మొంథా తుఫాను నష్టం రూ.6352 కోట్లు...అమిత్‌షాకు నివేదిక

 

మొంథా తుఫాను కారణంగా ఏపీలో రూ.6352 కోట్ల నష్టం జరిగిందని మంత్రులు లోకేష్, అనిత కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు నివేదిక అందజేశారు.  న్యూఢిల్లీలో టీడీపీ ఎంపీలతో కలిసి అమిత్‌షాతో సమావేశం అయ్యారు. మొంథా తుపాను వల్ల మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని  లోకేష్ తెలిపారు. 1.92 లక్షల మందిని పునరాస శిబిరాలకు తరలించామన్నారు. 

ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద 3 వేలు ఇచ్చామని తెలిపారు.కూటమి ప్రభుత్వం స్పందించి కూలిన చెట్ల తొలగింపు, తాత్కాలిక నివాస సౌకర్యాలు, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి పలు చర్యలను చేపట్టింది. తక్షణ సహాయం కింద రూ.60 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. 

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు, నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం రూ.6,356 కోట్ల నష్టంలో NDRF మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవి మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu