కేసీఆర్‌ను కొడుకు, అల్లుడు, బిడ్డే ముంచుతారు : సీఎం రేవంత్‌

 

కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నల్గొండ దేవరకొండలో ప్రజాపాలన  ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. పేదలకు ఇళ్లివ్వని మాజీ సీఎం కేసీఆర్ 2వేల కోట్లతో గడీకట్టుకున్నారని సీఎం అన్నారు. ఆ పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే 22 లక్షల ఇళ్లు ఇచ్చేదని తెలిపారు. 

ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దగ్గర మేము ఓట్లు అడుగుతాం...డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చిన చోట కేసీఆర్ ఓట్లు అడగాలి.. ప్రజలే తీర్పు చెప్తారని ఆయన స్ఫష్టం చేశారు. గత ప్రభుత్వం కనీసం రేషన్ కార్డులో పేరు కూడా చేర్చలేదని వెల్లడించారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ ల ఉచిత విద్యుత్ ఉపయోగపడిందని దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. 

ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చింది.. కాంగ్రెస్.. కాంగ్రెస్ గిరిజనుల పార్టీని అన్నారు. మీకు మంచి రోజులు కాదు... కొడుకు, అల్లుడు, బిడ్డలు ముంచే రోజులు వస్తాయి.. నీ కొడుకు చాలు కేసీఆర్.. నీ పార్టీని బొందపెట్టడానికని ముఖ్యమంత్రి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం జరిగిందన్నారు. ఎస్ఎల్ బీసీ  టన్నెల్ లో 10 కిలోమీటర్ లు తవ్వలేని అసమర్థ పాలన కేసీఆర్ దాని ఆరొపించారు. 

ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలిన ప్రమాదంలో 8 మంది చనిపోతే.. బీఆర్‌ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎస్ఎల్ బీసీనీ పూర్తి చేస్తాం.పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మంత్రితో కలిసి ఉండేవాళ్ళు, ఎమ్మెల్యే తో కలిసి పని చేసే వాళ్లకు సర్పంచ్ గా అవకాశం ఇవ్వండని కోరారు. ఇందిరమ్మ చీరలను వాళ్ల ఇంటికే పంపిస్తామని ఇందిరమ్మ చీర కట్టుకోండి.. సర్పంచ్ కు ఓటేయండని రేవంత్ పిలుపునిచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu