మెగా ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్..!
on Dec 14, 2025

వచ్చే ఏడాది బాక్సాఫీస్ దగ్గర మెగా సందడి చూడబోతున్నాం. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాలు 2026లో విడుదల కానున్నాయి. అప్పుడే ఫస్ట్ సింగిల్స్ తో ఈ మూడు సినిమాలు మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడం విశేషం.
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్లా' సాంగ్ అక్టోబర్ లో విడుదలైంది. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ సాంగ్ ఇప్పటికే 83 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించడం విశేషం. (Meesaala Pilla)
రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ 'పెద్ది'. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి 'చికిరి చికిరి' అంటే సాగే ఫస్ట్ సింగిల్ నవంబర్ లో విడుదలై సోషల్ మీడియాని షేక్ చేసింది. యూట్యూబ్ ఇప్పటికే 97 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. (Chikiri Chikiri)
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఫిల్మ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాని 2026 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా 'దేఖ్‌లేంగే సాలా' తాజాగా విడుదలైంది. దేవి ఎనర్జిటిక్ మ్యూజిక్, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్, పవన్ వింటేజ్ స్టెప్స్ తో ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. 24 గంటలలోపే దాదాపు 30 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. (Dekhlenge Saala)
మెగా హీరోలు సినిమాలలో పాటలు బాగుంటాయనే పేరుంది. ఇప్పుడు దానిని నిజం చేస్తూ.. మెగా హీరోల అప్ కమింగ్ సినిమాల ఫస్ట్ సింగిల్స్ అన్నీ హిట్ అవ్వడం మెగా ఫ్యాన్స్ బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



