పాట్నాలో శ్రీవారి ఆలయం...బీహార్ సర్కార్ అంగీకారం

 

బీహార్ సర్కార్ పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మాణానికి అంగీకరించింది. శ్రీవారి ఆలయ నిర్మాణానికి కోసం 10.11 ఎకరాల భూమిని  కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి ప్రభుత్వం లేఖ పంపింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్త్నె, బెంగళూరు వంటి నగరాల్లో టీటీడీ ఆలయాలు ఉన్నాయి. ఇటీవల జమ్మూలోనూ శ్రీవారి ఆలయాన్ని నిర్మించారు. 

పాట్నాలో టిటిడి ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించడంపై టీటీడీ ఛైర్మెన్  బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పాట్నాలో టిటిడి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడంపై  సీఎం  చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించిందినట్లు ఛైర్మన్ తెలిపారు. సదరు భూమిని 99 సంవత్సరాల పాటు రూ. 1 టోకెన్ లీజ్ రెంట్ తో ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ ఛైర్మెన్ తెలిపారు. ఈ మహత్తరమైన నిర్ణయంతో బీహార్ రాష్ట్రంలో టిటిడి ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఎంవోయూ చేసుకునేందుకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ ను అధికారికంగా నియమించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ తో టీటీడీ ప్రతినిధులు త్వరలో సంప్రదింపులు చేసి, టీటీడీ ఆలయ నిర్మాణానికి సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు చేపడుతామన్నారు. బీహార్ ప్రభుత్వ సహకారం, దూరదృష్టికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu