ఏపీలో మూడు కొత్త జిల్లాలు
posted on Nov 27, 2025 4:36PM

రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోద ముద్ర వేశారు. ఈ మూడు జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. అలాగే రాష్ట్రంలో ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.
అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, మదనపల్లి జిల్లాలోని పీలేరు, నంద్యాలలోని బనగానపల్లి, సత్యసాయి జిల్లాలోని మడకశిరలను రెవెన్యూడివిజన్లుగా కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది. కాగా పోలవరం జిల్లా పరిధిలోకి రంపచోడవరం, చింతూరు డివిజన్లు వస్తాయి. మార్కా పురం, కనిగిరి డివిజన్లను కలిపి మార్కాపురం జిల్లాగా, మదనపల్లె, పీలేరు డివిజన్లను కలిపి మదపల్లి జిల్లాగా ఏర్పాటౌతాయి.