క్రీడారంగంలో ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోడీ
posted on Sep 29, 2025 11:03AM

ఆసియాకప్ ఫైనల్ లో టీమ్ ఇండియా పాకిస్థాన్ పై ఐదు వికెట్ల ఆధిక్యతతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేైసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంపై సర్వత్రా ప్రశంసలు, అభినందనలూ వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ టీమ్ ఆండియాను అభినందిస్తూ చేసిన ట్వీట్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఆదివారం (సెప్టెంబర్ 29) రాత్రి పాకిస్థాన్ పై టీమ్ ఇండియా సాధికార విజయాన్ని నమోదు చేసి సంబరాలు జరుపుకుంటున్న వేళ.. ప్రధాని మోడీ పాకిస్థాన్ పై ఆసియాకప్ విజయాన్ని ఆపరేషన్ సిందూర్ తో పోలుస్తూ ట్వీట్ చేశారు.
ఇండియా విజయాన్ని నమోదు చేసిన కొద్ది సేపటికే మోడీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టులో ఆపరేషన్ సిందూర్ ను ప్రస్తావించారు. పహల్గామ్ దాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ తో ప్రతీకారం తీర్చుకుందని పేర్కొన్న ప్రధాని మోడీ.. ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా విజయాన్ని క్రీడా రంగంలో ఆపరేషన్ సిందూర్ గా అభివర్ణించారు.