అయ్యప్ప మాల ధరించినందుకు మెమో… కొత్త వివాదం
posted on Nov 26, 2025 9:54AM
.webp)
హైదరాబాద్ పాతబస్తీ సౌత్ ఈస్ట్ జోన్‌లో విధులు నిర్వహిస్తున్న కంచన్‌బాగ్ ఎస్‌ఐ ఎస్. కృష్ణకాంత్‌కు అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేసిన విషయం వివాదంగా మారింది. డ్యూటీలో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధరించడం పోలీసు విభాగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కృష్ణాకాంత్ కు అడిషనల్ డీసీపీ మెమో జారీ చేయడంపై భిన్న స్పందనలు వచ్చాయి.
పోలీసు శాఖలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం మతపరమైన ఆచారాలు పాటించే సమయంలో డ్యూటీకి హాజరు కాకుండా సెలవులు తీసుకోవాలని మెమోలో స్పష్టం చేశారు. అయ్యప్ప మాల వేసుకుని డ్యూటీ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని ఆ మెమోలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ మెమో ఇప్పుడు పెద్ద చర్చకు తెరతీసింది.
బీజేపీ నేతలు అయ్యప్పమాట ధరించినందుకు ఎస్ఐకు మెమో జారీ చేయడాన్ని తప్పుపడుతున్నారు. మతపరమైన ఆచారాలు ఆచరించడం నియమాల్లో భాగమైతే, పోలీస్ సిబ్బంది పట్ల సౌలభ్యం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరొకవైపు ఇందులో తప్పేమీ లేదని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసు శాఖ అధికారికంగా స్పందించాల్సి ఉంది.