అమరావతిలో శ్రీవారి ఆలయం రెండున్నరేళ్లలో పూర్తి.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో  శ్రీ వెంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధికి ఈ రోజు ఉదయం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతిలో వేంకటేశ్వ స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణను  260 కోట్ల రూపాయలతో రెండు దశల్లో చేపట్టనున్నారు.  మొదటి దశలో దాదాపు  140 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకార నిర్మాణానికి 92 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు.  రూ. 92 కోట్లతో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం నిర్మించబోతున్నారు. ఇక  రెండో దశలో తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నట్లుగా ఆలయ మాడవీధులు నిర్మించనున్నారు.  

అమరావతిలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణం, విస్తరణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... రాజధాని అమరావతిలో   చేపట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని టీటీడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధిచేస్తామన్నారు.  రెండు దశల్లో చేపట్టనున్న ఈ పనులలో మొదటి దశలో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రూ.120 కోట్లతో రెండోదశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు-సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.  దేవతల రాజధాని అమరావతే.. మనకూ రాజధానిగా ఉంటుంది. కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆశీస్సులతో 2019లో అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిం చామన్న చంద్రబాబు.. కృష్ణానదీ తీరాన ఈ ఆలయ నిర్మాణానికి పాతిక ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు.  రాజధానికి అమరావతి అనే నామకరణం కూడా ఆ స్వామి కృపతోనే చేశామన్నారు.  ఒక పవిత్ర కార్యం సంకల్పిస్తే దానికి ఇక్కడి ప్రజలు సహకరించారనీ, రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం విధ్వంసం తప్ప ఒక్కమంచి పనీ చేయలేదు. రైతులు మంచి సంకల్పంతో భూమి ఇస్తే ఐదేళ్లు వారికి నరకం చూపించారు. కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేశారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.  

తాను వెంకటేశ్వరస్వామి భక్తుడినని చెప్పిన చంద్రబాబు, తమ ఇంటి దైవం ఆ స్వామే అని చెప్పారు. మా ఇంటి నుంచి చూస్తే శేషాచల పర్వతం కనిపిస్తుందనీ, చిన్నతనం నుంచీ స్వామివారి ఆలయం చూస్తూ పెరిగాననీ అన్నారు.  స్వామికి అప్రతిష్ట కలిగించే ఏ పనీ  తాను చేయననీ, ఎవరినీ చేయని వ్వననీ స్ఫష్టం చేశారు.  తప్పులు చేస్తే వేంకటేశ్వర స్వామివారు చూస్తూ ఊరుకోడన్నారు.  తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుడితే తాన్ స్విమ్స్‌లో ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించానని గుర్తు చేశారు. నాడు వేంకటేశ్వరుని సేవలో పాల్గొనేందుకు వెళ్తుంటే  నక్సలైట్లు 23 క్లైమోర్ మైన్స్‌ను   పేల్చారు. ఆ సమయంలో స్వామి వారే తనకు ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు, రైతులు, భక్తులు, పాల్గొన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu