లింగ భైరవీ ఆలయం ఎక్కడుంది.. ఆ దేవత ప్రత్యేకత ఏంటి?

ప్రముఖ నటి సమంత లింగభైరవీ దేవి ఆలయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అసలీ లింగ భైరవీ దేవి ఎవరు? ఆమె ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయ ప్రాసిస్థ్యం ఏమిటి? అని నెటిజనులు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అంతే కాదు అందరిలో కూడా లింగభైరవీ దేవత ఎవరు? ఆమె ఆయలం ఎక్కడుందన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది.   ఆ వివరాల్లోకి వెడితే..  పురుషుల్లో పరమేశ్వర రూపమైన కాలభైరవుడు ఉన్నట్టే.. స్త్రీ రూపంలో భైరవీ దేవి కూడా ఉంది.  లింగ భైరవీ దేవి శక్తిమంతమైన రూపమే కాకుండా లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ మాతల సమ్మేళన స్వరూపంగా చెబుతారు పండితులు. తామస, రజో, సత్వ గుణాలను సైతం సూచిస్తుందని అంటారు.  దశ మహా విద్యలలో ఒకటిగా, కుండలినీ శక్తిగా.. పరమేశ్వర ప్రతిరూపమైన కాలభైరవుడి  సతీమణిగా.. లింగ భైరవీ దేవిని కొలుస్తారు.

తమిళనాడులోని కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ నిర్మించిన లింగ భైరవీ దేవి ఆలయంలో ఉంది. ఆ ఆలయంలోనే సమంత పెళ్లి చేసుకున్నారు. ఈ ఆలయంలో కేవలం మహిళా పూజారులు మాత్రమే ఉంటారు.   లింగ భైరవీ దేవి ఆలయంలో సమంత భూత శుద్ధి వివాహ వేడుక చేసుకున్నారు.   ప్రాచీన యోగ శాస్త్రం నుంచి ఉద్భవించిన ఈ వేడుక భౌతిక స్థితిగతులకు అతీతంగా జరుగుతుందని అంటారు పండితులు. ఇది ఆ దంపతుల మధ్య పంచభూత శక్తులను శుద్ధి చేసి వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతమవుతుందని విశ్వసిస్తారు. ఇంతకీ ఏమిటీ భూత శుద్ధి వివాహమని చూస్తే.. పంచ భూతాలను శుద్ధి పరుచుకోడానికి.. అగ్ని చుట్టూ తిరిగి ప్రదిక్షణ చేస్తారు నూతన దంపతులు. ఈ వేడుక సారాంశం.. లింగ భైరవీ దేవి శక్తిలో లీనం కావడంగా చెబుతారు ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్.

దేవిని స్వయంగా ప్రతిష్టించిన సద్గురు మాటల్లో.. తీక్షణత, కరుణల కలబోత లింగ భైరవీ దేవి. ఈ స్త్రీ స్వరూపం 8 అడుగుల ఎత్తులో మూడున్నర చక్రాల శక్తితో దర్శనమిస్తారు. దేవి తన భక్తులకు సంపూర్ణ అనుగ్రహాన్ని శ్రేయస్సు ప్రసాదిస్తుంది. లింగభైరవీ మాత ఆధ్యాత్మిక ప్రగతికి సాయ పడుతుంది.

ఈశా ఫౌండేషన్లో గల లింగభైరవీ దేవి ఆలయం ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకూ తెరిచి ఉంటుంది. పౌర్ణమి, నవరాత్రుల సమయాల్లో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.  ఈ పురాతన ప్రక్రియలో కేవలం కొత్త జంటలు మాత్రమే కాదు.. ఇప్పటికే పెళ్లయిన జంటలు కూడా  పాల్గొనవచ్చని అంటున్నారు.  ఈ పవిత్రమైన అనుభూతిని పొందాలనుకునే జంటలు vivaha@isha.org కు మెయిల్ పంపడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని అంటున్నారు ఇక్కడి వారు. ఇక లింగభైరవీ దేవి ఆలయంలో వివాహ మాడదలు చుకున్న వారు అదనపు రుసుము చెల్లిస్తే ఫోటోగ్రఫీతో పాటు, వీడియోగ్రఫీతో కలిపి లైవ్ సైతం అందిస్తామని చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu