ఎట్టకేలకు అఖండ-2 కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!
on Dec 6, 2025

డిసెంబర్ 5న విడుదల కావాల్సిన 'అఖండ 2: తాండవం' చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త రిలీజ్ డేట్ గురించి తెగ చర్చ జరుగుతోంది. డిసెంబర్ 12 మొదలుకొని సంక్రాంతి వరకు రకరకాల తేదీలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. (Akhanda 2: Thaandavam)
సింహా, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తరువాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన మూవీ 'అఖండ 2'. 14 రీల్స్ ప్లస్ నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్స్ తో 'అఖండ 2' సందడి థియేటర్స్ లో మొదలు కావాల్సి ఉండగా.. 14 రీల్స్ కి, ఈరోస్ సంస్థకి మధ్య ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూ కారణంగా మూవీ వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
Also Read: నిన్న అఖండ.. నేడు రాజా సాబ్.. షాక్ ల మీద షాక్ లు!
'అఖండ 2' డిసెంబర్ 12న విడుదలవుతుందని మొదట తెగ ప్రచారం జరిగింది. అయితే ఇలా హడావుడిగా కాకుండా.. సమస్యను పూర్తిగా పరిష్కరించుకొని, రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగాలని మేకర్స్ చూస్తున్నారట. అందుకే కొద్దిరోజులు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి అవతార్-3 లేకపోతే డిసెంబర్ 19ని లాక్ చేసేవారట. కానీ, ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు అన్నివిధాలా సరైన డేట్ గా భావించి, డిసెంబర్ 25ని లాక్ చేసినట్లు వినికిడి.
అయితే డిసెంబర్ 25 పై ఇప్పటికే ఛాంపియన్, శంబాల,దండోరా వంటి సినిమాలు కర్చీఫ్ వేశాయి. ఇప్పుడు ఆ డేట్ కి అఖండ-2 వస్తే.. ఈ సినిమాలు వెనకడుగు వేసే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



