ముంబై విమానాశ్రయంలో విదేశీ గంజాయి పట్టివేత
posted on Nov 26, 2025 8:59AM

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఈ గంజాయి విలువ 39 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. బ్యాంకాక్ నుండి ముంబై వచ్చిన ఎనిమిది మంది ప్రయాణీల తీరుపై అనుమానం వచ్చిన అధికారులు వారి లగేజీ తనిఖీ చేయడంతో ఈ విదేశీ గంజాయి స్మగ్లింగ్ గుట్టు రట్టైంది.
వారి లగేజీలో ఉన్న చాక్లెట్ ప్యా ఎనిమిది మంది ప్రయాణికులపై అనుమానం వచ్చిన అధికారులు వారి సామానులను పరిశీలించగా, చాక్లెట్ ప్యాకెట్లలో దాచిన గంజాయి బటయపడింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగకుండా సాధారణ చాక్లెట్ ర్యాపర్ల మాదిరిగానే ప్యాకింగ్ చేసి అక్రమంగా తరలించేందుకు ఈ స్మగ్లర్లు చేసిన ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. అధికారులు ఎనమండుగురు స్మగ్లర్లనూ అదుపోనికి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవలి కాలంలో బ్యాంకాక్–భారత్ మధ్య గంజాయి స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాంకాక్ నుండి వచ్చే ప్రతి ప్రయాణీకుడిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్లపై నిఘాను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.