శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్ ఆర్. ఎన్ రవి
posted on Nov 30, 2025 10:03AM

తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఆర్. ఎన్ రవి దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆర్. ఎన్ రవికి టీటీడీ అధికారులు తీర్ధప్రసాదాలను అందజేశారు. మరోవైపు సినీ నిర్మాత అంబికా కృష్ణ, కమెడియన్ రఘు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే శివ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయానికి స్వామివారి సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లులేని భక్తులకు స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న (శనివారం) స్వామివారిని 79,791 మంది భక్తులు దర్శించుకోగా.. భక్తులు సమర్పించిన హుండీ కానుకలు రూ.3.73 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.