అఖండ ప్రభంజనంలో మోగ్లీ ఎంత కలెక్ట్ చేసిందంటే..?
on Dec 14, 2025

అఖండకు పోటీగా విడుదలైన మోగ్లీ
అఖండ ప్రభంజనంలో నిలబడిందా?
ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది?
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అఖండ ప్రభంజనం కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండకు సీక్వెల్ గా రూపొందిన 'అఖండ-2' డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్లతో థియేటర్లలో అడుగుపెట్టి.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. దీంతో అఖండ ప్రభంజనంలో విడుదలైన 'మోగ్లీ' సినిమా పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. (Akhanda 2 Thaandavam)
నిజానికి అఖండ-2 డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 12కి వాయిదా పడింది. దీంతో డిసెంబర్ 12న విడుదలవ్వాల్సిన 'మోగ్లీ' పోస్ట్ పోన్ అవుతుందని అందరూ భావించారు. కానీ, ఒక్కరోజు వెనక్కి జరిగి.. డిసెంబర్ 12 రాత్రి ప్రీమియర్లతో థియేటర్లలో అడుగుపెట్టి.. మోగ్లీ టీమ్ ఊహించని సాహసం చేసింది. అయితే సినిమా డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది. (Mowgli 2025)
Also Read: అఖండ-2 రెండు రోజుల కలెక్షన్స్.. బాలయ్య బాక్సాఫీస్ తాండవం!
ఓ వైపు అఖండ తాండవం, మరోవైపు పాజిటివ్ టాక్ రాకపోవడంతో.. మోగ్లీ అసలు బాక్సాఫీస్ దగ్గర నిలబడగలదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఈ మూవీ ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు రూ.1.22 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. పెద్ద సినిమాకి పోటీగా విడుదలైన చిన్న సినిమా.. మొదటి రోజు కోటి కలెక్ట్ చేయడం అంటే గొప్ప విషయమనే చెప్పాలి.
కాగా, మోగ్లీలో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించగా.. సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



