తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఈడీ సోదాలు.. ఎందుకంటే?

దేశవ్యాప్తంగా 15 ప్రాంతాలలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్నది. మెడికల్ కాలేజీలలో అనుమతుల కోసం ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం పది రాష్ట్రాల్లో   పదిహేను ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఈ సోదాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలలో ఆరు ప్రాంతాలలో సోదాలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్ లలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరులో భారీగా అవకతవకలు జరిగిన కేసుకు సంబంధించి ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆ వివాచరణలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  

ఈ కేసులో డబ్బుల లావాదేవీలు, బ్రోకర్ల నెట్వర్క్, నిధుల మార్గాలు, మనీ లాండరింగ్, ఎన్ఎంసీ అధికారులకు చెల్లింపులకు సంబంధించి కీలక విషయాలు ఈ సోదాలో  వెలుగులోకి  వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu