తీపి గురుతులు.. గురువుల బెత్తం దెబ్బలు.. మంత్రి ఆనం

చిన్ననాడు గురువులు కొట్టిన బెత్తం దెబ్బలు ఎప్పటికీ తీపి గురుతులుగామిగిలిపోతాయని ఏపీ దేవా దాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నాడు గురువుల చేతిలో బెత్తం దెబ్బలే ఇప్పుడు తాము ఉన్నత  స్థాయికి ఎదగడానికి కారణమని పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులు చెప్పడాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.  

నెల్లూరు జిల్లా, చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం (డిసెంబర్ 5)న జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం (పేరెంట్ టీచర్ మీటింగ్) లో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ వీడియోను ఆయన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చూపారు.  ఆ వీడియోలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత రంగాల్లో మంచి గుర్తింపు పొందిన వారందరూ, తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయురాలి వద్దకు వచ్చి, ఆమెతో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, తాము ఆనాడు తిన్న బెత్తం దెబ్బలను అరచేతులను చూపించి మళ్లీ  కొట్టమని అడగడం వంటి మధురమైన దృశ్యాలను విద్యార్థులకు మంత్రి చూపించి, బెత్తం దెబ్బల మాధుర్యాన్ని, గురువులకు, విద్యార్థులకు ఉన్న అవినావభావ అనుబంధాన్ని నేటితరం విద్యార్థులకు వివరించారు.

విద్యార్థులందరూ గురువులను, తల్లిదండ్రులను గౌరవిస్తూ సత్ప్రవర్తనతో ముందుకు సాగితే విజ యాలను అందిపుచ్చుకోవాలని  దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియా వీడియోను మంత్రి ఆనం  వివరించిన తీరు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu