ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు

 

ఐబొమ్మ రవి పైరసీ వ్యవహారంపై కొనసాగిన కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలను పోలీసులు బయటపెట్టారు. తన అసలు ఐడెంటిటీ బయట పడకుండా ఉండేందుకు రవి తగ్గు జాగ్రత్తలు తీసుకు న్నాడు. మొత్తం పైరసీ నెట్‌వర్క్‌ను నడిపించేందుకు రవి పలు ఫేక్ ఐడెంటిటీలను సృష్టించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

రవి 'ప్రహ్లాద్' అనే పేరుతో నకిలీ గుర్తింపు పత్రాలను సిద్ధం చేసుకొని. అదే పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే కంపెనీలను కూడా ఓపెన్ చేశాడు. అంతేకాక, ప్రహ్లాద్ పేరుతోనే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడంతో పాటు, అనేక డొమైన్స్‌ను కొనుగోలు చేసి, తన అసలు వ్యక్తి త్వాన్ని పూర్తిగా దాచిపెట్టే ప్రయత్నం చేశాడు.

దర్యాప్తులో భాగంగా, రవి పైరసీ కార్యకలాపాల కోసం మొత్తం 20 సర్వర్లు, 35 డొమెయిన్‌లు కొనుగోలు చేశాడని పోలీసులు నిర్ధారించారు. కొంతకాలం క్రితం ఫిలిం చాంబర్ మరియు పోలీసులకు పంపిన బెదిరింపు ఇమెయిల్ కూడా రవియే పంపినదేనని, అతని ఇమెయిల్ ఐడీలో గుర్తించినట్లు విచారణ అధికారులు వెల్లడించారు. ఇమ్మడి రవికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బెట్టింగ్ యాప్స్, అలాగే వారి ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలపై సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు మరింతగా సాగుతోంది. ఈ కేసులో విస్తృతంగా నడిచిన పైరసీ వ్యవస్థ, దాని ఆర్థిక లావాదేవీలు మరిన్ని కీలక వివరాలను బయట పెడతాయని అధికారులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu