ఓటేసేందుకు వెడుతూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
posted on Dec 13, 2025 12:34AM
.webp)
తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు వెడుతూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడినవిషాద ఘటన ఇది. మెదక్ జిల్లా పెద శంకరం పేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. పంచాయతీ ఎన్నికలలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామరెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది బైక్ పై వెడుతున్న వీరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు.
మృతులను లింగమయ్య, సాయమ్మ, సాయిలు, మానసలుగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసిటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.
ఆదివారం (డిసెంబర్ 14) పోలింగ్ ఉండటంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం (డిసెంబర్ 14) బయలుదేరిన ఈ కుటుంబం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంమాగీ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రాణం తీసిన ఓటు అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.