తెలంగాణ సరిహద్దుల్లో పెద్దపులి సంచారం

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని వార్దా నది వద్ద పులి జాడలు కలకలం సృష్టించాయి. పులి జాడలను గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.   తెలంగాణలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని మహరాష్ట్ర కుచెందిన  థరూర్‌ గ్రామ వద్ద వార్దా నది వద్ద పులి అడుగు జాడలను గమనించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

పులి అడుగుల గుర్తుల వీడియో సోషల్‌ మీడియాలో  పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తెలంగాణ సరిహద్దుల్లో  పులి సంచరించిన ఆనవాలు లేకపోయినప్పటికీ.. సరిహద్దుకు అతి సమీపంలో పులి అడుగుజాడలు ఉండటంతో  తెలంగాణ అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉండే గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.  ముఖ్యంగా  తాటిపల్లి గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ  చాటింపు వేయించారు. రైతులు  ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇలా ఉండగా వార్దా నది ఒడ్డుల పులిని చూశామని తాటిపల్లి గ్రామస్థులు చెబు తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu