అసోం తరహాలో యూపీలోనూ డిటెన్షన్ సెంటర్లు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాల ప్రక్షాళనలో భాగంగా ప్రస్తుతం పలు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐగా శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఆరంభమైన ఈ ఎస్ఐఆర్ వచ్చే నెల 4వ తేదీ వరకూ జరుగుతుంది. ఈ ఎస్ ఐఆర్ లో భాగంగా నకిలీ ఓట్లు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నవానికి ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. అలాగే.. సరైన పత్రాలు లేనివారి ఓట్లు, నకిలీ పత్రాలతో  ఓటు హక్కు పొందిన వారి ఓట్లూ కూడా తొలగిస్తున్నారు.  

ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ కూడా ఉంది.  యూపీలోకి నేపాల్‌ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉందని అంటున్నారు. నేపాల్ నుంచి అక్రమంగా వలస వచ్చి  గోరఖ్‌పూర్‌ నుంచి గౌతమ బుద్ధనగర్‌ వరకు లఖీన్‌పూరిఖేరీ, బెహ్రాయిచ్, ఫిల్‌బిత్‌ జిల్లాల్లో స్థిరపడిన వారి సంఖ్య అధికం. అంతే అక్రమంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చిన ముస్లింల సంఖ్య కూడా ఎక్కువే అంటున్నారు.  ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ లో ఓట్లు అక్రమంగా పొందిన వారు, అక్రమంగా నివసిస్తున్న వారి వివరాలు వెల్లడి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో  పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించి వారిని నిర్బంధించడానికి డిటెన్షన్‌ సెంటర్ల ఏర్పాటు చేయాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. అక్రమంగా వచ్చిన వారిని ఆ డిటెన్సన్ సెంటర్లలో పెట్టాని యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

ఇప్పటి వరకూ ఇలాంటి డిటెన్షన్ సెంటర్లు అసోంలో మాత్రమే ఉన్నాయి. ఇప్పడు యూపీలో కూడా డిటెన్సన్ సెంటర్లు వెలుస్తున్నాయిజలో  అక్రమంగా వచ్చినవారిని ఉంచి.. ఈ డిటెన్షన్ సెంటర్లలో ఉంచి.. వారు ఇంత కాలం ఎలా ఉన్నారు. వారి వ్యాపకం ఏమిటి? వారికి నకిలీ పత్రాల సంపాదించడంలో ఎవరి సహకారం అందింది.  వంటి వివరాలన్నీ రాబట్టాలని యోగి ఆదేశించారు. వారు తప్పు చేసినట్లు తేలితే చట్ట ప్రకారం శక్షించాలనీ, ఆ తరువాత వారినివారి వారి స్వదేశాలకు పంపించే చర్యలు తీసుకోవాలని యోగి భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే యోగి సర్కార్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu