ఉగ్ర చెరలో భువనగిరి యువకుడు
posted on Dec 6, 2025 11:53AM

దక్షిణాఫ్రికాలోని మాలిలో భువనగిరికి చెందిన ఓ యువడిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మాలిలోని కోబ్రీలో రూబి బోర్ వెల్ సంస్థలో పని చేయడానికి వెళ్లిన భువనగిరి యువకుడు ప్రవీణ్ ను గత నెల 23న జెఎన్ఐ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కుమారుడి కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రభుత్వాన్ని కన్నీటితో వేడుకుంటున్నారు.
గత 14 రోజులుగా మాలిలో ఉగ్రవాదులచెరలో ఉన్న నల్లమాస ప్రవీణ్ ను విడిపించి క్షేమంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని వేడుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండ సోమరం గ్రామానికి చెందిన నల్లమస ప్రవీణ్ జీవనఉపాధి కోసం ఆఫ్రికా ఖండం లోని మాలి రాష్ట్రంలోని ఓ బోర్వెల్ కంపనీ నుంచి నల్లమసు ప్రవీణ్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నవంబర్ లో మాలీ వెళ్లినప్రవీణ్, గత నెల 23న చివరిసారిగా తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. అనంతరం అదే రోజు రాత్రి కిడ్నాప్ నకు గురయ్యాడు. అప్పటి నుంచీ ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు సంబంధిత బోర్ వెల్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు. దీంతో ప్రవీణ్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి వారికి తెలిసింది.
తమ కుమారుడిని ఉగ్రవా దుల చర నుంచి విడిపించి క్షేమంగా తమ ఇంటికి పంపిం చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్ తల్లిదండ్రులు వేడుకుం టున్నారు. ఇప్పటివరకు ప్రవీణ్ గురించి ఎటువంటి సమాచారం తెలియదని వారు తెలిపారు.