మెస్సీ టూర్ ఖర్చు ఎవరిది?
posted on Dec 14, 2025 1:51PM

ఈ కార్ రేస్ ద్వారా 55 కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగింది. హైదరాబాద్ లో ఉన్న రోడ్లకూ, డ్రైనేజీలకూ ఇతరత్రా వసతులు లేవు. వాటిని పట్టించుకోకుండా ఈ హంగామా అవసరమా? హెచ్ఎండీఏ డబ్బు ఇలా ఎవరైనా దుబారా చేస్తారా? అంటూ ఇదే రేవంత్ సర్కార్ ధూమ్ ధామ్ చేయడంతో పాటు.. కేసులు కూడా నమోదు చేసింది. అంతే కాదు కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ని అనుమతి కూడా కోరింది. గవర్నర్ అనుమతి రాలేదని కూడా రేవంత్ పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోశారు గత జూబ్హీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో.
ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజనం మెస్సీ హైదరాబాద్ రాక.. అనే ఈవెంట్ కి ఇంత భారీ ఎత్తున ఖర్చు చేయడం అవసరమా? అనే ప్రశ్న తలెత్తింది.. అయితే ఇందుకు ప్రభుత్వం కూడా రియాక్టయ్యింది. ఇదసలు ప్రభుత్వ కార్యక్రమం కానే కాదు. ఇది ఒక ప్రైవేటు కార్యక్రమం. అయితే మెస్సీ ఎలాగూ పదనాలుగు ఏళ్ల తర్వాత ఇండియా వస్తున్నారు కాబట్టి.. ఇటీవలే అంటే డిసెంబర్ 8, 9 తేదీల్లో ఇక్కడ తెలంగాణ రైజింగ్ ఈవెంట్ జరిగింది కనుక ఇంటర్నేషనల్ గా తెలంగాణ రైజింగ్ స్లోగన్ వినిపించాలంటే ఇదే అవకాశమని.. ఈ టూర్ ని పార్వతీ రెడ్డి అనే ఒక టూర్ ప్యాట్రన్, సలహాదారు సాయంతో మెస్సీని హైదరాబాద్ రప్పించినట్టు తెలుస్తోంది.
అసలు మెస్సీ టూర్ ప్లాన్ చేసింది శతద్రు దత్తా. శతద్రు దత్తా ఎవరంటే.. ఈయన పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీకి చెందిన వ్యక్తి. శతద్రు దత్తా ఇనిషియేటివ్ పేరిట ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. క్రీడలకు సంబంధించిన పలువురు ప్రముఖులను భారత్ తీసుకొచ్చి ఈవెంట్ల నిర్వహణ చేయడం శతద్రు దత్త ఇనిషియేటివ్ సంస్థ చేసే ప్రధానమైన పని. గతంలోనూ పీలే, రొనాల్డినో, మారడోనా వంటి ప్రముఖ ఆటగాళ్లను భారత్ తీసుకొచ్చి ఈవెంట్లు నిర్వహించారు శతద్రు దత్తా. అందులో భాగంగానే 2022 లో అర్జెంటీనా ఫుట్ బాల్ ప్రపంచ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన మెస్సీ గోట్ ఇండియా టూర్- 2025 నిర్వహించారు.
అయితే ఈ విషయంలోనూ రాజకీయ వివాదం రాజుకుంది. ఇప్పటికే గ్రేటర్ ని అతి పెద్ద డివిజన్ల మయంగా తీర్చిదిద్దడంలో సర్కార్ ని ఏకి పడేస్తున్న బీజేపీ.. ఈ విషయంలోనూ పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగేలా చేసింది. మెస్సీ పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎంత? ఈ నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పాలంటూ బీజేపీఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెస్సీతో కలసి సీఎం రేవంత్ ఉప్పల్ స్టేడియంలో ఫుట్ బాల్ ఆడ్డానికి అయ్యే ఖర్చు ఏయే శాఖలు నిర్వహిస్తున్నాయో ఆ ఫుల్ డీటైల్స్ కావాలంటూ..డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. అయితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మెస్సీ పర్యటన కోపరేట్ చేస్తుందంటారు ప్రభుత్వ ప్రతినిథులు.
మెస్సీ రావడంతో ప్రపంచ వేదికపై తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ వినిపిస్తుంది. కనిపిస్తుంది. తెలంగాణకు మరింత మంచి పేరు వస్తుంది. కనుక ఈ కార్యక్రమం సరైనదే అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందులో భాగంగానే చివర్లో రేవంత్ రెడ్డి.. మెస్సీని ప్రపంచమంతా చూస్తుండగా... తెలంగాణ రైజింగ్ కమ్ జాయిన్ ద రైస్.. అంటూ నినదించారు. కాబట్టి ఇదంతా ప్రభుత్వమే అంతా ఖర్చు చేసి నిర్వహించిన కార్యక్రమం కాదు వందల వేల కోట్ల ఖర్చు అసలే చేయలేదు. ఇండియా టూర్ వచ్చిన మెస్సీని హైదరాబాద్ కూడా వచ్చి పొమ్మని ఒక చిన్న అడ్జస్ట్ మెంట్ చేశామంతే.. ఆయన్ను తెలంగాణ గ్లోబల్ అంబాసిడర్ గా నియమిస్తామని చెప్పామంటున్నారు ప్రభుత్వ ప్రతినిథులు. ఇది తెలంగాణలో యువజన క్రీడాభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి ఇందులో దురుద్దేశాలను ఆపాదించవద్దని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం.