Top Stories

రైతు నాయకుడిగా మారిన రిటైర్డ్ డీజీపీ

  కోకో గింజలు కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసగిస్తున్న మోండలీజ్ కంపెనీ, ఇతర బహుళ జాతి కంపెనీల మోసాలకు నిరసనగా, రాష్ట్ర ప్రభుత్వ పరిష్కారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు.కోకో రైతులకు న్యాయం చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కార్పొరేట్ కంపెనీల మోసాలను అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నానుద్దేశించి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రిటైర్డ్ డిజిపి ఏ.బీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు నెలలుగా కోకో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని, గత వారం రోజులుగా పోరాటాన్ని ఉధృతం చేశారని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  అచ్చెన్నాయుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారులు సమక్షంలో పెద్ద సంఖ్యలో వచ్చిన కోకో రైతులతో జరిపిన చర్చలకు భౌతికంగా రాకుండా  మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది కంపెనీల లెక్కలేనితనమని విమర్శించారు. రైతులకు బిక్షం వేస్తున్నట్లుగా అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకు రూ.880/- ఉంటే మోండలీజ్ కంపెనీ రూ.450/- కు మించి ధర ఇవ్వలేమని చెప్పడం దుర్మార్గమని, ఇది బహుళ జాతి కంపెనీల కుట్రలో భాగమని విమర్శించారు.  రాష్ట్ర మంత్రులు ఎన్నిసార్లు ప్రశ్నించినా మోండలీజ్ కంపెనీ ప్రతినిధుల మొండితనంతో కూడిన సమాధానం హేతుబద్ధంగా లేదన్నారు. గత సంవత్సరం వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం ధర ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కస్టమ్స్, ఇతర గణాంకాలను పరిశీలిస్తే గత నెల 25న కిలో కోకో గింజలను ఇవే కంపెనీలు రూ.1074/- దిగుమతి చేసుకొన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన నియంత్రణ లేకపోవడంతో కంపెనీల ఇష్టారాజ్యంగా మారిందన్నారు. కంపెనీ కిలో కోకో గింజలను రూ.450/- లకు కొనుగోలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.50 కంపెనీకి ఇచ్చి రూ.500లకు కొనుగోలు చేస్తామని  రాష్ట్ర మంత్రులు ప్రకటించిన నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నామన్నారు. బహుళ జాతి కంపెనీల మోసాలను అంతర్జాతీయ మీడియా ద్వారా ఎండగడతామని హెచ్చరించారు.
రైతు నాయకుడిగా మారిన రిటైర్డ్ డీజీపీ Publish Date: May 23, 2025 8:13PM

హైదరాబాద్‌లో మొదటి కరోనా కేసు నమోదు

  తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని డాక్టర్‌కు కరోనా పాజిటివ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.  ఏపీలో కరోనా కేసులు వెలుగు చూశాయి. ఏపీ విశాఖలో కొవిడ్ కేసు నమోదైంది. పిఠాపురం కాలనీకి చెందిన మహిళకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. కడపలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తీవ్ర జ్వరంతో కడప రిమ్స్ లో చేరిన నంద్యాల జిల్లా వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. భారత్ లో ఇప్పటికే 257కేసులు కోవిడ్ నమోదయ్యాయి. కేరళాలో 200కుపైగా కేసులు నమోదయ్యాయి.  సింగపూర్, థాయిలాండ్, చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ క్రమంగా భారత్ లోనే విస్తరిస్తుంది. ఆదిలోనే కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రకటించాయి. ప్రజలు మాస్కులు ధరించాలని..కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. ఐసోలేషన్ కేంద్రాలు, ఆసుపత్రులను సిద్దం చేయాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కొత్త కోవిడ్ వేరియంట్ ఇది సాధారణ కోవిడ్ కంటే వేగంగా వ్యాపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. లక్షణాలు చాలామందిలో తేలికపాటి జ్వరంగా ఉంటాయి. కొందరికి గొంతునొప్పి, దగ్గు, అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు, అధిక వయసు వారికి జాగ్రత్తలు అవసరమైన పరిస్థితి. అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం ఏమి లేదని వైద్యులు అంటున్నారు.  
హైదరాబాద్‌లో మొదటి కరోనా కేసు నమోదు Publish Date: May 23, 2025 7:01PM

తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా : సీఎం రేవంత్‌

  తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్నిముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం కేంద్రీయ విద్యాలయన్ని ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని సీఎం పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని.. తర్వాత అందరినీ కలుపుకుని ముందుకెళ్తామని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని రేవంత్ తెలిపారు.  జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేస్తామని, వారికి ఇళ్ల పట్టాలు అందించే బాధ్యతను స్థానిక నేత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. పటాన్‌చెరును మినీ ఇండియాగా అభివర్ణించిన ఆయన, బీహెచ్ఈఎల్, బీడీఎల్, నిమ్జ్, ఇక్రిశాట్ వంటి సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతానికి వచ్చాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. రైతులను అప్పుల బాధ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం విముక్తి చేసిందని సీఎం అన్నారు. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రూ.12 వేలకు పెంచి అందిస్తున్నామని, భూమిలేని కౌలు రైతులకు కూడా సహాయం చేస్తున్నామని తెలిపారు.  "గతంలో వరి వేసుకుంటే ఉరేనని ఆనాటి సీఎం కేసీఆర్ అన్నారని తెలిపారు. కానీ, నేడు మేం వరి పంటకు బోనస్ ఇస్తున్నాం" అని గుర్తుచేశారు. 18 నెలల్లో మహాలక్ష్మి పథకం కోసం రూ.5,500 కోట్లు కేటాయించామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ప్రతినిధులు కూడా మన రాష్ట్ర మహిళలు తయారుచేసిన వస్తువులను చూసి అభినందించారని సీఎం పేర్కొన్నారు. మహిళలే బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి కిరాయికి ఇచ్చేలా ఆర్థిక స్వావలంబన చర్యలు తీసుకుంటున్నామని, ఇందిరమ్మ ఆదర్శంగా, సోనియమ్మ స్ఫూర్తితో మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా : సీఎం రేవంత్‌ Publish Date: May 23, 2025 6:18PM

రాజ్‌ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

  ఏపీ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్‌ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. తన కొడుకు అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించడం లేదంటూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.  మద్యం స్కాంలో సీఆర్పీసీ 160 ప్రకారం హైదరాబాద్‌లో ఉంటున్న తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదంటూ కసిరెడ్డి అందులో పేర్కొన్నారు. దాఖలు చేసిన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి పంపించామని పేర్కొన్నారు. ఈ నెల 19న తండ్రీకొడుకుల పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ పార్థివాలా ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.  వాటిని కొట్టివేస్తున్నట్లు తాజాగా శుక్రవారం తీర్పు వెలువరించింది. రెగ్యులర్ బెయిల్‌ వంటి విషయాలు హైకోర్టులో చూసుకోవాలని  సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నాది.   
రాజ్‌ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ Publish Date: May 23, 2025 5:02PM

అమరావతి రాజధానిపై జగన్ విచిత్ర వాదన.. ప్లేస్ మర్చాలంట

  ఏపీ మాజీ సీఎం  జగన్  చాలాకాలం తర్వాత అమరావతి రాజధానిపై విచిత్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని పాత ఆరోపణలే  తిరిగి గుప్పించారు.  అల్రెడీ గతంలో మొదలు పెట్టిన పనులు పూర్తి చేయడానికని, నిర్మాణ వ్యయం పెంచేస్తూ ఎడాపెడా అప్పులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.  అమరావతిని ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాంతంలో కాకుండా బెజవాడ, గుంటూరుల మధ్య నిర్మించాలని సూచనలు కూడా చేస్తున్నారు. అయితే ఆయన నోటి వెంట మూడు రాజధానుల ప్రపోజల్ మాత్రం రావడం లేదు.  వైసీపీ  అమరావతి ప్రాంతంలో పూర్తిగా బలహీన పడిందనేది 2024 ఎన్నికల్లో నిరూపితమైంది. ఏకంగా 151 ఒక సీట్లతో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ,  మూడు రాజధానుల బిల్లును తెరపైకి తీసుకువచ్చి  రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బొక్కబోర్లా పడింది.  ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ  వైజాగ్‌లో చేసిన హడావిడి వర్కౌట్ కాలేదు. వైజాగ్‌ సిటీలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక అమరావతిలో అయితే  జగన్ రాజధానికి వ్యతిరేకమనే భావన బలంగా పాతుకు పోయింది. రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. ఆ ఉద్యమం సుదీర్ఘంగా సాగినా అప్పటి వైసీపీ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నాలు చేసి రైతుల్లో మరింత వ్యతిరేకత పెంచుకుంది. వాళ్ళని డీల్ చేసే విధానంలో జగన్ ప్రభుత్వం ప్రదర్శించిన దూకుడుతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతైంది. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి ప్రజలు జగన్‌ని ఒక శత్రువుగా భావిస్తున్నారు.  దాంతో గత పది నెలల కాలంగా  రాజధాని ప్రాంతానికి చెందిన వైసిపి నేతలే కాకుండా మొత్తం పార్టీ నాయకులు కూడా అమరావతిపై సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఎన్నికల జరిగి ఏడాది అయిపోవడంతో నెమ్మదిగా మళ్లీ రాజధాని ప్రాంతంలో ఉనికి చాటుకోవడం కోసం వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో అధునాతన  ప్యాలెస్ కట్టుకున్న జగన్.. మళ్లీ అమరావతి నిర్మాణ వ్యయాలు పెంచేశారని, అక్రమాలకు తెర లేపుతున్నారని బురద జల్లే ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.తాజా ప్రెస్ మీట్ లో జగన్ రాజధానిని  నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో, లేక విజయవాడ - గుంటూరుల మధ్య  ఒక 500 ఎకరాల్లోనో కట్టుకోవాలని సూచించారు. ఇక అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఐకానిక్ టవర్స్‌పై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. అమరావతిలో కొలువుదీరే ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది.  సమీకృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల ఆఫీసులు ఇందులో ఉంటాయి. మొత్తం 5 టవర్లను గతంలో మాదిరే ఈసారి కూడా మూడు ప్యాకేజీల కింద విభజించారు. రూ. 46 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బిడ్లు ఆహ్వానించారు. ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2,703 కోట్లతో టెండర్లను పిలిచారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల వైఖరి కారణంగా ఇప్పుడు అంచనా వ్యయం 73 శాతం పెరిగింటున్నారు.  అయితే ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన ఐకానిక్ టవర్స్ నిర్మాణ వ్యయం పెరగడంపై జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణాలు తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో మాజీ సీఎం ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్న చోట ల్యాండ్ రేటు  ఎంత ఖరీదైందో చెప్తున్నారు. అక్కడ పెడుతున్న ఖర్చుతో హైదరాబాద్, బెంగళూరుల్లో 5 స్టార్ వసతులతో అద్భుతమైన భవంతులు కట్టుకోవచ్చని విచిత్రమైన లెక్కలు చెప్పడం మొదలు పెట్టారు. అమరావతి రాజధాని పున:నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభించడం...మూడేళ్ళలో అమరావతి రాజధాని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ నేతలు తీరు చూస్తే వారి విధానం మారలేదని స్పష్టమవుతోంది. అప్పులు తెచ్చి అమరావతి కోసం పెడితే మిగిలిన ప్రాంతాల సంగతేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమరావతికి కృష్ణా నది ముంపు ప్రమాదం పొంచి ఉందని తిరిగి ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా జగన్ ప్రెస్‌మీట్‌తో ఆయన అమరావతికి ఎంత వ్యతిరేకో స్పష్టమవుతుందని అంటున్నారు.  అలాగే  క్లియర్‌గా జగన్ మిస్ అయిన ఒక పాయింట్‌ని లేవనెత్తుతున్నారు. అంత సులభంగా ఏపీ రాజధానిని  యూనివర్సిటీ భూముల్లోనో.. లేక విజయవాడ గుంటూరు మధ్య 500 ఎకరాల భూముల్లో నిర్మించే అవకాశం ఉన్నప్పుడు తమ ప్రభుత్వ హయాంలో  జగన్  మూడు రాజధానుల ప్రహసనానికి ఎందుకు తెర లేపారని ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆయన ఇప్పుడు చేస్తున్న సూచనలు అప్పుడే అమలు చేసి ఉంటే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయే పరిస్థితి  వచ్చేది కాదని యద్దేవా చేస్తున్నారు.
అమరావతి రాజధానిపై జగన్ విచిత్ర వాదన.. ప్లేస్ మర్చాలంట Publish Date: May 23, 2025 4:26PM

బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు

  మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా డీకే అరుణని నియమించారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ పదవి ద్వారా డీకే అరుణ తెలంగాణలో ఏ గోడౌన్‌లోనైనా తనిఖీలు చేయొచ్చు ఆహార ధాన్యాల నాణ్యత పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి  లోక్‌సభ సభ్యురాలు డీకే అరుణ కృతజ్ఞతలు తెలియజేశారు.  రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడం నా లక్ష్యమని పేర్కొన్నారు. ఈ బాధ్యత ద్వారా తెలంగాణలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాను, అని ఆమె పేర్కొన్నారు. కాగా డీకే అరుణ స్వస్థలమైన గద్వాల పట్టణంలో ఈ నియామకం సందర్భంగా ఆమె అభిమానులు, బీజేపీ కార్యకర్తలు కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 
బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు Publish Date: May 23, 2025 4:13PM

సంధ్య థియేటర్ తొక్కిసలాటపై మరోసారి పోలీసులకు నోటీసులు

    హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్  తెలంగాణ పోలీసులపై  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని హైదరాబాద్ సీపీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని కమీషన్ పేర్కొంది. పుష్ప 2 ప్రీమియర్‌‌ షో సందర్భంగా తొక్కిసలాటలో రేవతి మరణించగా  ఆమె కుమారుడు శ్రీతేజ్‌‌  తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి విధితమే. స్పెషల్ షో అల్లు అర్జున్​ వచ్చేందుకు పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్సీకి తెలపాగా.. పోలీస్ ​స్టేషన్​కు కూతవేటు దూరంలో ఉన్న థియేటర్​ దగ్గర డీజేలు పెట్టి, హంగామా చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని హ్యూమన్ రైట్స్ కమిషన్   ప్రశ్నించింది.  
సంధ్య థియేటర్ తొక్కిసలాటపై మరోసారి పోలీసులకు నోటీసులు Publish Date: May 23, 2025 3:52PM

కవిత మరో షర్మిల కాబోతోంది..ఎంపీ షాకింగ్ కామెంట్స్

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్తరం రాయించారేమోనని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిల కాబోతోంది అని హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకు కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయితీనా.. లేక ఆస్తుల పంచాయితీనా అని ప్రశ్నించారు. తన వారసుడు కేటీఆరేనని ప్లీనరీలో కేసీఆర్ చెప్పాకనే చెప్పారని ఎంపీ తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారేమే అని ఆయన తెలిపారు. పార్టీ నుంచి కవితను కట్టుబట్టలతో బయటకు పంపేందుకు కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు ఒక్కటయ్యారని ఆరోపించారు. కవిత హస్తం పార్టీలోకి వెళ్లే ఛాన్స్ ఉందని రఘునందన్ అన్నారు.. ఆమె వెంట ఉండి అంతా నడిపిస్తోంది పాత బిజినెస్ పార్ట్‌నర్ సీఎం రేవంత్ రెడ్డి అని షాకింగ్ కామెంట్స్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విషయంలో కవిత మాట్లాడినవి వాస్తవాలేని ఆయన అన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతోందన్నారు.ఎవరు ఏం చేసినా.. తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు  
 కవిత మరో షర్మిల కాబోతోంది..ఎంపీ షాకింగ్ కామెంట్స్ Publish Date: May 23, 2025 3:05PM

ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులతో సీఎం వరుసగా భేటీలు అవుతున్నారు. ఈరోజు ఉదయం కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషితో  ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్‌ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్‌ పథకం అమలుపై ప్రహ్లాద్‌ జోషితో సీఎం చంద్రబాబు చర్చించారు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సోలార్ ఏర్పాటు లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలని కోరామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీలకు పదివేల రూపాయల వరకూ సబ్సీడీతో సోలార్ రూఫ్ టాప్‌లో సోలార్ ప్యానల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించామని చెప్పారు. కేంద్ర సహకారంతో విద్యుత్తు ధరలు తగ్గించడంతో పాటు క్లీన్ ఎనర్జీకి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, ఏరోస్పేస్ రంగాలలో ఆంధ్రప్రదేశ్ దూరదృష్టిని కేంద్ర రక్షణ మంత్రికి సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కీలక ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పరిశోధన సహకారం, వ్యూహాత్మక సంస్థాపనలతో కూడిన సమగ్ర ప్రణాళికను వివరించారు. ఆత్మనిర్భర్ భారత్‌ను రక్షణ ఉత్పత్తి, ఆవిష్కరణల ద్వారా ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించడానికి ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు సమావేశంలో పాల్గోన్నారు.
ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు  భేటీ  Publish Date: May 23, 2025 2:34PM

త్వరలో కవిత కొత్త పార్టీ ! తండ్రికి లేఖ వెనుక ఎత్తుగడ ఇదే !

  క‌ల్వకుంట్ల క‌విత త‌న తండ్రిని  విబేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్ర‌మేన‌ట‌. వ‌చ్చే రోజుల్లో క‌విత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. కార‌ణం క‌విత పార్టీ బ‌య‌ట‌కొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు సమాచారం. ఇదంతా జ‌రిగే ప‌నేనా? అందుకా అవ‌కాశాలున్నాయా? అని ఆలోచిస్తే.. ఇదంతా నేరుగా కేసీఆర్ నుంచే వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌గా తెలుస్తోంది. గులాబీ బాస్ త‌న ఫ‌స్ట్ ప్ర‌యారిటీ అల్లుడు హ‌రీష్ రావ్ కి ఇస్తే ఆయ‌న స‌సేమిరా అన్నాడని స‌మాచారం. మామ‌కు ద్రోహం చేసిన రెండో చంద్ర‌బాబును అవుతాను. అది నాకిష్టం లేదు. ఆ ముద్ర నేను వేయించుకోలేన‌ని డైరెక్టుగా విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు హ‌రీష్ రావు చెప్ప‌డం కూడా అంతే వాస్త‌వం. ఒక వేళ అలా జ‌రిగినా కూడా తాను త‌న మామ కేసీఆర్ బ‌తికుండ‌గా పార్టీని వీడే ప్ర‌స‌క్తే లేద‌ని తెగేసి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. క‌ట్ చేస్తే పార్టీలో ప్ర‌స్తుతం కేసీఆర్ త‌ర్వాత అంత‌టి సుప్రిమో కేటీఆరే. త‌ర్వాత హిమాన్షు ప‌రం అవుతుందేమోగానీ మ‌రెవ‌రికీ ఇందులో భాగ‌స్వామ్యం లేదు.  ఇక్క‌డ కేసీఆర్ అస‌లు ప్లానేంటంటే డీఎంకే, అన్నాడీఎంకేలాగా.. పార్టీ చీలినా పెద్ద స‌మ‌స్య‌లేద‌ని.. అధికారం మాత్రం మ‌న ఇంట్లోనే ఉండాల‌న్న‌ది చంద్ర‌శేఖ‌ర‌రావు అస‌లు ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది. అలా తొలుత హ‌రీష్ రావును ఆ దిశ‌గా ప్ర‌యోగించాల‌ని ప్ర‌య‌త్నిస్తే అది ఆదిలోనే హంస‌పాదులా మారిందట‌. అప్ప‌ట్లో అమిత్ షా కూడా హ‌రీష్ రావును గ‌ట్టిగానే ట్రై చేసిన‌ట్టు స‌మాచారం. హ‌రీష్ బీజేపీలోకి వెళ్తారేమోన‌ని కేసీఆర్ కూడా బాగానే ఎదురు చూశార‌ట‌. అలాగైనా మ‌న‌లో ఒక‌డు ఇత‌ర పార్టీలోకెళ్లి అక్క‌డి నుంచి అధికారంలో ఉండ‌టం కూడా క‌లిసొచ్చే అంశ‌మే అన్న‌ది కేసీఆర్ అస‌లు వ్యూహ‌మ‌ట‌. ఇప్పుడు.. చూడండీ ఎక్క‌డి నుంచో పొడుచుకొచ్చిన రేవంత్ సీఎం అయి కూర్చుని కాళేశ్వ‌రం గుంత‌లు మొత్తం త‌వ్వుతున్నాడు. ఏమో కాంగ్రెస్ వాళ్లే కాళేశ్వ‌రాన్ని పేల్చేశారేమో అని కేటీఆర్ ఎంత బ‌నాయిస్తున్న.. వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. రేవంత్ అయితే సీఎం ఐయిపోయాడు.. క‌ల్వ‌కుంట్ల కుటుంబం ముక్కు పిండుతున్నారు. అదే గ‌తంలో కేసీఆర్ ఆశించిన‌ట్టు హ‌రీష్ పార్టీ బ‌య‌ట‌కు వెళ్లి ఏ బీజేపీలోనో చేరి ఉంటే.. అప్ప‌టికి మంచి ఫామ్ లో ఉన్న బీజేపీ అధికారంలోకి వ‌చ్చి.. హ‌రీషే సీఎం అయి ఉంటే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేదిగా.. అన్న‌ది కేసీఆర్ మ‌న‌సులో మ‌రుగుతోన్న‌ట‌ ఆలోచ‌న‌ట‌.ఇదంతా ఇలా ఉంటే అల్లుడి వ‌ల్ల ఎలాగూ వ‌ర్కువుట్ కావ‌డం లేదు.. ఈయ‌న సంగ‌తి ఇలా ఉంచి.. త‌న కూతురి ద్వారా మ‌రో ప్ర‌యోగం చేసి చూద్దాం.. త‌ద్వారా ఏదైనా స‌క్సెస్ సాధించ‌వ‌చ్చేమో. పోతే వెంట్రుక వ‌స్తే కొండ‌.. అన్న కోణంలో ఇప్పుడు కూతురు క‌విత  నుంచి న‌రుక్కొస్తున్న‌ట్టుస‌మాచారం.క‌విత వ‌స్తే ఏం జ‌రుగుతుంద‌ని.. చూస్తే.. అట్ లీస్ట్ ఓట్ల‌ను చీల్చి.. బీఆర్ఎస్ కి స‌పోర్ట్ చేయ‌నైనా చేయ‌రా? అన్న‌దొక అంచ‌నా. ఆమె ఎవ‌రి ఓట్లు చీలుస్తారు? ఆమె వెన‌క దాగిన ఓటు బ్యాంకు ఎలాంటిద‌ని చూస్తే.. ఆమె తొలి నుంచి తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ ఆడ‌ప‌డుచుగా చేసిన బ‌తుక‌మ్మ‌లు మ‌హిళా లోకాన్ని ఆక‌ర్షించాయి. ఈ దిశ‌గా మ‌హిళా ఓటు బ్యాంకును కాస్త క‌వ‌ర్ చేయ‌వ‌చ్చు. ఇక పోతే బీసీ ఓటు బ్యాంకు. బీసీల వాణి వినిపించ‌డంలోనూ క‌విత ఒక ప్ర‌యార్టీగా తీసుకున్నారు.  దానికి తోడు తెలంగాణ‌లో బీసీల గురించి భారీ ఎత్తున కొట్లాట న‌డుస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ వ‌ర్సెస్ తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ పోరు షురూ  అయ్యింది. మ‌ల్ల‌న్న అయితే ఏకంగా బీసీల కోసం త‌న కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వాన్ని కూడా కోల్పోయాడు. రెడ్ల‌తో ఢీ అంటే ఢీ అన్నాడు. దానికి తోడు రేవంత్ రెడ్డే చివ‌రి రెడ్డి సీఎం కావాల‌ని అన్నాడు. ఈ బీసీ బ్యాగ్రౌండ్ లోకి క‌విత సైతం ప్ర‌వేశించి.. ఇక్క‌డ నాలుగు ఓట్లు చీలినా.. త‌న బీఆర్ఎస్ కి ఆమె మేలు చేసిన‌ట్టే లెక్క‌!ఇలా ప‌రి ప‌రివిధాలా ఆలోచించి క‌విత  ను ఒక బాణంగా ప్ర‌యోగించాల‌ని కేసీఆర్ చూస్తున్న‌ట్టు స‌మాచారం. ఇలా జ‌రిగే అవ‌కాశ‌ముందా? గ‌తంలో ఎవ‌రైనా ఇలా చేశారా? అని చూస్తే జ‌గ‌న్ త‌న సోద‌రి ష‌ర్మిళ‌ను కూడా స‌రిగ్గా ఇలాగే వినియోగించిన‌ట్టు ఒక టాకుండేది అప్ప‌ట్లో. ఆమె ఒక ఎమోష‌న‌ల్ డ్రామాను పండించి.. మొద‌ట ఇక్క‌డ త‌న పార్టీని తెలంగాణ‌లో తెరిచి తిరిగి అక్క‌డ ఏపీలోకి వెళ్లి.. త‌మ ఓటు బ్యాంకు చీలి కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌డ‌కుండా ఒక కాపు కాచార‌న్న‌ది అప్ప‌ట్లో వినిపించిన మాట‌.  అలా క‌విత కూడా ఒక రాజ‌కీయ ప్ర‌యోగంగా తాను సైతం త‌న బీఆర్ఎస్ కి ఒక బీ టీంని ఎందుకు ఏర్పాటు చేసుకోవ‌ద్దు? మ‌న‌కి బీజేపీకి లింకు అంట‌గ‌ట్టి ఈ బీటీ మ్ ప్రాప‌గాండా చేయించుకోవ‌డం కంటే ఇదే మేలు. అదే మ‌న ద‌గ్గ‌ర ఒక సైడు దుకాణం ఉంటే.. దానితోనే లింకు పెట్టి మాట్లాడ‌తారు. దీంతో డ్యామేజీని భారీగా మేనేజ్ చేయొచ్చుగా అన్న‌ది క‌విత త్రూ కేసీఆర్ ఆడుతున్న మ‌రో రాజ‌కీయ డ్రామాగా దీన్ని అభివ‌ర్ణిస్తున్నారు ఆర్కే రేంజ్ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు.కేసీఆర్ కి తొలి నుంచి ఇలాంటి ప్ర‌యోగాలు ముక్కుతో పెట్టిన విద్య‌. ముక్కాయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. విజ‌య‌వంత‌మైన టీఆర్ఎస్ పేరు కూడా బీఆర్ఎస్ అంటూ పేరు మార్చిన ఆయ‌న‌కు క‌విత ద్వారా మ‌రో తెలంగాణ శ‌బ్ధంతో కూడిన పార్టీ పెట్టించ‌డం ఒక లెక్క కాదు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా పలు పార్టీ పేర్లు కూడా వినిపిస్తున్నాయ్. ఇక నేడో రేపో క‌విత నుంచి ఈ సౌండ్ మ‌నం విన్నా వినొచ్చ‌ని రాజ‌కీయ అభిజ్ఞాన వ‌ర్గాల భోగ‌ట్టా.
త్వరలో కవిత కొత్త పార్టీ !  తండ్రికి లేఖ వెనుక  ఎత్తుగడ ఇదే ! Publish Date: May 23, 2025 2:02PM

తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయి : రాఘవేంద్రరావు

  తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగు పడ్డాయిని ప్రముఖ దర్మకుడు రాఘవేంద్రరావు అన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు కలిశారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌, మాజీ తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. భక్తులు సంతోషంగా ఉన్నారని రాఘవేంద్రరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన కార్యక్రమాల గురించి ఛైర్మన్‌ వారికి వివరించారు. తుడా ఛైర్మన్‌ దివాకర్‌ రెడ్డి సైతం టీటీడీ ఛైర్మన్‌ను కలిశారు. బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆలయంలో ప్రమాణం చేసిన అనంతరం బీఆర్‌ నాయుడిని కలిసి సన్మానించారు. తుడాకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా పనిచేయాలని దివాకర్‌రెడ్డికి సూచించారు.  
తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయి : రాఘవేంద్రరావు Publish Date: May 23, 2025 1:46PM

పిల్ల సజ్జలకు సుప్రీంలో చుక్కెదురు

వైసీపీ  సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్  సజ్జల భార్గవరెడ్డికి   సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్ తగిలింది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు చేపట్టిన సజ్జల భార్గవ్ రెడ్డి  అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై  అనుచిత, అసభ్య, అశ్లీల పోస్టులతో రెచ్చిపోయారు. అయితే.. గత ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలై.. అద్భుత విజయంతో తెలుగుదేశం కూటమి అధకార పగ్గాలు అందుకున్న తరువాత సజ్జల భార్గవ్ రెడ్డిని ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చాకచక్యంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి తప్పించేశారు. ఆ తరువాత పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి ఎక్కడా కనిపించింది లేదు. వినిపించింది లేదు. అయతే చేసిన తప్పులు వదలవుగా జగన్ హయాంలో సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పెట్టిన పోస్టులపై   ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నమోదయ్యింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి తొలుత హైకోర్టునూ అక్కడ చుక్కెదురవ్వడంతో సుప్రీం ను ఆశ్రయించారు. సజ్జల ముందస్తు బెయిలు పిటిషన్ పై శుక్రవారం (మే 23)  విచారించిన సుప్రీం కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. అయితే రెండు వారాల వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ, ఆ లోగా సంబంధింత ట్రయల్ కోర్టును ఆశ్రయించాలన పేర్కొంది.   అయితే సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం  సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని భావిస్తున్నారా? ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో మేము గ్రహించలేమని అనుకుంటున్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.   సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే కేసుల్లో అంత తేలిగ్గా బెయిల్ లభిస్తుందని ఆశించవద్దని పేర్కొంది.
పిల్ల సజ్జలకు సుప్రీంలో చుక్కెదురు Publish Date: May 23, 2025 1:23PM

కడపలోనూ కరోనా కలకలం

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. 2019 నుంచి 2021 మూడు దశలలో కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉసురు తీసింది. జనం నెలల తరబడి కరోనా కర్ఫ్యూ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. మాస్కు లేకుండా అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మరో సారి కరోనా విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.  ధాయ్ ల్యాండ్ సింగపూర్ లలో కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉందన్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నా.. మన వరకూ రాదులే అని అంతా భావించారు. అయితే కొన్ని రోజుల కిందట కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్ని వార్తలు ఒకింత ఆందోళన కలిగించాయి. ఆ తరువాత ఏపీలోనూ తొలి కరోనా కేసు విశాఖలో వెలుగు చూసింది. ఒక వివాహితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ తరువాత ఆమె భర్తా, కుమారుడూ కూడా పాజిటివ్ అని తేలింది. వారిని హౌస్ ఐసోలేషన్ లో ఉంచారు. తాజాగా కడపలో కూడా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది.  నంద్యాల చాగలమర్రికి చెందిన ఒక వృద్ధురాలు తీవర జ్వరంలో కడప రిమ్స్ కు రాగా, ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో  ఆమెకు ప్రత్యేక వార్డులో  చికిత్స చేస్తున్నారు.  జిల్లాయంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. కడపలో కరోనా కేసు నమోదు కావడంతో తెలుగుదేశం పార్టీ కూడా అప్రమత్తమైంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో పార్టీ పండుగ మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం శ్రేణులు కరోనా ప్రికాషన్స్ తీసుకోవడమే కాకుండా, పట్టణంలో కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. శానిటైజర్స్, మాస్కులు సిద్ధం చేయడమే కాకుండా.. లక్షలాదిగా తరలివచ్చే ఈ కార్యక్రమంలో కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా మహానాడు ప్రాంగణంలో కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.  
కడపలోనూ కరోనా కలకలం Publish Date: May 23, 2025 1:08PM

మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో, లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి!

మనం ప్రేమించే వ్యక్తి మనతో ఉన్నప్పుడు కలిగే అనుభూతి గురించి మాటల్లో చెప్పలేం. ఆ సమయంలో ఆనందం రెట్టింపు అవుతుంది. అయితే ఎవరైనా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వారి భాగస్వామిని వారు నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటారు. వారి భావాలను ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి డేటింగ్ భాగస్వామిని ఎలా ఎంచుకోవాలో కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పింది వినడం: మీ పార్టనర్ మీ మాటలను జాగ్రత్తగా వింటుంటే మీ మాటలను సీరియస్ గా తీసుకుంటే వారు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అది నిజమైన ప్రేమకు సంకేతం వంటిది. ఎల్లప్పుడూ అండగా ఉండటం: కష్టమైనా, సుఖమైనా ఆ సందర్భంలో మీకు అండగా నిలిచేవారు నిజమైన భాగస్వామి. మీ సంతోషంలో, దుఖంలో మీ భాగస్వామి మీకు సపోర్టుగా ఉండాలి. మీ దుఖంలో పాలుపంచుకోవడం, మీకు ధైర్యాన్ని ఇవ్వడం..ఇది నిజమైన ప్రేమకు అర్థం. ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం: మీరు అనారోగ్యంగా ఉన్న సమయంలో మీ భాగస్వామి ప్రేమను సులభంగా అర్థంచేసుకోవచ్చు. మీరు అనారోగ్యానికి గురైనప్పుడు మీ భాగస్వామి మిమ్మల్ని చిన్నపిల్లల్లా చూసుకుంటారు. సకాలంలో మందులు, ఆహారం అందిస్తారు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కోపంగా ఉన్నప్పుడు భరోసానివ్వడం: మీరు కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మాత్రమే మిమ్మల్ని శాంతిపజేస్తారు. ఎవరైనా మిమ్మల్ని ప్రేమించనట్లయితే..మీ బాధ వారికి ఎలాంటి తేడా కలిగించదు. కాబట్టి మీరు కోపంగా ఉన్నప్పుడు మీ భాగస్వా మి బాధపడి, మిమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తే అలాంటి వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి.  
మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో, లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి! Publish Date: May 23, 2025 12:03PM

ఏపీలో కరోనా.. విశాఖలో తొలి కేసు నమోదు

నాలుగేళ్ల కిందట కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. 2019లో మొదలై 2021 వరకూ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మూడు దశలుగా విస్తరించి, వ్యాపించి లక్షల మంది ఉసురు తీసింది. ఇప్పుడు మరోసారి తన పంజా విసరడానికి రెడీ అయిపోయింది. గత వారం పది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో అయితే కేరళలో ఈ మహమ్మారి వ్యాప్తి వేగంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఏపీలో   క‌రోనా పాజిటివ్‌ కేసు న‌మోదైంది. విశాఖ జిల్లా మద్దెలపాలెంలో ఒక వివాహితకు కరోనా పాజిటివ్ వచ్చిందనీ,  రాష్ట్రంలో ఇదే తొలి కేసు అని ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఆ తరువాత ఆమె భర్త, ఇద్దరు పిల్లలకూ కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. వారికి చికిత్స అందించి కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉంచనున్నారు.  కరోనా వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా పాజిటివ్ వచ్చిన కుటుంబం నివసిస్తున్న ప్రాంతంలో  ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.   అంతే కాకుండా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుంపులుగుంపులుగా కూడవద్దనీ,   రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్ పోర్టులు, కోవిడ్  నియమావళి  పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉండాల‌ని ప్రభుత్వం పేర్కొంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గ దర్శకాలను తు.చ. తప్ప కుండా పాటించాలని ఆదేశించారు.  
ఏపీలో కరోనా.. విశాఖలో తొలి కేసు నమోదు Publish Date: May 23, 2025 10:25AM

మారని పాక్ తీరు.. ఘోర పరాభవం తరువాత కూడా ప్రగల్భాలు

పాకిస్ధాన్ తీరు మారలేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో ఆ దేశం ఉగ్రవాదానికి దన్ను గా ఉన్నదన్న సంగతిని ప్రపంచానికి చాటిన భారత్.. ఆ తరువాత తన సైనిక సత్తాను చాటి పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టింది. దాంతో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్థాన్ కాల్పుల విరమణకు వేడుకుంది. మానవతా దృక్పథంతో అందుకు అంగీకరించింది. ఇంత జరిగినా పాకిస్థాన్ తీరు మారలేదు. తాజాగా పాకిస్ధాన్ ప్రధాని తన నోటికి పని చెప్పి వాచాలతను చాటుకున్నారు.  1971 యుద్ధం నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నామని ప్రగల్భాలు పలికారు. అంతే కాదు ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాలుస్తాయని చెప్పడం ద్వారా మరోసారి కయ్యానికి కాలుదువ్వారు.  పాక్ ప్రధాని మాటలకు వంత పాడుతున్నట్లుగా ఆ దేశ సైనిక ప్రతినిథి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఉగ్రభావజాలాన్ని వ్యక్తం చేస్తూ అదుపు తప్పి మాట్లాడారు.  ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై నిప్పులు కక్కారు. పాకిస్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. "మీరు మా నీటిని అడ్డుకుంటే..  మేం మీ ఊపిరిని అడ్డుకుంటామన్నారు. దీనికి భారత్ కూడా దీటుగా స్పిందించింది.   ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాగవని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలను ఖాళీ చేయడంపై మాత్రమే భవిష్యత్తులో చర్చలు ఉంటాయని  తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం విశ్వసనీయంగా, శాశ్వతంగా ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్ లోనే ఉంటుందని పునరుద్గాటించారు. అలాగే నీరు, రక్తం కలిసి ప్రవహించవని గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.   
మారని పాక్ తీరు.. ఘోర పరాభవం తరువాత కూడా ప్రగల్భాలు Publish Date: May 23, 2025 10:02AM

ఏడిస్తే ఎన్ని లాభాలో...

మనిషి అన్నవాడికి స్పందించడం అవసరం అంటే కొన్ని సందర్భాలలో ఆనందం తో కన్నీరు వస్తే. బాధతో కన్నీరు వస్తుంది. అలా కన్నీరు పెట్టుకుంటే లాభమే. అని పరిశోదనలో తేల్చారు.కన్నీరు వల్ల లాభామ నష్టమా అన్న విషయం లో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా మరి. కొందరికి కన్నీరు అస్సలు రాదు.కొందరికి కన్నీరు అతికష్టం మీద వస్తుంది. కొందరికి కన్నీరు అలవోకగా వస్తుంది.వాళ్ళ నెత్తిన నీళ్ళ కుండ ఉందేమో అని అనిపించే విధంగా అదే ధారగా కన్నీరు పెట్టుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తారు.కొందరు మనసులో ఉన్న బాధను దుఖం రూపం లో బయటికి వెళ్ళ గాక్కుతారు.పొర్లి పొర్లి ఏడుస్తూ ఉంటారు.గతం తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. బాహాటంగా మనస్పూర్తిగా ఏడవడం లేదా కుళ్ళి కుళ్ళి ఏడవడం మనం గమనించ వచ్చు.అసలు కన్నీరు పెట్టుకుంటే లాభమా నష్టమా చూద్దాం. మనిషి ఏడవడం దుఃఖించడం ఒక సాధారణ ప్రక్రియ.ఒక్కోరిలో ఒక్కో భావనలు ఉంటాయి.దానికి బదులుగా దుఃఖం పెల్లుబికి బయటికి వస్తూ ఉంటుంది.అసలు మనిషి ఎందుకు ఏడు స్తాడో దుఃఖం తో ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో తెలుసా? మీరు ఆలోచించారా ? ఈమేరకు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలు పలు ఆశక్తి కరమైన అంశాలు వెలుగు చూసాయి.మనము ఏడవడం ద్వారా మనశరీరం, మెదడు రెండూ కీలక మని కనుగొన్నారు.అప్పుడే దానిఫలితాలు మనకు అందుతాయని అన్నారు. పిల్లవాడు పుట్టిన వెంటనే మొదటి సారి ఏడుస్తాడు.అసలు ఏడవడం ద్వారా వచ్చే లాభాము మీకు తెలియదు. ఏడవడం వల్ల వచ్చే లాభాలు అశక్తి కలిగించే అంశాలు తెలుసుకుందాం. 1)శరీరం డీ టాక్సీ ఫై అవుతుంది. *కన్నీరు మూడు రకాలు...  *రిఫ్లెక్స్ ద్వారా వచ్చే కన్నీరు...  *అదే పనిగా వచ్చే కన్నీరు...  *భావనాత్మ కంగా వచ్చే కన్నీరు... *రిఫ్లెక్స్ వల్ల వచ్చే కన్నీరు... కంటిలో పేరుకు పోయిన మట్టి,ఇతర పనికిరాని చెత్త అది కంటిని శుభ్రం చేస్తుంది. అదే పనిగా కంటి నుండి కన్నీరు ప్రవహిస్తుంటే అది మీ కళ్ళు చేమ్మగిల్లినట్లు. ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది.భావనాత్మకంగా వచ్చే కన్నీరు ఒత్తిడి వల్ల,లేదా ఉద్వేగాల వల్ల కన్నీరు బయటికి వస్తుంది.అవి మరల వేరే టాక్సిన్స్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కన్నీరు మన శరీరం లో ఉన్న వస్తువుల్ని శరీరం నుండి బయటికి వస్తుంది. మిమ్మల్ని మీరు శాంతింప చేసుకోవడం కన్నీరు సహకరిస్తుంది.. మన మనస్సు శాంత పరుచుకోవాలంటే ఏడవడం మంచి పద్ధతి.పరిశోదనలో ఏడవడం ద్వారా సింథటిక్ నర్వస్సిస్టం యాక్టివేట్ కావడాన్ని గమనించవచ్చని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. తద్వారా మన శరీరానికి కొంత ఉపశమనం కల్పించడం లో సహకరిస్తుంది.కొంత సేపు ఏడ్చిన తరువాత శాంతం గా ప్రాశంతం గా ఉన్నట్లు  అనుభూతి పొందుతారు. మీకు సహకారం లభిస్తుంది.. ఒక వేళ మీరు నిరాశ చెందినట్లయితే ఏడవడం ద్వారా మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీకు సపోర్ట్ అవసరం.అని భావిస్తారు.చిన్న పిల్లలు సైతం తమ పై దృష్టి పెట్టాలంటే ఏడవడం ఆయుధం గా వాడతారు.ఇలా చేయడం ద్వారా తాము అనుకున్న లక్ష్యం పూర్తి చేసామని  భావిస్తారు. దుఃఖం నుండి బయటికి రావడానికి దోహదం చేస్తుంది.. ఏడవడం లేదా దుఃఖించడం అన్నది ఒక ప్రక్రియ దుఃఖం పడడం,ఆగ్రహంతో కూడా దుఃఖం వస్తుంది.ఎడుస్తున్నప్పుడు ఏడ్చే సమయంలో ఒక పద్ధతి ప్రకారం ఏడవడం అవసరం దీనిద్వారా దుఃఖం నుండి బయటికి వచ్చినట్లు బరువు దిగి పోయినట్లు భావిస్తారు. నొప్పి నివారిస్తుంది.. దీర్ఘ కాలం పాటు ఏడవడం వల్ల ఆక్సిటోసిన్ మరియు ఎండార్ఫిన్ విడుదల అవుతుంది.ఇది ఫీల్ గుడ్ కెమికల్స్ గా పేర్కొన్నారు.శారీరక భావనాత్మక రెండువైపులా ఉన్న భావనను మనసులోని బాధను నివారించేందుకు సహకరిస్తుంది.ఒక్కో సారి ఎండోర్ఫిన్ విడుదల అయినప్పుడు మీ శరీరం ఒక నియమిత హద్దు వరకు వినే ప్రయత్నం చేస్తుంది.మన శరీరంలో ఉన్న ఆక్సిటోసిన్ ప్రశాంతత ఇస్తుంది. మూడ్ లో మార్పు వస్తుంది.. మన బాధను నొప్పిని తగ్గించడం లో సహకరిస్తుంది.ఏడవడం ద్వారా మీ మూడ్ కూడా బాగా అద్భుతంగా ఉంటుది.సత్వరంగా స్వేచ్చగా ఉండే విధంగా మీ మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు చల్ల బడుతుంది.శారీరకంగా బాగా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. భావనలను నియంత్రిస్తుంది... ఏడవడం అన్నది బాధ పడడం అన్నది మరొకరి బాధకు ఏడుపుకు జవాబుగా కాదు.చాలా సార్లు ఎప్పుడు ఏదైనా చాలా ఆనందం గా ఉంటారు. భయం లేదా ఒత్తిడి లో యాలె విశ్వ విద్యాలయం పరిశోధకులు అంటున్న మాట  ఏమిటి అంటే ఈ విధంగా బాధపడడం వల్ల మిమ్మల్ని మీరు నియంత్రించు కునేందుకు సహకరిస్తుంది. అసలు సహజంగా ఎప్పుడు ఎప్పుడు ఏడుస్తారు.. భయంకర మైన ఒత్తిడిలో ఉన్నప్పు డు ,లేదా తాను అనుకున్న లక్ష్యం లో ఓటమి పాలై నప్పుడు.తనకు కావాల్సిన ఆప్తులైన వారు దూరమై నప్పుడు. లేదా తమకి ఇష్టమైన వారే తమను తీవ్రంగా ద్వేషించి నప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడవడం పొర్లి పొర్లి ఏడవడం.మనకు కనిపిస్తుంది. మానసిక భావోద్వేగాలతో  ముడి పడిన సంఘటనలకు కారణంతామే అని భావించిన వారు.అనుకోని విధంగా అనూహ్య విజయం సాధించినందుకు ఆనంద భాష్పాలు కంటినుండి వస్తాయి. వైద్య చికిత్స ఎప్పుడు అవసరం... ఏడవడం ఎలాంటి వస్తువంటే మీకు సుఖం లభిస్తుంది.బాధ కలుగుతుంది.అందుకు ప్రతిగా మీరు ఏడుస్తారు అది సర్వసాధారణం మీరు ఏడవడం వల్ల మీరు బాగా ఉన్నట్లు భావిస్తారు.ఇలా చేస్తున్నందుకు సిగ్గు పడవద్దని ఏడుపు వచ్చినప్పుడు మనస్త్రుప్తిగా ఏడవండి. ఆబాధనుండి విముక్తి పొందండి. ఏదైనా విషయం లో ఆనందం లభిస్తుందో.లేదా దుఃఖం కలిగిస్తుందో చాలా సార్లు అప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నా ఎడుస్తారని ఏలే విశ్వవిద్యాలయం శాస్త్రజ్ఞులు అంగీకరిం చారు.ఏడవడం వల్ల భావనాత్మక నియంత్రణ బయటికి వస్తుంది.సహాయ పడుతుంది. ఏడుపు మంచిదే. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                      
ఏడిస్తే ఎన్ని లాభాలో... Publish Date: May 23, 2025 9:30AM

కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు.. ఇక అరెస్టేనా?

మాజీ మంత్రి అయిన కొడాలి నాని ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన  అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారు. అసభ్య పదజాలంతో.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా భావించే వారు. ఒక దశలో కొడాలి నాని అంటే కన్నా బూతుల నాని అంటేనే ఎవరైనా గుర్తుపడతారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అలా బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని  వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికే భయపడు తున్నారా అన్నట్లుగా మారిపోయారు. పరాజయం తరువాత ఆయన నియోజకవర్గం ముఖం చూసిన పాపాన పోలేదు. నియోజవర్గం అనేమిటి అసలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కించవచ్చు. అయినా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా తాను మారలేదనీ, తనలో ఫైర్ అలాగే ఉందనీ బిల్డప్పులు ఇచ్చేందుకు శతధా ప్రయత్నించడం మాత్రం మానలేదు. అయితే ఎప్పుడైతే ఆయన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారో.. అప్పటి నుంచీ కొడాలి నానిలో ఫైర్ పూర్తిగా ఆరిపోయింది. అరెస్టు భయం వెన్నాడుతోంది. ఆ నేపథ్యంలోనే  దాదాపుగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు.   కొంత కాలం కిందట ఛాతి నొప్పితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి వెళ్లారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పారు. అయితే కొడాలి నాని హెల్త్ బులిటిన్ను ఆ ముంబై ఆస్పత్రి విడుదల చేయలేదు కానీ, ఆపరేషన్ విజయ వంతమైందనీ, కొడాలి నాని కొలుకుంటున్నారనీ  గుడివాడకు చెందిన వైసీపీ నాయకుడొకరు మీడియాకు  తెలిపారు. అంతే ఆ తరువాత నుంచి కొడాలి నానికి సంబంధించి ఏ వార్తా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. నాలుగైదు రోజుల కిందట మాత్రం కొడాలి నాని ముంబై నుంచి తిరిగి వచ్చారనీ, హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారనీ వార్తలు వచ్చాయి. అయితే అవేమీ నిర్దారణ కాలేదు. అయితే కేసుల భయంతో వణికిపోతున్న కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన పట్ల ఎక్కడా సానుభూతి వ్యక్తం అవుతున్నదాఖలాలు లేవు. చివరికి పార్టీ అధినేత జగన్ కూడా కొడాలి నానిని పరామర్శించలేదు. అనారోగ్యం అన్నంత మాత్రాన కేసులు వదిలిపెట్టవన్న సంగతి అర్ధమైన కొడాలి నాని తెలుగు రాష్ట్రాలలో ఎక్కడున్నా అరెస్టు తప్పదన్న భయంతో నాని విశ్రాంతి పేరుతో విదేశాలకు చెక్కేయాలని భావిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఈ నేపథ్యంలోనే కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు జారీ అయ్యింది.  అయితే ఇప్పుడు కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసిన తరువాత ఆయన ఎక్కడున్నారు? ఇప్పటికే విదేశాలకు చెక్కేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఏది ఏమైనా కొడాలి నాని కేసుల విషయంలో దర్యాప్తు వేగం పుంజుకుందనీ, ఆయన అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారనీ తాజాగా జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల ద్వారా తెలుస్తోంది. 
కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు.. ఇక అరెస్టేనా? Publish Date: May 23, 2025 8:57AM

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు కలిసి రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం (మే 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లననీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (మే 22) శ్రీవారిని 72 వేల 679 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 67 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 74 లక్షల రూపాయలు వచ్చింది. అదలా ఉంచితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు నెలకు సంబంధించి దర్శన టికెట్లను శుక్రవారం (మే 23) విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు  ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు,  11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేస్తుంది. ఇక శనివారం (మే 24) ఉదయం పది గంటలకు ఆగస్టు నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. 
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు Publish Date: May 23, 2025 7:54AM

జగన్ ఒకటన్నారు.. మరి విజయసాయి ఎన్నంటారో?

రాజ్యసభ మాజీ  సభ్యుడు విజయసాయి రెడ్డిపై    వైసీపీ అధినేత, మాజీ  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ విజయసాయిని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, ఏపీలో కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకే విజయసాయి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆరోపించారు. తన రాజ్యసభ సభ్యత్వం గడువు మరో మూడున్నర సంవత్సరాలు  మిగిలి ఉండగానే విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికేనన్న జగన్.. జయఃసాయి తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూటమికి అమ్మేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   వైసీపీ ఆవిర్భావం నుంచే కాకుండా అంతకు ముందు నుంచీ కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిపై జగన్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి విజయసాయి రెడ్డికి జగన్‌తో మూడు దశాబ్దాలకు పైగా  సన్నిహిత అనుబంధం ఉంది.   జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నారు.  అది పక్కన పెడితే.. ఒక దశలో వైసీపీలో జగన్ తరువాత నంబర్ 2గా ఉన్నవిజయసాయి ఆ పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే రెండో టర్మ్ ఇంకా మిగిలి ఉండగానే ఈ ఏడాది జనవరిలో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికీ, పార్టీకీ రాజీనామా చేశారు. అప్పట్లో విజయసాయి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నాననీ, రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పారు. రాజకీయకు దూరంగా సాగు చేసుకుంటానని చెప్పారు.   అయితే.. ఇప్పుడు జగన్ విజయసాయి రెడ్డి చంద్రబాబు ప్రలోభాలకు లొంగి రాజీనామా చేశారని  అలాంటి వ్యక్తి మాటలకు, స్టేట్‌మెంట్లకు ఏ విలువ ఉంటుంది ప్రశ్నించారు. గతంలో కూడా జగన్ విజయసాయిరెడ్డి విశ్వసనీయత కోల్పోయారని పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్లోనే జగన్ వ్యాఖ్యలకు విజయసాయి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు  లిక్కర్ స్కాం  కేసులో విచారణకు హాజరైన విజయసాయి ఇచ్చిన సమాచారం అధారంగానే  నిందితుల అరెస్టులు జరుగుతున్నాయని అంటున్నారు.  మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అనివార్యం అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోన జగన్ గురువారం (మే 22) మీడియా సమావేశంలో విజయసాయిపై విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణం కేసు తన వరకూరావడానికి విజయసాయే కారణమన్న ఆగ్రహంతోనే జగన్ ఈ స్థాయిలో స్పందించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ విమర్శలపై విజయసాయి స్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. గతంలో  తనను విశ్వసనీయత లేని వ్యక్తిగా జగన్ విమర్శించినప్పుడు విజయసాయి సీరియస్ గా రియాక్టైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 
జగన్ ఒకటన్నారు.. మరి విజయసాయి ఎన్నంటారో? Publish Date: May 23, 2025 7:37AM

అరెస్టుకు జగన్ ప్రిపేరైపోయారా?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు విషయంలో ఇప్పటి వరకూ ఊహాగాన సభలే జరిగాయి. జగన్ అరెస్టవుతారా? చంద్రబాబు హస్తిన పర్యటన అందుకేనా అంటూ మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్  హాయాంలో జరిగిన ఈ కుంభకోణం మొత్త ఆ పార్టీ అధినేత, అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లోనే జరిగిందనీ, ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్టైన నిందితులు ఆ విషయాన్ని విచారణలో అంగీకరించారనీ వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కూడా అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించిందనీ, ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే అన్న నిర్దారణకు వచ్చిందనీ ప్రచారం జరుగుతోంది.  కానీ ఇప్పుడు జగన్ కూడా తన అరెస్టు అనివార్యమన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అలా చెప్పడం ద్వారా అరెస్టయ్యేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నానని అంగీకరించేశారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మద్యం కుంభకోణంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అసలు మద్యం కుంభకోణమే జరగలేదని చెప్పు కొచ్చారు. లిక్కర్ సేల్స్ తగ్గించి… ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే… కంపెనీలకు నష్టమే కదా…మరి నష్టాలు వచ్చినప్పుడు కంపెనీలు ప్రభుత్వ పెద్దలకో, ప్రతినిధులకో ఎందుకు ముడుపులు ఇస్తాయంటూ అమాయకత్వాన్ని ప్రదర్శించారు.   సరే అధికారంలో ఉండగా తాను చేసినదంతా మంచేననీ, సుపరిపాలన అందించాననీ చెప్పుకున్న జగన్ చివరిగా తనను అరెస్టు చేస్తారన్న ప్రచారంపై మాట్లాడుతూ ఏంజరిగినా దేవుడు చూస్తూ ఉంటాడని వేదాంతం మాట్లాడారు. మొత్తం మీద మీడియా సమావేశంలో జగన్ హావభావాలు, వేదాంత ధోరణిలో మాట్లాడిన మాటలను బట్టి జగన్ అరెస్టునకు మానసికంగా సిద్ధపడినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అరెస్టుకు జగన్ ప్రిపేరైపోయారా? Publish Date: May 23, 2025 6:30AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు.. కల్వకుంట్ల కవిత సంచలన లేఖ

  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్‌ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది మార్చి నెలలో బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై, అంతకు ముందు పరిణామాలపై..ఆ తర్వాత పరిణామాలను కేసీఆర్‌కు రాసిన లేఖకు కవిత ప్రస్తావించారు.  పాజిటీవ్‌,నెగిటీవ్‌ ఫీడ్‌ బ్యాక్‌ అంటూ వివరంగా లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడడంపై అనేక అనుమానాలున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేజన్లపై విస్మరించారు. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారికి వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా? తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్చడంపై మోటివేట్‌ చేస్తారని అందరూ ఎదురు చూశారు. ఓవరాలుగా కొంచెం పంచ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. 
 బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు.. కల్వకుంట్ల కవిత సంచలన లేఖ Publish Date: May 22, 2025 9:17PM

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు.. కేఆర్ఎంబీ ఉత్తర్వులు

  వేసవి నీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ నీటిని కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 10.26 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు కేఆర్ఎంబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల వరకు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 505 అడుగుల వరకు నీటిని వాడుకోవడానికి అనుమతించింది. ఏపీ అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాల్వ ద్వారా రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కేఆర్ఎంబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నీటి విడుదలతో వేసవిలో తాగునీటి సమస్య కొంతమేర తీరుతుందని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ విషయంలో కూడా బోర్డు కీలకమైన సూచన చేసింది. జులై నెలాఖరు వరకు శ్రీశైలం జలాశయంలో కనీసం 800 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలని తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపింది. ఈ నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వస్తాయని బోర్డు వర్గాలు వెల్లడించాయి.  
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు.. కేఆర్ఎంబీ ఉత్తర్వులు Publish Date: May 22, 2025 9:14PM

మళ్లీ కరోనా కాలం.. మాస్కులు అనివార్యం?

కరోనా మహమ్మరి మరో సారి దాడి చేస్తున్నదా? ఇక మళ్లీ మాస్కులు లేకుండా బయటకు రాలేని, రాకూడని పరిస్థితులు ఏర్పడుతున్నాయా? అంటే ఔననే అంటున్నారు వైద్య నిపుణులు. దేశ వ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేరళలో మే నెలలో ఇప్పటి వరకూ 182 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మాస్కులు ధరించడాన్ని తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అ దలా ఉండే కోవిడ్ కేసుల వ్యాప్తం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, థాయ్ ల్యాండ్, సింగపూర్ లలో కోవిడ్ వ్యాప్తి తీవ్రత ఒకింత అధికంగా ఉంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందనీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే.. బయటకు రాకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు వ్యాపిస్తున్న ఓమిక్రాన్ ఉప-వేరియంట్‌లు స్వల్ప ఆనారోగ్య కారకాలేకానీ ప్రమాదకరమైనవి కావని పేర్కొంది. 
మళ్లీ కరోనా కాలం.. మాస్కులు అనివార్యం? Publish Date: May 22, 2025 9:01PM

గంటా శ్రీనివాస్ వారసుడి తెలిసీ తెలియనితనం

  జోహార్ ఎన్టీఆర్, అంటూ అదే ఫ్లో లో బతికి ఉన్న వాళ్లకు జోహార్ చెప్పేశారు? ఓ యువనేత. రాజకీయాల్లో ఓటమి తెలియని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కొడుకు నోటి నుండి వచ్చిన పలుకులివి. తండ్రి ఏమో రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగి ఓటమి తెలియని నాయకుడిగా ముద్ర వేయించుకుంటే రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధంగా ఉన్న కొడుకు రవితేజ తన తెలిసీ తెలియనితనంతో అందరిలో నవ్వులపాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఓటమి తెలియని నాయకుడు ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మాజీ మంత్రి ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు... ఓటమి ఎరగని రాజకీయ నాయకుడిగా పేరున్న గంటా శ్రీనివాసరావు 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచి తన రాజకీయ ప్రయాణంలో ఓటమిని దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.  టీడీపీ నుంచి పీఆర్పీకి, అక్కడ నుంచి కాంగ్రెస్‌కి తర్వాత తిరిగి టీడీపీకి వచ్చిన గంటా శ్రీనివాస్ తన ఇమేజ్‌కి ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఓ మెట్టు పైకి ఎదుగుతూనే వచ్చారు. అలాంటి మాజీ మంత్రికి ఇప్పుడు కొడుకు రూపంలో కొత్త తలనొప్పి మొదలైందంట. రాజకీయ నాయకుల్లో అత్యధికులు కచ్చితంగా రాజకీయ వారసత్వాన్ని తెరమీదకి తీసుకొచ్చి తమ బిడ్డల్ని గ్రాండ్ లాంచ్ చేస్తారు. అలాగే గంటా శ్రీనివాస్ తన కొడుకు రవితేజని రాజకీయాల్లో గ్రాండ్‌గా లాంచింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భీమిలి నుండి గెలిచిన ఆయన భీమిలి నియోజకవర్గం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తనతో పాటు తన కొడుకును కూడా ముందు పెట్టి నడిపిస్తున్నారు. గత సంవత్సర కాలంగా భీమిలి నియోజకవర్గంలో  జరిగే అధికారిక కార్యక్రమాల్లో గంటా కొడుకు రవితేజ అన్ని తానై ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందు ఉండి పనులు చేస్తున్న రవితేజ పెద్దగా ప్రసంగాలు చేయలేదు. స్టేజీ మీద మాట్లాడితే ఒక్క నిమిషానికి మించి ఏ రోజు మాట్లాడింది లేదు.  అలాంటి గంటా రవితేజ తాజాగా భీమిలి నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో తన తండ్రితో పాటు నియోజకవర్గంలోని కీలకమైన రాజకీయ నాయకుల సమక్షంలో క్యాడర్‌ని ఉత్సాహపరచడానికి మాట్లాడుతూ నోరు జారి జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య అంటూ నినాదాలు చేశారు.రవితేజ తెలిసీ తెలియక కనబర్చిన అత్యుత్సాహాన్ని కేడర్ మొత్తం ఫాలో అయింది. చేసిన తప్పును గుర్తించి సరిదిద్దుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. రవితేజ మినీ మహానాడు స్టేజి మీద మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. బ్రతికున్న వాళ్లకు జోహార్లు ఏంటయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఆ వ్యాఖ్యలతో గంటా వారసుడు నవ్వులపాలు అవుతున్నా... ఇంతకాలం ఆయన ఎవరో తెలియని వారికి కూడా పరిచయమవుతున్నారంట. గంటా రవితేజ తెలియని వారు ఉండరు అనే అంతగా సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు.   గంటా శ్రీనివాస్ తన కొడుకుని  సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టి కొత్త ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నారు. స్టార్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీతో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌తో జై దేవ్ అనే మూవీతో గంట రవితేజను లాంచ్ కూడా చేశారు. జయదేవ్ సినిమా డిజాస్టర్ కావడంతో గంటా రవితేజ తనకి సినిమాలు సరిపడవు అనుకున్నారో ఏమో?మొదటి సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసి తండ్రి రాజకీయ వారసుడిగా ఓనమాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు.  టీడీపీ అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో జరుగుతున్న మినీ మహానాడు తన ఆ రాజకీయ ఆరంగేట్రానికి సరైన సమయం అని భావించిన రవితేజకు తొలి పొలిటికల్ ప్రసంగంలోనే చుక్కెదురవ్వడంతో.. ఆయన భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుందన్న సందేహాలు మొదలయ్యాయి.  2024 ఎన్నికల బరిలో తన వారసుడ్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించాలని గంట శ్రీనివాస్ ప్రయత్నం చేసినట్లు జోరుగా ప్రచారం సాగింది.  చంద్రబాబు దగ్గర కూడా తన కొడుకుకి సీటు ఇవ్వాలని గంటా కోరినట్లు అప్పట్లో టాక్ నడిచింది. 2024 ఎన్నికల్లో ప్రతి సీటు టీడీపీకి కీలకం కావడంతో చంద్రబాబు నిరాకరించడంతో గంట తానే స్వయంగా భీమిలి బరిలోకి దిగి విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కచ్చితంగా గంట శ్రీనివాస్ కు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది.మంత్రి పదవి రాకపోవడంతో నియోజకవర్గ మీద కొంత ఫోకస్ తగ్గించిన గంటా తన వారసుడ్ని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారంట.  రవితేజను భీమిలి నియోజకవర్గంలో బలమైన నేతగా తయారు చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్న మాజీ మంత్రి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కుమారుడ్ని ముందు పెట్టి నడిపిస్తున్నారంట. తీరా చూస్తే రవితేజ మినీ మహానాడు స్పీచ్‌తో అందరికీ కామెడీగా మారిపోయారు. మరి సినిమాల్లో ఫ్లాప్ అయిన ఆయన పొలిటికల్ స్క్రీన్‌పై ఏ మాత్రం రాణిస్తారో చూడాలి.
 గంటా శ్రీనివాస్ వారసుడి తెలిసీ తెలియనితనం Publish Date: May 22, 2025 8:49PM

కేసీఆర్ కుటుంబంలో కొత్త డ్రామా... తండ్రి వైఫల్యాలను ఎత్తి చూపించిన కవిత

  బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కెసిఆర్ స్థానంలో పార్టీపై పెత్తనం కోసం కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నట్టు ప్రచారం జరిగింది. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లకు తల్లిదండ్రుల్లో తలా ఒకరు సపోర్ట్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఇటీవల కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. బావా బామ్మర్దులు ఒకటికి రెండుసార్లు భేటీ అవ్వటం, కేటీఆర్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తన సపోర్టు ఉంటుందని హరీష్ రావు ప్రకటించటంతో  వారి మధ్య ఏమీ లేదని గులాబీ శ్రేణులు సంబరపడిపోయాయి. అయితే తాజాగా కవిత... కేసీఆర్ కు రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా నియోజకవర్గాలు చుట్టి వచ్చిన కవిత.. పార్టీ క్యాడర్, లీడర్ షిప్ ఏమనుకుంటుందో అవే విషయాలను చెబుతున్నా అంటూనే పార్టీకి కొన్ని సూటి ప్రశ్నలనే సంధించారు. మహిళా సమానతలో పదేళ్లలో అనుకున్నంత ముందుకు వెళ్లలేక పోయామన్న  కవిత డైలాగ్ తో గులాబీదళం ఇరకాటంలో పడింది.  ప్రత్యర్థి పార్టీలు కూడా కెసిఆర్ పై ఎప్పటి నుంచో అవే విమర్శలు చేస్తున్నాయి.కేసీఆర్ కు కవిత కొన్ని రోజుల క్రితమే రాసినట్లుగా చెబుతున్న లేఖ తాజాగా బయటికొచ్చింది. ఇప్పుడు ఆ లేఖ చుట్టూ కొత్త రాజకీయ చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ తర్వాత కేసీఆర్‌కు ఆయన కుమార్తె,  కవిత ఓ లేఖ రాశారు. సభ నిర్వహించిన తీరుపై తన అభిప్రాయాన్ని లేఖలో కుండ బద్దలు కొట్టారు . పార్టీ మీటింగ్ సక్సెస్ అయ్యిందంటూనే లోపాలను బయటపెట్టారామె. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ రెండు పార్టులుగా లేఖ రాశారు. తెలంగాణ అంటే బీఆర్‌ఎస్ - తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలామంది అనుకున్నారని కవిత తన తండ్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతంపై మాట్లాడతారని అనుకున్నట్టు కవిత రాసుకొచ్చారు. కేసీఆర్ స్పీచ్ బాగుందంటూనే.. ఇంకొంచెం పంచ్‌ ను కేడర్ ఎక్స్‌పెక్ట్ చేసిందని కవిత తెలిపారు. ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్‌ బిల్లు మీద మాట్లాడకపోవడం నెగిటివ్ అయిందన్నారు. బీసీలకు 42శాతం అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడమూ నెగిటివ్ అని లేఖలో ప్రస్తావించారామె. ఇంత పెద్ద మీటింగ్‌కు పాత ఇంచార్జులను ఇవ్వడంపై కొన్ని నియోజకవర్గాల్లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని, లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈ ఇంఛార్జులే బీఫామ్స్ ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీలుగా ఉండాలనుకునేవాళ్లు రాష్ట్ర నాయకత్వమే బీఫామ్ ఇవ్వాలని కోరుతున్నారని కవిత తన లెటర్‌లో రాశారు.భవిష్యత్తులో బీజేపీతో పొత్తుపెట్టుకుంటారన్న ప్రచారాన్ని చాలామంది మొదలుపెట్టారన్న విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంకొంచెం బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ  అంటూ... ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న కవిత  పేర్కొనటం చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామన్న మెసేజ్‌ను కాంగ్రెస్ జనంలోకి బలంగా తీసుకెళ్లిందని  ఆమె ఎత్తి చూపారు. అన్నీ చెప్పాక పెద్దలేఖ రాసినందుకు క్షమించాలని ప్రత్యేకంగా కవిత కోరుతూ అందరికీ అందుబాటులో ఉండాలని కెసిఆర్ ని కవిత  కోరడం కూడా ఇప్పుడు బిగ్ డిబేట్ కు దారి తీసింది.    టిఆర్ఎస్  రజతోత్సవం మొత్తం కేసీఆర్, కేటీఆర్ నిర్వహించారని, కవిత, హరీశ్ రావు డమ్మీగా మారిపోయారన్న ప్రచారం ఉంది . పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ప్రెసిడెంట్‌‌గా వ్యవహరిస్తున్నారు అని గులాబీ శ్రేణులే అంటున్నాయి . ప్రస్తుతం కవిత లేఖతో  వైఎస్ జగన్‌‌పై షర్మిల ఎలాగైతే ఎదురు తిరిగారో.. కేటీఆర్‌‌‌‌పై కూడా కవిత పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్న చర్చ మొదలైంది.వీటికి తోడు ఇటీవల ములుగు జిల్లాలో సోదమ్మలతో సోది జోస్యం చెప్పించుకున్నారు కవిత. అందులో కవిత సీఎం అవుతారని జోస్యం చెప్పారంట. ఆ విషయం కూడా హాట్ టాపిక్ అయింది. కవిత బీసీల గురించి చాలా మీటింగ్స్ పెట్టారు. అక్కడ ఆమె అనుచరులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు కవిత ఏ నియోజకవర్గం వెళ్లినా ఆమె అనుచరగణం సీఎం సీఎం అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. మొత్తానికి ఈ లేఖతో కెసిఆర్ కుటుంబంలో కొత్త డ్రామా మొదలైంది అంటున్నారు .
కేసీఆర్ కుటుంబంలో కొత్త డ్రామా... తండ్రి వైఫల్యాలను ఎత్తి చూపించిన కవిత Publish Date: May 22, 2025 8:37PM

ఎక్కడ నక్కినా ఉగ్రవాదులను వదిలే ప్రశక్తే లేదు.. కేంద్ర మంత్రి జైశంకర్

పాకిస్థాన్ సహా ప్రపంచంలో ఏ మూల నక్కినా ఉగ్రవాదులను వదిలే ప్రశక్తే లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్ లో పర్యటిస్తున్న జైశంకర్ అక్కడి మీడియాతో మాట్లాడారు.  సిందూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ తో కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఇసుమంతైనా లేదని కుండబద్దలు కొట్టారు.  ట్రంప్ మాటలు పట్టించుకోబోమని ఉద్ఘాటించారు. అలాగే కాశ్మీర్‌పై చర్చల ప్రశ్నేలేదన్నారు. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని స్సష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్ తన విధానంగా చేసుకుందనీ, ఈ విషయంపై భారత్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోందని వివరించిన జైవంకర్  అలాంటి చర్యలకు తగిన రీతిలో బదులిచ్చే హక్కు భారత్‌కు ఉందని  అన్నారు.  . ఏప్రిల్ 22 నాటి ఘటనలు పునరావృతమైతే, కచ్చితంగా ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా ఉంటుందని పాక్ ను ఆపరేషన్ సిందూర్ ద్వారా హెచ్చరించామని అన్నారు. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే అన్న విషయంలో రెండో అభిప్రాయానికి తావే లేదనీ,  తేల్చి చెప్పారు.  పాకిస్థాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ భాగాన్ని ఎప్పుడు ఖాళీ చేస్తారన్న విషయంపై మాత్రమే పాకిస్థాన్ తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.అంతే కానీ  నియంత్రణ రేఖ, జమ్మూకశ్మీర్ పాలనా వ్యవహారాలపై చర్చించే ప్రశ్నే లేదని జైశంకర్ చెప్పారు.   అదలా ఉండగా అంతర్జాతీయంగా భారత్ ఆపరేషన్ సిందూర్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టేందుకు భారత్ చేపట్టిన దౌత్య యుద్ధానికి సర్వత్రా సానుకూల స్పందన లభిస్తోంది. ఏడు అఖిల పక్ష బృందాలను ప్రపంచ దేశాల పర్యటనకు పంపింది.  యూఏఈ, జపాన్ లకు వెళ్లిన అఖిలపక్ష బృందాలు అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. పాక్ దుశ్చర్యలు వివరించారు. ఉగ్రవాదంపై భారత్ పోరుకు యూఏఈ, జపాన్ లు పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా భారత్ పై ప్రశంసల వర్షం కురిపించాయీ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
 ఎక్కడ నక్కినా ఉగ్రవాదులను వదిలే ప్రశక్తే లేదు.. కేంద్ర మంత్రి జైశంకర్ Publish Date: May 22, 2025 8:27PM

కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేస్తారా?

కేసీఆర్ కు బహిరంగ లేఖ సంకేతమేంటి? సొంత కుంపటికి రెడీ అయిపోయినట్లేనా? బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ తీరు పట్ల, పార్టీలో తనకు ప్రాముఖ్యత దక్కక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకునే నిర్ణయానికి వచ్చేశారా? అంటే ఇటీవలి పరిణామాలకు తోడు తాజాగా ఆమె పార్టీ అధినేత, తన కన్న తండ్రి అయిన కేసీఆర్ కు రాసిన ఘాటు లేఖ చూస్తుంటే ఔనని అనక తప్పడం లేదంటున్నారు విశ్లేషకులు.   ఇటీవలి కాలంలో పార్టీ పట్ల కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు జోరుగా వినిపించాయి. వినిపిస్తున్నాయి కూడా.   ఇపపుడు తాజాగా ఆమె పేరుతో తాజాగా బయటకు వచ్చిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఇందులో ఆమె బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తనకు వచ్చిన ఫీడ్ బ్యాక్ గురించి ప్రస్తావించారు. రజతోత్సవ సభకు పాజిటివ్ రెస్సాన్ తో పాటు నెగటివ్ రెస్పీన్స్ కూడా గట్టిగానే ఉందని కేసీఆర్ ను ఉద్దేశించిన ఆ లేఖలో పేర్కొన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలోని మంచి, చెడులను ఆ లేఖలో పేర్కొన్నారు.  ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకించడం , పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలపడం,    కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండానే ప్రకటించడం కేసీఆర్ ప్రసంగంలో మంచి అంశాలని పేర్కొన్న కవిత.. అదే లేఖలో కేసీఆర్ ప్రసంగంలోని బేడ్ ఎలిమెంట్స్ కూడా ప్రస్తావించారు.  కేసీఆర్ రజతోత్సవ సభలో చేసిన మొత్తం ప్రసంగంలో బీజేపీని విమర్శించడానికి కేవలం రెండంటే రెండు నిముషాలే వెచ్చించారనీ, ఇది ప్రజలకు భవిష్యత్ లో బీఆర్ఎస్, బీజేపీల పొత్తు ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చిందని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు.  తనను జైలుపాలు చేసిన బీజేపీని విమర్శించకపోవడం వ్యక్తిగతంగా తనకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని,  . అలాగే , బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని కేసీఆర్ తన ప్రసంగంలో కనీసం ప్రస్తావించకపోవడం కూడా బీసీలను పార్టీలకు దూరం చేసిందని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు.   ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం కూడా ప్రజలలో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడానికి దోహదపడిందన్నారు. ఇక   ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్న నేతలకు రజతోత్సవ సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వకపోవడం కూడా పార్టీకి మైనస్ గా మారిందని పేర్కొన్నారు.  మొత్తం మీద కవిత కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. అదే సమయంలో ఆ లేఖ కవిత రాసి ఉండకపోవచ్చునని కూడా కొందరు అంటున్నారు.  కన్నతండ్రి అయిన కేసీఆర్ తో ఏ విషయాన్నైనా దైర్యంగా చెప్పే చనువు, స్వేచ్ఛ ఉన్న తన అభిప్రాయాలు, అసంతృప్తిని ఆయనకు లేఖ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.  అయితే ఇటీవలి కాలంలో పార్టీ లైన్ కు భిన్నంగా కవిత చేస్తున్న ప్రకటనల కారణంగా కేసీఆర్ తో భేటీకి కవితకు అవకాశం లేకుండా పోయి ఉండొచ్చనీ, అందుకే బహిరంగ లేఖ రూపంలో తన అభిప్రాయాలను, అసంతృప్తినీ వ్యక్తం చేసి ఉంటారన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జరుగుతోంది.  మొత్తం మీద కవిత పేరుతో వెలువడిన బహిరంగ చర్చ బీఆర్ఎస్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ వాతావరణం ఉందనడానికి తార్కానమని అంటున్నారు.  
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేస్తారా? Publish Date: May 22, 2025 7:44PM

ముప్పేట దాడితో విలవిల్లాడుతున్న మాజీమంత్రి పెద్దిరెడ్డి

  రాయలసీమ జిల్లాలలో తిరుగులేని హవా నడిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సింగిల్ జిల్లాకు పరిమితం కానున్నారు. అయనకు రాజకీయంగా చెక్ పెట్టడానికి  అన్నిదారులను కూటమి ప్రభుత్వం మూసివేస్తుంది. గతంలో మూడు జిల్లాలకు పరిమితమైన అయన హావాను కేవలం ఓ జిల్లాకు పరిమితం చేయడానికి సిద్దమైంది. అందులో బాగంగానే అయన నియోజకవర్గం పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపిందంటున్నారు. దాంతో పాటు అయన అస్తులపై విజిలెన్స్ నివేదిక అదారంగా ఎక్కడి కక్కడ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం దూకుడు పెంచింది. పెద్దిరెడ్డిని ఒక్క జిల్లాకు పరిమితం చేయడంతో టీడీపీ నేతల కంటే వైసీపీ సీనియర్లు తెగ హ్యాపీగా పీలవుతున్నారంట.వైసీసీ ప్రభుత్వంలో జిల్లాలో విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబ ప్రాబల్యం ఉండేట్లు పెద్దిరెడ్డి చక్రం తిప్పారు.   తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్‌లో ఉన్నప్పటికి చాల తెలివిగా తన నియోజకవర్గాన్ని మాత్రం చిత్తూరు జిల్లాలో కలిపించుకున్నారు. ఆయన కూమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపి కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి  ప్రాతినిధ్యం వహిస్తున్న తంబల్లపల్లి నియోజకవర్గం కూడా అన్నమయ్య జిల్లాలో ఉంది. దీనికితోడు అయనకు రాజంపేట నియోజకవర్గంలో దగ్గర బంధువులు ఉన్నారు. మరో వైపు పెద్దిరెడ్డి నివాసం తిరుపతిలో ఉండటంతో అక్కడ కూడా తనకు ప్రోటో‌కాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ అగిపోయింది.అయితే అయన వ్యాపారాలు అస్తులు తిరుపతిలో ఉండటంతో పాటు అయన అనుంగు శిష్యులు అంతా తిరుపతి జిల్లాలో ఉండటంతో ఇక్కడ కూడా అయన ప్రభ వెలిగిపోయింది అధికారం ఉన్నప్పుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయన వర్గం 2019-24 మద్య కాలంలో తమ అధికారాన్ని అన్ని విధాలుగా 3 జిల్లాలలో చూపించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున భూముల అక్రమణ జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులిచెర్ల మండలంలోని మంగళం పెట అటవీ భూముల్లో  సరిహద్దు రాళ్లు నాటిన పెద్దిరెడ్డిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసింది. పాకాల కోర్టులో దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ మొదలు అయ్యాయి. మదనపల్లి బండమీదామ్మపల్లెలో అయన ఆక్రమించిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో సీఐడీ కోర్టులో ప్రోసీడింగ్స్ మొదలయ్యాయి.. ఇక తిరుపతిలోని పెద్దిరెడ్డి నివాసం,  పార్టీ కార్యాలయం, గోశాల అన్నీ బుగ్గ మఠానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో ఉన్నాయన్న సర్వే డిపార్ట్ మెంటు నివేదిక అదారంగా అయనను విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. ఇక ఏపీ లిక్కర్ స్కాంలో పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిధున్‌రెడ్డి నాలుగో నిందితుడు.  అలా పెద్దిరెడ్డిపై ముప్పేట దాడి మొదలవ్వడంతో కూటమి శ్రేణులతో పాటు వైసీపీ నేతలు కూడా ఖుషీ అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోపెద్దిరెడ్డి చెప్పిందే శాసనం అన్నట్లు నడిచింది. అప్పట్లో అయనను కేవలం అన్నమయ్య జిల్లాకే పరిమితం చేయాలని వైసీపీలోన మిగతా జిల్లా మంత్రులు , సీనియర్లు ప్రయత్నించినప్పటికి ఫలించలేదు. అప్పట్లో డిప్యూటీ సియం గా ఉన్న నారాయణ స్వామి కంటే మాములు మంత్రి అయన పెద్దిరెడ్డికి అధికారిక కార్యక్రమాలలో అధికారులు పెద్దపీట వేసేవారు. చివరకు సియం హాజరైన అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ నిలబడి ఉంటే ద్దిరెడ్డి కూర్చున్న పోటోలు అప్పట్లోసోషియల్ మీడియాలో  పెద్దఎత్తున హల్ చల్ చేసాయి. ఇక రోజా సైతం పెద్దిరెడ్డి వైభోగం చూస్తూ తనకు మంత్రి హోదా ఎందుకు అని ఫీలైన సందర్భాలున్నాయంట. ఇలాంటి తరుణంలో అయన నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో ఉండటంతో పుంగనూరుని చిత్తూరులో కలవవద్దని వైసీపీ నేతలు కోరారంట.  కాని అప్పుడు పెద్దిరెడ్డి హావా ముందు వీరి మాటలు సాగలేదంట. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఇబ్బంది రాకుండా తిరుపతి ,చిత్తూరు జిల్లా నుంచి దూరం చేయడానికి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపేసింది. దాంతో పాటు పుంగనూరు సెగ్మెంట్లోని పులిచెర్ల మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడానికి చర్యలు తీసుకుందంట. పులిచెర్ల మండలం గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. పులిచెర్లలో టీడీపీ బలంగా ఉండటంతో ఆ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపి సొంత నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికి స్కెచ్ గీసిందంటున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై చాలామంది వైసీపీ ముఖ్య నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారంట. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ నేతలు ఇకపై పెద్దిరెడ్డి పెత్తనం ఉండదని సంబరపడిపోతున్నారంట.
ముప్పేట దాడితో విలవిల్లాడుతున్న మాజీమంత్రి పెద్దిరెడ్డి Publish Date: May 22, 2025 6:40PM

తిరుమలలో అపచారం.. భక్తులు ఆందోళన

  తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి పురోహిత సంఘం వద్ద  ఉన్న ఖాళీ ప్రదేశంలో ముస్లిం వ్యక్తి నమాజ్  చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని.. భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు.  గుర్తు తెలియని వ్యక్తి నమాజ్ చేయడాన్ని అటు స్థానికులు సైతం గమనించారు. వెంటనే టీటీడీకి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తిరుమలకు వచ్చిన ఆ వ్యక్తి వాహనం నెంబర్ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్నా అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమతస్తులు ప్రార్ధనలు చేయడం శ్రీవారిని అపచారం చేయడమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పల్గమా దాడి నేపద్యంలో ఇలాంటి ఘటనలో తిరుమలలో జరగడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు  
తిరుమలలో అపచారం.. భక్తులు ఆందోళన Publish Date: May 22, 2025 6:31PM