కాలుష్యంలో హైదరాబాద్ ను మించిపోయిన విశాఖపట్నం
posted on Nov 26, 2025 9:11AM
.webp)
దేశంలో అత్యధిక కాలుష్య నగరాల జాబితాలో విశాఖపట్నం 13వ స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను ది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించిన సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 749 జిల్లాల్లో నిర్దిష్ట ప్రమాణాలకు మించి కాలుష్య కారక పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు.
తాజా సర్వేలో తెలంగాణలో 33 జిల్లాల్లో 32 జిల్లాల్లో 40 మైక్రోగ్రామ్స్ కంటే తక్కువగా నమోదయింది. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం ఇది 40 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్కు మించి వాతావరణ కాలుష్యం ఉన్నట్టు గుర్తించారు. ఇక ఏపీలో 26 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో కాలుష్య ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. ఇక నగరాల విషయానికి వస్తే విశాఖ నగరం లో కాలుష్యం హైదరాబాద్ ను మించి ఉందన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. కాలుష్య నగరాల జాబితాలో హైదరాబాద్ 25వ స్థానంలో ఉండగా, విశాఖ 13వ స్థానంలో ఉండటం గమనార్హం.