హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామి
posted on Sep 29, 2025 11:52AM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజైన సోమవారం (సెప్టెంబర్ 29) ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు. ఇక సాయంత్రం స్వర్ణ రథంపై భక్తులను అనుగ్రహిస్తారు. ఇక తిరుమల శ్రీ వేంకటేశ్వ రస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం (సెప్టెంబర్ 28) రాత్రి శ్రీ మలయప్పస్వామివారు
గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన గరుడ వాహన సేవలో వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్త బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ మలయప్ప స్వామిని గరుడ వాహనంపై తిలకించి పులకించారు.