమీటర్ల వరకు గరిష్ఠంగా రూ. 7,500, 500 కి.మీ. నుండి 1000 కి.మీ. వరకు రూ. 12,000, అలాగే 1000 కి.మీ. నుండి 1500 కి.మీ. వరకు రూ. 15,000 మాత్రమే ఛార్జ్ వసూలు చేయడానికి అనుమతి ఉంటుంది.

అంతేకాకుండా, ఈ ఉదయం నుంచే కేంద్రం అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. విమానయాన సంస్థలు టిక్కెట్ ధరలు పెంచితే  కఠిన చర్యలు చర్యలు తీసుకుంటమని కేంద్రం తెలిపింది.1500 కిలోమీటర్ల పైన ఉంటే రూ.18,000 మాత్రమే వసూలు చేయాలని విమానయాన శాఖ తెలిపింది
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu