పరాకామణి కేసు... తప్పు ఒప్పుకున్న రవికుమార్

 

తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు. చేసిన మహా పాపానికి ప్రాయిశ్చితంగా నా ఆస్తిలో 90% స్వామి వారికి ఇవ్వాలని భావించాని తెలిపారు. నేను మా కుటుంబం అనుకున్న విధంగానే నా ఆస్తి స్వామి వారి పేరిట రాసామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అనేక కట్టుకథలు అల్లుతున్నారు… నాపై ఎవరో ఒత్తిడి తెచ్చారని, నా ఆస్తులు రాసుకున్నారని ప్రచారంలో వాస్తవం లేదని రవి కుమార్ తెలిపారు. 

నన్ను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, వారిపై కేసులు కూడా పెట్టాని తెలిపారు. నాపై చాలా అసభ్యకరమైన ఆరోపణలు చేశారు, ప్రైవేట్ పార్ట్ లో శాస్త్ర చికిత్స చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు…ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధ నుంచి ఇప్పటికీ కోలుకోలేకున్నామని  న్యాయస్థానం ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అందుకు నేను సహకరిస్తాని తెలిపారు. నేను చేసింది మహా పాపం, బాధపడని రోజంటూ లేదని ఆయ వాపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu