జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం

జీహెచ్ ఎంసీ విస్తరణకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం (నవంబంర్ 25)  దాదాపు నాలుగు గంటల పాటుజరిగిన మంత్రివర్గ సమావేశంలో  పలు కీలక అంశాలపై చర్చించారు.  ముఖ్యంగా జీహెచ్ఎంసీ విస్తరణపై విస్తృతంగా చర్చించిన మంత్రివర్గం ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న  27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు  ఆమోదం తెలిపింది.

దీంతో పెద్ద అంబర్ పేట్, జల్‌పల్లి, శంషాబాద్‌లు, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయి గూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌‌పేట్, బండ్లగూడ జీగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్నాయి. అలాగే  రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ డిస్కం లకు తోడు మరో డిస్కమ్ ను ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లను ఈ కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. అదే విధంగా  రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్తు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలపై చర్చించిన మంత్రి వర్గం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు   నిర్ణయం తీసుకుంది.   .

 రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం  కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్తును తమతంట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu