తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు
posted on Dec 6, 2025 2:37PM

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీలో జనవరి 8,9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అజెండా ఖరారైంది. రెండు రోజుల కార్యక్రమంలో 27 ప్రత్యేక సెషన్లు ఉండనున్నాయి. రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డ్యాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. 2047 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా అభివృద్ధి చేసే రోడ్ మ్యాప్ ప్రకటిస్తారు.
దీనికి దేశ, విదేశాల ప్రముఖుల హాజరుకానున్నారు. 9న సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి.
ముఖ్యంగా ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ సెమీ కండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్‌లో పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా పాల్గొననున్నారు. క్రియేటివ్ సెషన్‌లో రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమ చోప్రా పాల్గొంటారు